bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

జూలై 03 – తగ్గించుకొనువాడు

“తమ హృదయములు తగ్గించుకొని (లొంగి)….ఒప్పుకొనినయెడల…నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసుకొందును”    (లేవీ. 26:41,42).”

తగ్గింపు గలవారికి ప్రభువు విస్తారమైన ఆశీర్వాదములను ఉంచియున్నాడు.  “తగ్గించుకున్నట్లయితే” నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆశీర్వదించెదను అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువు మనకు ఇచ్చియున్న వాక్కులును, వాగ్దానములనే  ఓడంబడిక లేక నిబంధన అను మాటలను సూచించుచున్నది. మూల పితరులతో నిబంధన చేయుచున్నప్పుడు ప్రభువు యేఏ వాగ్దానములను ఇచ్చెనో వాటన్నిటిని, మీరు మిమ్ములను తగ్గించుకున్నప్పుడు మీకు సమస్తమును దయచేయును.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని, ప్రార్థననుచేసి, నన్ను వెదకి, తమ చెడుమార్గములను విడిచినయెడల, అప్పుడు ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును”    (2దినవృ. 7:14).

తమ్మును తగ్గించుకొనుటకు ఎన్నడను వెనకంజ వేయనేకూడదు.   ‘నేను రక్షింపబడ్డాను, అభిషేకమును పొందుకున్నాను, సీయోను ప్రయాణము చేయుచున్నాను’  అనియంతా  ఆతిశయించుకొనుచు ఇతరులను చులకన చేయకూడదు. కులమును గూర్చి అతిశయించుటియు, సంఘమును గూర్చి అతిశయించుడియు మీలోనికి వచ్చి గర్వములోనికి నడిపించవచ్చును.

దానియేలు ఎలాగున తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించెను అనుటను చూడుడి. దానియేలు ఒక దైవజనుడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొనినవాడు (దాని. 6:3). ప్రభువునకు బహు ప్రియుడు అని సాక్ష్యము పొందినవాడు (దాని. 9:23). కలలను, దర్శనములను చూచువాడు. అది మాత్రమే గాక, వాటికి అర్థములను, భావములను వివరింపగలవాడు. దేవునితో అంతటి అనుభవమును కలిగినవాడై ఉన్నప్పటికిని దానియేలు దానిని గూర్చి రవంత కూడా అతిశయింపనివాడై ఉండెను. తన్ను తనతోపాటు కూడా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను కలుపుకొని,   “మేము పాపము చేసియున్నాము మమ్ములను క్షమించుము”  అని  గోజాడి ప్రార్థించెను అని బైబిలు గ్రంథము నందు చదువుచున్నాము.

అదేవిధముగా నెహెమ్యా యొక్క ప్రార్ధనను కూడా చూడుడి. ఎంత తగ్గింపుతో ప్రార్ధించుచున్నాడు అనుటను గమనించుడి.   ‘నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారులగు మా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము.  నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివిు’   (నెహెమ్యా.1:6,7)  అని తన్ను తాను తగ్గించుకుని తన జనులతో పాటు కలసి ప్రార్ధించెను.

దేవుని బిడ్డలారా, మీ జీవితము యొక్క అన్ని సందర్భముల యందును, తగ్గింపును కనపరచుడి. తగ్గింపే ఆశీర్వాదముల  యొక్క తాళపుచెవి  అను సంగతిని మరచిపోకుడి.  మీరు మిమ్ములను తగ్గించుకొని ప్రార్థించుచున్నప్పుడు, మీయొక్క విన్నపములకు ప్రభువు అవును అనియు, ఆమేన్  అనియు జవాబును ఇచ్చును

 నేటి ధ్యానమునకై: “యెహోవా, ఇప్పుడు నీ దాసునిగూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక”    (1.దినవృ. 17:23).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.