Appam, Appam - Telugu

జూలై 04 – పరిశుద్ధాత్ముని వలన పరిశుద్ధత

“మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని  మీరు మీ సొత్తు కారని మీరెరుగరా?  ”    (1. కోరింథీ. 6:19) 

మీరు పరిశుద్ధాత్ముని వలన జన్మించవలెను; పరిశుద్ధాత్ముడు ఇచ్చు మాటలను మాట్లాడవలెను పరిశుద్ధాత్మ వలన నడిపించ బడవలెను. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముని వలన పరిశుద్ధ పరచబడవలెను.

క్రైస్తవ జీవితము చేయుటకు కోరుకొనుచున్న మీరు, ప్రతి దినమును పరిశుద్ధత నుండి అత్యధిక పరిశుద్ధతను పొందుకొనుచునే ఉండవలెను. మిమ్ములను మీరే శుద్ధీకించుకుని క్రీస్తు మీ ఎదుట ఉంచియున్న అతి పరిశుద్ధమైన త్రోవయందు ముందుకు కొనసాగుచూనే ఉండవలెను. ప్రభువు యొక్క మహిమగల రాకడయందు పరిశుద్ధతనుండి   అత్యధిక పరిశుద్ధతను నొంది,   మహిమ నుండి అత్యధిక మహిమను పొందుకొని; క్రీస్తు యొక్క పోలికయందు రూపాంతరము చెందవలెను.

అపోస్టులుడైన పౌలు సెలవిచ్చుచున్నాడు:    “సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక”   (1. థెస్స. 5:23).

పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరును ప్రభువును దర్శించలేరు. పరిశుద్ధత లేకుండా రెండవ రాకడయందు ప్రభువు మధ్య ఆకాశము నందు వచ్చుటను చూడనులేము. మనకు పరిశుద్ధతను దయచేయునట్లు ప్రభువు ఉంచియున్న అంశములు మూడు కలదు. మొదటిది క్రీస్తు యొక్క రక్తము. రెండోవది దేవుని యొక్క వచనము. మూడవది పరిశుద్ధాత్ముడు. ఆ మూడిటి ద్వారానే ప్రభువు మనలను పరిశుద్ధపరచుచున్నాడు.

దీనిని గూర్చి మనము చేయవలసినది ఏమిటని మీరు ఒకవేళ అడగవచ్చును. మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధ జీవితమునకు సమర్పించుకొనవలెను  అనుటయే దానికి గల పరిష్కారము. పరిశుద్ధతపై ఎడతెరిపి లేని దప్పికయు, వాంచ్ఛయు,  మీయొక్క హృదయమునందు నిత్యము లేవనెత్తుచూనే ఉండవలెను. అప్పటికప్పుడు మిమ్ములను దేవుని సమకమునందు నిలబెట్టి, తప్పిదములను తీసివేసి శుద్ధీకరించు కొనవలెను. అంత మాత్రమే కాదు, మీ యొక్క ఆత్మ ప్రాణము శరీరమును పరిశుద్ధత కొరకు ప్రతిష్టంచవలెను.

అపోస్తులుడైన పౌలు వ్రాయుచున్నాడు:   “మీరు మీ శరీరములను  పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా  ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి  మిమ్మును బతిమాలుకొనుచున్నాను”.    (రోమీ. 12:1).   మన యొక్క శరీరమును పరిశుద్ధత  కొరకు సమర్పించుకొనవలెను. కారణము, మన యొక్క శరీరమే ప్రభువు యొక్క ఆలయమైయున్నది. పరిశుద్ధతగల దేవుడు మన యొక్క శరీరమునందు నివాసఉండుటకు కోరుచున్నాడు.

దేవుని బిడ్డలారా, మీ యొక్క శరీరము గూర్చి జాగ్రత్తగలిగి ఉండుడి. మలీనము పరచబడని నూతన స్థలమునకు మీయొక్క శరీరమును నడిపించవలెను. లోకము యొక్క  తుచ్ఛమైన ఇచ్ఛలకును, మనస్సును, శరీరమును కోరుకొనుచున్న అంశములను నెరవేర్చుటకు మీ యొక్క అవయవములను అమ్మి వేయకుడి.

నేటి ధ్యానమునకై: 📖”మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని  మీరు మీ సొత్తు కారని మీరెరుగరా?  ”    (1. కోరింథీ. 6:19).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.