No products in the cart.
జూన్ 23 – ఉపద్రవముల యందు ఆదరణ
“లోకములో మీకు (శ్రమ) ఉపద్రవము కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను” (యోహాను.16:33).”
క్రైస్తవ జీవితము అనుట ఒక సుఖభోగమైన జీవితము కాదు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించు వారందరు హింసపొందుదురు” (2.తిమోతికి. 3:12). కీర్తనకారుడు సెలవిచ్చుచున్నాడు, “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములైయున్నవి” (కీర్తన. 34:19).
అయితే, ఆపదలన్నిటి మధ్యను ప్రభువు ఆదరణ కలిగించును. ఆదరించి ఓదార్చి ఆపదలన్నిటి నుండియు విడిపించుచున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, ” మాకు వచ్చుచున్న మాశ్రమల అంతటిలోను ఆయనే మమ్మును ఆదరించుచున్నాడు” (2. కొరింథీ 1:4). దావీదు సెలవిచ్చుచున్నాడు, “నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది” (కీర్తన. 94:19).
ఒకవైపున బాధలు వచ్చినను మరోవైపున ప్రభువు యొక్క ప్రేమయు, పరామర్శయు, ఆధరణయు కూడా పెరుగుచు ఉండును. కొన్ని సమయముల యందు దైవ జనులను పంపించి ప్రభువు ఆదరణను కలిగించును. కొన్ని సమయములయందు దేవుని వాక్యము మూలముగాను, కొన్ని సమయములయందు ప్రవచనములు ద్వారాను మిమ్ములను ఆదరించి ఓదార్చను.
పరిశుద్ధాత్ముడు కూడాను ఆదరణ కర్తగా దిగివచ్చి మిమ్ములను ఓదార్చను. అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు, ఎంతగానో ఆదరణయు, ఓదార్పును మనకు కలుగుచున్నది. బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది, “నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు: నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు” (యెషయా. 28:11).
అపోస్తులుడైన పౌలు, “క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల” (ఫిలిప్పీ. 2:1) అని వ్రాయుచున్నాడు.
మీయొక్క బాధాకరమైన మార్గమును ఇతరులు ఎవరు ఎరుగక ఉండవచ్చును. అయితే, మిమ్ములను కలుగ జేసినవాడను, ప్రేమతో మిమ్ములను వెతుక్కుంటూ వచ్చి మీ కొరకు రక్తమును చిందించినవాడైన ప్రభువు మీయొక్క సమస్త పరిస్థితులను ఎరిగినవాడై యున్నాడు.
ఆయనొక్కడే మీయొక్క కన్నీటినంతటిని ముట్టి తుడిచి, దైవిక ఆదరణను మీయొక్క అంతరంగములోనికి తీసుకొని వచ్చువాడు. ఆయన ఉపద్రవముల యందు ఆదరణ కలిగించువాడు. ఒకని తల్లి ఆదరించినట్లు ఆదరించువాడు. ఒకని తండ్రి తన బిడ్డలను కనికరించునట్లు కనికరించువాడు. దేవుని బిడ్డలారా, మీయొక్క ఉపద్రవముల సమయముల యందు ఆయన మీయొక్క చెంతకు వచ్చుచున్నప్పుడు, మీయొక్క ఉపద్రవములన్నియు మిమ్మల్ని విడిచి తొలగిపోవును. దేవుని యొక్క ఆదరణయు, వెలుగును మీయొక్క అంతరంగము నందు వచ్చి నివసించును
నేటి ధ్యానమునకై: “అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతొ ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు” (రోమీ. 8:26).