No products in the cart.
జూన్ 16 – పేదరికము నందు ఆదరణ
“రెండంతలుగా మీకు మేలు చేసెదనని; నేడే నేను మీకు దయజేయుచున్నాను” (జెకర్యా. 9:12).”
పేదరికమును, చాలీచాలని తనమును, అప్పుల సమస్యను హృదయమును సొమ్మసిల్లిపోవునట్లు చేయుచున్నది. ‘నేను ఎట్లు ఇట్టి పేదరికము నుండి బయటపడెదెను, ఎన్నడు నేను ఆశీర్వదింపబడెను, ఎప్పుడు ఆదరణనను పొందెదను’ అనియంతా తలంచుచున్నారా? మిమ్ములను ఆదరించుటకు శక్తి గలవాడైయున్న, దేవుని తేరి చుడుడి!
ఒకసారి, గ్రీకుదేశపు యుద్ధ సైనికులలో ఒకడు రాత్రి సమయము నందు బాధతో ఒక కాగితమను తీసుకుని, తనకు మొత్తము ఎంత అప్పు ఉన్నదన్న సంగతిని లెక్కించి చూచెను. అది భారీ మొత్తముగా ఉండెను. ఆకాగితము క్రింద ‘దీని అంతటిని నాకై చెల్లించువారు ఎవరు?’ అని ప్రశ్నను రాసి పెట్టి, ఆత్మహత్య చేసుకునేందుకు తీర్మానించెను.
అతడు నిద్రించుచున్న సమయమునందు అటువైపుగా మహా గొప్ప అలెగ్జాండరు వచ్చెను. అతడు వ్రాసి ఉంచిన దానిని చదివెను. ప్రక్కనే ఉన్న తుపాకిని చూచెను. అతని యొక్క మానసిక స్థితిని గ్రహించినవాడై, ‘దీని అంతటిని నాకై చెల్లించువారు ఎవరు?’ అని వ్రాయబడియున్న దానిక్రింద, ‘మహా గొప్ప అలెగ్జాండరైయున్న నేను చెల్లించి తీర్చెదను’ అని వ్రాసి సంతకమును చేసెను.
ఆ యుద్ధ సైనికుడు నిద్రనుండి లేచి ఆ కాగితమును చూచినప్పుడు, అందులో చక్రవర్తి తన అప్పును తీర్చునట్లు వ్రాసి సంతకమును పెట్టి యుండుట అతనికి మిగుల సంతోషమును కలిగించెను. ఆత్మహత్యను చేసుకొనుటకు పెట్టుకొనియున్న తుపాకీని ఎత్తి పడవేసెను. చక్రవర్తి యొక్క సంతకము అతని యొక్క అప్పంతటిని తీచి, అతనిని విడుదలచేసెను.
దేవుని బిడ్డలారా, నేడు మీయొక్క పేదరికము నందు ఆదరణను కలిగించినట్లుగా, “మీ కొరకు నేను సమస్తమును చెల్లించి తీర్చెదెను” అని ప్రభువు వాక్కునిచ్చుచున్నాడు. మీయొక్క పాపపు రుణములను, శాపపు రుణములను ఆయన కల్వరి సిలువ యందు మోసి తీర్చినది ఎంత వాస్తవమో, అంత వాస్తవముగా మీయొక్క ధన రుణ సమస్యలను కూడా తీర్చుటకు ఆయన శక్తి గలవాడై యున్నాడు.
ప్రభువు ఐశ్వర్యమునందు సంపన్నుడైయున్నాడు అని అపోస్తులుడైన పౌలు వ్రాయుచున్నాడు (రోమీ. 10:12). అవును, వెండియు ఆయనదైయున్నది, బంగారమును ఆయనదైయున్నది (హగ్గయి. 2:8). సమస్తమును ఆయనకు సొంతమైయున్నది. ప్రభువు ఐశ్వర్యమునందు సంపన్నుడుగా ఉన్నట్లు, ఆయన యొక్క బిడ్డలైయున్న మీరును ఐశ్వర్యవంతులై యుందురు. ఆత్మ సంబంధమైన జీవితమునందును సరి, పర సంబంధమైన ఆశీర్వాదములను స్వతంత్రించు కొనుటయందును సరి, మీరు ఐశ్వర్యము నందు సంపన్నులుగా జీవించవలెను అని దేవుడు చిత్తమును కలిగియున్నాడు.
దేవుని బిడ్డలారా, మీరు దేవుని తట్టు తేరిచూచి, మీయొక్క పేదరికమును దులిపి వేసుకొనుటకు ప్రయత్నించుడి. ప్రభువు పేదరికము నందు మీకు ఆదరణగా ఉండి, రెండంతలుగా మీకు మేలులను ఇచ్చి ఆశీర్వదించును.
నేటి ధ్యానమునకై: “యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును” (కీర్తన.115:14).
ఈ రోజు బైబిల్ రీడింగ్