Appam, Appam - Telugu

జూలై 02 – “రిబ్కాయొక్క భుజము!”

“రిబ్కా కడవను భుజము మీద పెట్టుకొని బయలుదేరి వచ్చెను” (ఆది.కా. 24:15).

రిబ్కాయొక్క భుజము మీద కడవ ఉండెను. ఆ కడవలో ఉన్న నీళ్లు ఆమె యొక్క కుటుంబమునకు మాత్రము గాక,ఆ స్థలమునకు నూతనముగా వచ్చిన ఎలియాజరుకును అతని యొక్క ఒంటెలకు కూడా సరిపోయినదై ఉండెను. ఆ భుజములకు లభించిన ఎంతటి గొప్ప మేలు! ఆలోచించిచూడుడి.

రిబ్కాయొక్క కడవ ఖాళీకడవ కాదు. లోతైన నూతలోనికి దిగి నీళ్లను నింపుకొని వచ్చేటువంటి నిండైన కడవ. దానిని భుజములపై మోయుచున్నప్పుడు భారముగానే ఉండి ఉండవచ్చును. అట్టి భారమును ఆమె తన యొక్క భుజములపై సహనముతో మోసినందున, ఆమె యొక్క ఇంటిలో ఉన్నవారికిని ఆమె వలన మేలు చేయగలిగెను. ముందు వెనక తెలియని వారికి కూడాను సహాయము చేయగలిగెను.

ఆ చిన్నదాని భుజముపై నుండి ఆమె యొక్క కుటుంబమునకును, ఇతరులకును అంతటి మేలుకరమైన అంశములు వచ్చుచున్నదంటే, క్రీస్తు యొక్క భుజములు ఎంతటి అత్యధికమైన ఆశీర్వాదములను మనకు తీసుకొని వచ్చుచున్నదైయుండును! ఆయనే సమస్త మేలులకును, ఔన్నత్యములకును, ఆశీర్వాదములకును కారణభూతుడు.

ఆయన యొక్క భుజములు భారమును భరించు భుజములు. మన యొక్క సమస్త భారములను, దుఃఖములను ఆయన యొక్క భుజములపై మోపి వేయవచ్చును. మన యొక్క చింతలను, బాధలను, కన్నీటిని ఆయనపై మోపి వేయవచ్చును. మన యొక్క సమస్యలను, పోరాటములను, సమస్తమును ఆయనపై దింపి వేయవచ్చును.

కీర్తనకారుడు సెలవిచ్చుచున్నాడు: “నీ భారము యెహోవా మీద మోపుము” (కీర్తనలు. 55:22). పేతురు సెలవిచ్చుచున్నాడు: “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి” (1. పేతురు. 5:7). అవును, ప్రభువు మిమ్ములను గూర్చి చింతించుచున్నవాడు. ఆయన మిమ్ములను ఆదరించును. ఆయన యొక్క బలమైన భుజములు మీ యొక్క సమస్త భారములను భరించుటకు శక్తిగలదైయున్నది.

ఎంత కాలము మీయొక్క విచారములను మీరే భరించుచూనేయుందురు? అప్పుల భారము, ఇంటి సమస్య అను భారము, కానీ మాటలను గూర్చిన భారము, పాపపు భారము మొదలగు వాటినన్నిటిని మీరే భరించుచున్నప్పుడు. నేడే వాటిని ప్రభువు యొక్క భుజములపై మోపి వేసి, ఆయనను కృతజ్ఞతతో స్తుతించుదురుగాక. అప్పుడు మీ యొక్క అంతరంగమునందు గొప్ప విశ్రాంతి కలుగును. దైవీక సమాధానము వచ్చును. ప్రాణమునందు గొప్ప విడుదలను విశ్రాంతియు వచ్చును. “యెహోవా నా పక్షమున సమస్త కార్యమును సఫలము చేయును” (కీర్తనలు. 138:8).

ప్రభువు మన కొరకు మన యొక్క పాపములను, శాపములను, రోగములను, బలహీనతలను, దుఃఖములను భరించెను. నేడు కూడాను మీ యొక్క భారములను మోయుటకు ప్రభువు ఆసక్తితో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీయొక్క భారములను ప్రభువు యొక్క భుజములపై మోపివేయుడి.

నేటి ధ్యానమునకై: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా! మీరందరు నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతిని కలుగజేతును” (మత్తయి. 11:28).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.