Appam, Appam - Kannada

జూన్ 24 – విలపించుటయందు ఆదరణ

“దుఃఖించుటకును సమయము కలదు, నాట్యమాడుటకును సమయము కలదు”   (ప్రసంగి.3:4).”

మీరు ఆనందముగా నాట్యమాడుచున్నప్పుడు, అనేకులు మీతోకూడ   కలసి ఆ సంతోషమునందు అందించుటకు వచ్చెదరు. అయితే మీయొక్క శ్రమల సమయమునందు మీరు ఒంటరిగానే వినిపించ వలసినదై యుండును.  సంతోషమును పంచుకొనుటకై వేలమంది వచ్చెదరు. శ్రమలను పంచుకొనుటకు ఒక్కరైనను రారు.

ఒక మనుష్యుని యొక్క జీవితమునందు  విలపించు సందర్భములు వచ్చే తీరుతుంది. బైబిలు గ్రంధము నందు విలాపవాక్యములు అను పేరు నందు ఒక గ్రంథమే ఉన్నది. ప్రవక్తయైయిన యిర్మియా,  “ఆ!..నా తల జలమయము గాను,  నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండినట్లైతే మేలైయుండును గాక”  అని విలపించి ఏడ్చెను  (యిర్మియా. 9:1).  ప్రభువు ఆయన  యొక్క విలాపములంతటినీ సమకూర్చి వ్రాసి,  యిర్మియా యొక్క విలాప వాక్యములు అను గ్రంథమును బైబిలు గ్రంధము నందు జతపరిచెను.

యవ్వన వయస్సులో మనుష్యులచే కాడిని మోయగలిగినను,   “అయ్యో!… ప్రభువు నాపై కాడిని ఉంచియున్నాడే! నేను మోయలేను”  అని అనేకులు కన్నీటితో విలపించుటను చూచుచున్నాము.

పాత నిబంధనయందు, దేశమునందు కరువు వచ్చినప్పుడు, శత్రువులు దండెత్తి దేశమునకు విరోధముగా వచ్చినప్పుడును, జనులు గోనెపట్టెను ధరించుకొనిరి అని చదువుచున్నాము. అది శరీరము నందు ముల్లులాగ గుచ్చేటువంటి ఒక నారు వస్త్రము. బూడిదను ఎత్తి పోసుకొందురు. ఉపవాసముండి దేవుని సముఖమునందు తమ్మును తగ్గించుకొని,  ” దేవా! ప్రభువా, మా యొక్క సమస్యను మార్చుము. నేడు మేము ఉంటున్న పరిస్థితులయందు నీ హస్తమును చాపుము, ఒక అద్భుతమును చేయుము”  అని విలపించెదరు.

యూదుల యొక్క రబ్బీలు, ఉదయ కాలమునుండి  ఒక బొట్టు నీటిని కూడా త్రాగకుండా, సూర్యుడు అస్తమించే వరకును, విలపించుచు, బతిమాలు కొనుచు, ఏడ్చుచు ఉండెదరు. ప్రభువు అట్టి ప్రార్థనను ఆలకించి, వారిని విడిపించి, ఒక అద్భుతమును చేయును.

యోవేలు ప్రవక్త చెరపట్టబడిన ఇశ్రాయేలు జనులకై విలపించి ఏడ్చునట్లు ఆలోచనను చెప్పుచున్నాడు.   “తన యవ్వన కాలపు పెనిమిటి పోయిన యౌవనురాలు గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము”   (యోవేలు.1:8).   ” యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి”   (యోవేలు. 1:13)  అని జనులవద్ద ప్రాధేయపడెను. ఉపవాసముండి  ప్రార్ధించునట్లు ప్రభువు యొక్క నామమున ఆజ్ఞను ఇచ్చెను.

దేవుని బిడ్డలారా, ప్రభువు సంతోషమునందును, దుఃఖమునందును, సుఖమునందును, విచారమునందును, విలపించుటయందును, నాట్యమాడుట యందును మీతో కూడా ఉండి మిమ్ములను ఆదరించువాడు. విలపించుట యందును ఆదరణను ఇచ్చువాడు ఆయన ఒక్కడే.

 నేటి ధ్యానమునకై: “ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు (దుఃఖించుచు) విలపించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు”   (యోవేలు. 2:12).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.