No products in the cart.
జూలై 01 – ప్రియమైన ఆరాధన!
“యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను; కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు” (ఆది.కా. 4:4,5).
ఆరాధన యొక్క శిఖరమును మనము చేరకుండునట్లు అడ్డగించేటువంటి పలు ఆటంకములును, మరవదగిన కొన్ని అంశములును ఉండే తీరుతున్నాయి. కయీనును అతని యొక్క అర్పణను ప్రభువు లక్ష్యపెట్టక పోయినట్లును పలు సమయములయందు మన అంతరంగము యొక్క స్థితిని చూచి మన యొక్క స్తుతియు, స్తోత్రములును, కానుకలును ఆయన లక్షపెట్టక ఉండుటకు కూడా అవకాశములు ఉన్నాయి.
ఆరాధనను ప్రభువునకు చెల్లించుచున్నప్పుడు ఆయనను ప్రేమించి, వాత్సల్యతను చూపించి, ఆరాధన చేయవలనే గాని, ఏదో వీధి చొప్పున ఆరాధనను చేయకూడదు. అనేక క్రైస్తవ కుటుంబములు ఆదివారము రోజున ఆలయమునకు వెళ్ళుట ఒక విధిగా బావించి, విధి చొప్పున వెళ్లొద్దాము అని ఆలయమునకు వెళ్లి వచ్చుచున్నారు. అట్టివారు ప్రభువు యొక్క చిత్తమును తెలుసుకొనుటయును లేదు, ఆయనను ప్రియ పరచుటయును లేదు.
ఇటువంటి వారిని గూర్చి యేసు చెప్పెను: “వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు; గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను” (మత్తయి. 15:7,8,9).
ఆరాధనకు గొప్ప ఆటంకముగా ఉండుట వేషధారణయే. వేషధారణ అంటే ఏమిటి? పెదవులతో దేవుని స్తుతించుటయును, హృదయమునందు దేవునికి దూరముగా ఉండుటయే వేషధారణ. చెప్పుటకును, చేయుటకును గల వ్యత్యాసము ఉండుటయే వేషధారణ. వేషధారణతో కూడిన మాటలును, విధి చొప్పున చేసేటువంటి ఆరాధనయును, పొద్దుపోవుటకై స్తుతించుటయును ప్రభువు ఎన్నడును కోరుకొనుటలేదు.
ఏదో కానుకను అర్పించవలెనని బలవంతముతో కానుకలను తీసుకుని కయీను వచ్చెనేగాని, అది ప్రభువునకు ప్రియమైనదేనా అని గ్రహించుటకు అతడు తన యొక్క మనస్సును అర్పించలేదు. కయీను యొక్క కానుకయందు రక్తము లేదు. బలి యొక్క రక్తమే నేరారోపణ చేయు మనస్సాక్షిని కడిగి, దేవునితో సమాధానపరిచి, మనలను ఆయన వద్దకు చేర్చుచున్నది.
అయితే, హేబెలును చూడుడి. ఆయన దేవునికి ప్రియమైన కానుకను చెల్లించుటకు కోరుకొనెను. విశ్వాసము చేత తన యొక్క అంతరంగమును ప్రభువు యొక్క అంతరంగముతో జతపరచి ఆయనకు ప్రియమైన కానుక ఏమిటి అని గ్రహించి జరిగించెను.
కల్వరి శిలువయందు యేసుక్రీస్తు దేవుని యొక్క గొర్రె పిల్లగా బలి అర్పించబడుటను ముందుగా గ్రహించి, హేబెలు తాను కూడాను ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించెను. అట్టి కానుక లక్ష్యము చేయబడెను. దేవుని బిడ్డలారా, ప్రభువునకు ప్రియమైన వాటియందు ఆయనకు ఆరాధనను చేయుదురుగాక.
నేటి ధ్యానమునకై: “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను; ఇట్టి సేవ మీకు యుక్తమైనది” (రోమీ. 12:1).