Appam, Appam - Telugu

జూలై 05 – “అపవిత్రపరచుట!”

“నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను” (లేవి. 18-21).

మనము ప్రభువునకు చెందినవారము. ఆయన మన దేవుడు. ఆయన యొక్క పరిశుద్ధ నామము మనకు ధరింపబడియున్నది. ఆయన మనలను తన కొరకు పరిశుద్ధ జనముగాను, యాజక సమూహముగాను ఏర్పరచుకొనెను.

పద్నాల్గోవ శతాబ్దమునందు జీవించిన ఒక బలమైన ఉజ్జీవపు సేవకుని యొక్క పేరు సవొనారోల (Savonarola) అయియున్నది. ఆ దేశము యొక్క పాపములు సొద్ధమా గొమోర్ర యొక్క పాపముల కంటే అతిభయంకరము అని ప్రసంగించెను. ఆ దినములయందు గల రాజు మరియు మత నాయకులు మొదలగు ముగ్గురిని ముఖాముఖిగా దర్శించి మీరు మానక ప్రభువు యొక్క నామమును అవమానపరిచి, అపవిత్రపరచుచు ఉండినందున ఒకే సంవత్సరమునందు మణించవలసినదై ఉండును అని హెచ్చరించెను.

అయితే వారు, ఆయన హెచ్చరికను అలక్ష్యము చేసిరి. జరిగిన సంగతి ఏమిటో తెలియునా? ఆ ముగ్గురును అదే సంవత్సరమునందు మరణించిరి. జనులలో గొప్ప భయమును, గొప్ప ఉజ్జీవమును కలిగెను. అవును! అపవిత్రపరుచుట అను సంగతి మిగుల అపాయకరమైన సంగతియైయున్నది.

మనము వేటినంతా అపవిత్ర పరుచకూడదు అని తెలియునా? మొదటిగా, దేవుని నామమును (లేవి. 18:21). రెండోవది, పరిశుద్ధస్థలమును (లేవి. 21:23). మూడోవది, విశ్రాంతి దినమును (యెహేజ్కేలు. 23:38). నాల్గోవది, పితరులతో చేయబడిన నిబంధనను (మలాకీ.2:10) అని బైబిలు గ్రంధము హెచ్చరించుచున్నది. మన దేవుడు ప్రేమ గలవాడే. అయితే ఆయన యొక్క నామమును అపవిత్ర పరచున్నప్పుడు, ఆయన నీతి గల న్యాయాధిపతిగా మారుచున్నాడు. ఆయన ఖడ్గము యొక్క పదును మహా గొప్ప పదనుగలది.

ఆదాము అవ్వల యొక్క పాపము నిమిత్తము వారు ఏదేను తోట నుండి తరిమి వెయ్యవలసినదై ఉండెను. ఒక ఆకాను యొక్క స్వార్ధమును బట్టి అతడును, అతని యొక్క కుటుంబమును రాళ్లతో కొట్టబడి చావవలసినదై ఉండెను. గెహాజి యొక్క ధనాశనుబట్టి అతడును, అతని యొక్క సంతతియును కుష్ఠరోగులుగా జీవించవలసినదై ఉండెను.

అననీయ సిప్పిరా పరిశుద్ధాత్మకు విరోధముగా అబద్ధము చెప్పుట చేత న్యాయ తీర్పు అను మరణము ఉన్నపనముగా వారి పైకి వచ్చెను. అంత మాత్రమే కాదు, ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును (1. కొరింథి. 3:17) అని బైబిలు గ్రంధము హెచ్చరించుచున్నది.

అపో. పౌలు వ్రాయుచున్నాడు, “దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు” (రోమీ. 11:21,22). దేవుని బిడ్డలారా, మనము మన జీవిత దినములంతటను ప్రభువు యొక్క పరిశుద్ధతకు తగినట్లుగా జీవించి, ఆయన యొక్క నామమును అపవిత్ర పరచకుండా భయభక్తితోను, జాగ్రత్తతోను నడుచు కొనవలెను.

నేటి ధ్యానమునకై: “అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును” (యెహేజ్కేలు. 36:23).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.