Appam - Telugu

జూన్ 15 – ఒంటరితనము నందు ఆదరణ

“తండ్రి  నాతో  ఉన్నాడు  గనుక,  నేను  ఒంటరిగా  లేను”   (యోహాను.16:32).” 

ఒంటరి తనము అనేది వేధనను కలుగజేయు ఒక రకమైన పరిస్థితియైయున్నది. ఇది మనస్సునందు నిరుత్సాహమును కలుగచేయుచున్నది. భార్యను బిడ్డలను విడిచిపెట్టి ఉద్యోగము నిమిత్తము  దూర ప్రదేశాలకు వెళ్లి ఒంటరిగా ఉండుట అనేది హృదయమును అత్యధికముగా వేదన పరచుచున్నది.

తమకు అత్యంత ప్రియమైన వారు, దూర ప్రాంతమునకు వెళ్ళిపోయినప్పుడు, ఒంటరితనపు భావాలు మనస్సును పిండి వేయుచున్నది. మీ గృహమునందు విస్తారమైన స్నేహితులు ఉండియు, మీపై ప్రేమను చూపించే వారు ఒక్కరును లేక, అందరును మిమ్ములను ద్వేషించి, తూలనాడీ కానీ మాటలను మాట్లాడినట్లయితే మీరు మీ గృహమునందే ఒంటరి తనము నందు నెట్టి వేయబడినవారై కనబడదురు.

అటువంటి పరిస్థితుల యందు ప్రభువు ఎల్లప్పుడును మీతో కూడా ఉన్నాడు అను సంగతిని మర్చిపోకుడి. ఆయన యొక్క సన్నిధియు, ప్రసన్నతయు మీతోకూడా  ఉన్నది. మీరు ఎల్లప్పుడును ఆయనతో కూడా మాట్లాడునట్లు ఆయన యొక్క కరుణాపీఠము మీ కొరకు తెరచి ఉంచబడియున్నది.

యేసుక్రీస్తు,   ‘ఎల్లప్పుడును నేను వంటరిగా ఉండను;  తండ్రి ఎల్లప్పుడును నాతో కూడా ఉన్నాడు’  అని అతిశయిచెను. తండ్రితో కూడా ఏకాంతము నందు సమయములను ఖర్చు పెట్టుటకు కోరి, మాటిమాటికి కొండ పైకి ఎక్కి వెళ్లి దేవునితో సంభాషిస్తూ ఉండెను. సిలువను ఆయన ఒంటరిగా ఎదుర్కొనవలసిన తరుణము వచ్చినప్పుడు కూడా, ఆయన తండ్రితో కూడా మాట్లాడుతూ ఉండెను అనుటను చూడగలము.

ఒంటరి తనము, దేవునితో సంచరించు మధురమైన సమయముగా మార్చిచి, రాకడయందు కొనిపోబడుచున్న పరిశుద్ధులకు  హానోకు ఒక ఆదర్శవంతుడాయెను. ఒంటరితనపు యొక్క సమయము అనుట ఆయనకు మనస్సునందు మీగుల సంతోషమును కలిగించు సమయముగా ఉండెను. ఆయన దేవునికి ఇష్టమైన వాడని సాక్షము పొందెను. దేవుని యొక్క ప్రవక్త అని పిలవబడినవాడు. రానున్న కాలములను గూర్చి ముందుగా ప్రకటించినవాడు. బైబిలు గ్రంధము నందు ఎనలేని స్థానమును పొందికొనినవాడు.

నోవాహు తాను ఓడను నిర్మించిన్నప్పుడు ఒంటరివాడై నిలచియుండెను. లక్షలకొలది ప్రజల మధ్యలో ఆయన కుటుంబము మాత్రము ప్రభువునకై  ఒంటరిగా నిలిచెను. ఒంటరిగా ప్రసంగించెను;  ఒంటరిగా నిందలను, తూలనాడబడి పరిహాసములను అనుభవించెను. అయినను ఆయన  మనస్సు చలించి పోలేదు. విజయము అయనదై ఉండెను. రక్షణ ఓడయందు గంభీరముగా ప్రవేశించెను.

ఆనాడు యాకోబు యబ్బోకు రేవుయందు ఒంటరిగా నిలిచెను. ఎదురుగా వచ్చిన అన్నయ్యకు భయపడెను. మావయ్యగారి యొక్క సహాయము అతనికి లేదు. ఆయన కుటుంబము మాత్రము ఒంటరిగా ప్రయాణము చేసి వచ్చెను. అట్టి ఒంటరి సమయమును యాకోబు పూర్తిగా ఉపయోగించుకొనెను. దేవునితో పోరాడి,   ‘నన్ను ఆశీర్వదించుము ప్రభువా’  అని బతిమిలాడెను. అట్టి ఒంటరియైన సమయము ఎంత గొప్ప శాశ్వతమైన ఆశీర్వాదమును ఆయనకు తెచ్చిపెట్టిను!  గొప్పమార్పులను తెచ్చిపెట్టెను! దేవుని బిడ్డలారా, ప్రభువు  మీ యొక్క ఒంటరి సమయములందు మీకు ఆదరణను కలిగించును.

నేటి ధ్యానమునకై: “నేను మిమ్మును అనాథలనుగా విడువను; మీ యొద్దకు వత్తును”  (యోహాను.14:18).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.