Appam, Appam - Telugu

జూన్ 30 – జయ జండాయైయున్నవాడు

“నామీద ప్రేమను (ధ్వజము)జెండాగా ఎత్తెను”     (ప.గీ. 2:4).

ప్రతి ఒక్క దేశమునకు ఒక్కొక్క జెండా కలదు. ఆ జెండాను అమర్చుచున్నప్పుడు, దేశము యొక్క నాయకులు ఒకటిగా చేరి ఒక ఉద్దేశముతోను ఒక కారణముతోను ఆ రంగులను, అందులోని చిహ్నములను అమర్చుచున్నారు. దానిలోని ప్రతి రంగునకును ఒక్కొక్క అర్థము గలదు. అందులో పెట్టుచున్న చిహ్నములకు ఒక కారణము కలదు.

ఉదాహరణకు, భారతదేశము యొక్క జాతీయ జెండాను చూడుడి. దానిపై ఉన్న ఎరుపు రంగు, మన దేశము యొక్క స్వాతంత్రమునకై శ్రమపడిన త్యాగముర్తులు చిందించిన రక్తమును జ్ఞాపకము చేయుచున్నది. ఆ తర్వాత వచ్చుచున్న తెల్లని రంగు, మన దేశము సమాధానమును కోరుచున్నది అను సంగతిని చూపించుచున్నది. పచ్చని రంగు, మన దేశము సశ్యశ్యామలముగా, విరాజిల్లుచున్నదిగా ఉండును అను సంగతిని చూపించుచున్నది. మధ్యనున్న చక్రము అశోకుని యొక్క చిహ్నమును మనకు జ్ఞాపకము చేయుచున్నది.

రెండు దేశముల మధ్య యుద్ధము జరిగి, అందులో విజయము పొందిన దేశము, పరాజైము పొందిన దేశము యొక్క రాజ్య నగరునందు తమ యొక్క జెండాను నిలబెట్టి ఎగరవేయుట అలవాటు. హిమాలయ పర్వతము యొక్క శిఖరమును చేరుకుని, ఢెన్సింగ్ అను వారు అక్కడ మన యొక్క దేశము యొక్క జాతీయ జెండాను ఎగరవేసేను. అంతరిక్షమునకు వెళ్ళిన ఆర్మ్స్ట్రాంగ్ అను అమెరికా శాస్త్రజ్ఞుడైన వీరుడు, అమెరికా దేశము యొక్క జెండాను చంద్రమండలమునందు ఎగరవేసేను.

దేవుని బిడ్డలమైయున్న మనకు ఒక జండా కలదు.  అదియే కల్వరి సిలువ జండాయైయున్నది. అక్కడ క్రీస్తు లోకమును, శరీరమును, అపవాదిని జయించి విజయమును అధిరోహించెను. పాత నిబంధనయైనను సరే, క్రొత్త నిబంధనయైనను సరే, దేవుని బిడ్డలమైయున్న మనకు ప్రభువే జయ జెండాగా ఉన్నాడు. ఆయనే మన యొక్క యెహోవా నిస్సీ.

శత్రువు యొక్క సైన్యములను సంహారము చేయుటకు జయ జండాగా ఆయన ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఉన్నత ఆశ్రయమైనవాడు. మీరు ఎక్కడికి వెళ్లినను, మీకు జయమును ఇచ్చుటకు జయ జండాగా ప్రభువు ముందుగా వెళ్లుచున్నాడు అను సంగతిని గ్రహించుకోనుడి.

మొట్టమొదటిగా ఒక జెండాను ప్రభుత్వము కొరకు రూపించినవారు ఐగుప్తీయ్యులే. వారు ఒక గుడ్డ ముక్కను ఒక కర్రకు కట్టి, ఎత్తుచున్నప్పుడు, ఆ జెండాను జనులు వెంబడించుచు వెళ్లెదరు. ప్రతి ఒక సైన్యాధిపతికిని, వెవ్వెరు రంగులలో జెండా ఉండును.  శత్రువులైయున్న సైనికులు ఉన్న దిశ తట్టునకు వీరులు ముందుకు సాగిపోతు యుద్ధము చేయుదురు.

మనకు కల్వరియే జెండాగా ఉన్నది. ఆ జెండా దేనిని చూపించుచున్నది? ప్రభువు యొక్క దేశమును, ప్రేమను చూపించుచున్నది. (ప.గీ. 2:5). ప్రభువైయున్న యేసుక్రీస్తు  యొక్క అమితమైన ప్రేమయు, వాత్సల్యమును, కృపను కల్వరి సిలువయందు చూచుచున్నాము.

అట్టి కల్వరి జెండాయందు తెల్లని రంగును ఎరుపు రంగును చూడ వచ్చును. తెల్లని రంగు అనేది, యేసు తనయొక్క శ్రమలయందు పరిశుద్ధుడై ఉండుటను, ఎరుపు రంగు అనునది, ఆయన చిందించిన రక్తము యొక్క త్యాగమును సూచించుచున్నది.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది:    “నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు; పదివేలమంది పురుషులలో అతడు శ్రేష్టుడు”   (ప.గీ. 5:10). దేవుని బిడ్డలారా, అట్టి కల్వరి జెండాను తేరి చూడుడి.

నేటి ధ్యానమునకై: “యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమునుబట్టి మా (ధ్వజము) జెండా ఎత్తుచున్నాము”    (కీర్తనలు. 20:5)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.