No products in the cart.
జూన్ 12 – విశ్వసించు చేతులు
“యేసు తన యొక్క (అందుకాయన) చెయ్యిని చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా; తక్షణమే వాని కుష్టరోగము (తొలగిపోయి) శుద్ధుడాయెను” (మత్తయి. 8:3)
ప్రభువు యొక్క హస్తము నేడును మిమ్ములను స్వస్థపరచున్నట్లు చాపబడిన రీతిగా ఉన్నది. ఆయన హస్తములచేత చెయ్యలేని అద్భుత కార్యములు ఏమియు లేదు.
మీరు వ్యాధిచేత నలిగిపోయి ఉన్నారా? మీ కుటుంబమునకు చేయవలసిన బాధ్యతలను చేయలేక ఉన్నారా? దుష్టులైన మనుష్యులు మీకు విరోధముగా కుట్రను చేయుచు చేతబడి శక్తులను ప్రయోగించుచున్నారా? పలురకాల రోగములును, వ్యాధులును, బలహీనతలును మీపై దాడి చేయిచున్నాయా? కలవరపడకుడి, భయపడకుడి. క్రీస్తు యొక్క శక్తిగల హస్తమును తేరి చూడుడి.
ఒక కుష్ఠ రోగిని స్వస్థపరచుటకు ప్రయత్నించినప్పుడు, యేసు వ్యాధిని గూర్చి భయపడలేదు. ఆ వ్యాధి సోకబడునే, వానిని నేను ముట్టినట్లయితే అపవిత్రుడను అవ్వుదునే అని ఆయన తలంచలేదు. అతనిని చూచి జాలిపడి, ప్రేమతో తన యొక్క హస్తమును చాపి వానిని ముట్టినప్పుడు, క్షణములోనే వ్యాధి అతని విడిచి తొలగిపోయెను. అదేవిధముగా మీ యొక్క సమస్త రోగములును, పాపములును, శాపములును క్రీస్తు యొక్క స్పర్శచేత తొలగిపోవును.
బైబిలు గ్రంథమునందు ఆయన అద్భుతముగా స్వస్థపరచిన సంభవములన్నిటిని చదివి దేవునిని స్తోత్రించుడి. ‘యేసు పేతురింటిలో ప్రవేశించినప్పుడు, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచెను. ఆయన ఆమె చెయ్యిని ముట్టగానే జ్వరము ఆమెను విడచిపోయెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను’ (మత్తయి. 8:14,15).
దృష్టి లేకుండా అలమటించుచున్న గ్రుడ్డివారు యేసుని వద్దకు వచ్చిరి. “యేసు కనికరపడి, వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది, ఆయన వెంట వెళ్లిరి” (మత్తయి. 20:34). ఆయన యొక్క స్పర్శ చేత చెవిటి వారి యొక్క చెవులు తెరవబడెను. మూగవారు మాట్లాడిరి!
ఆయన విశ్రాంతి దినమున యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు; పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి, తన వద్దకు రమ్మని పిలిచెను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను” (లూకా. 13:10-13).
సువార్తలన్నీయును క్రీస్తు యొక్క స్వస్థపరచు హస్తము చేసిన అద్భుతములచే నిండియున్నది. ఆయన తన హస్తములచే ముట్టెను, లేవనెత్తేను, ఎత్తుకొనెను, స్వస్థపరచెను అని మనము బైబిలు గ్రంధమునందు చదువుచున్నాము. ప్రేమగల అదే హస్తములు నేడును మిమ్ములను స్వస్థపరచి, ఆదరించునట్లు చాపబడియున్నది.
దేవుని బిడ్డలారా, తల్లి కంటే మిన్నయైన ప్రేమతో, తండ్రి తన పిల్లలను కరుణించునట్లు ప్రభువు ప్రేమతో మీ వైపునకు తిన్నగా తన యొక్క హస్తమును చాపి కనికరపడుచున్నాడు. జాలిపడి అద్భుతమును చేసి, నిశ్చయముగానే మిమ్ములను స్వస్థపరచును. మీరు చేయవలసినది అంతయు ఒక్కటే. ఆయన యొక్క గాయపడిన హస్తమును తేరి చూడుడి. అందులోని దెబ్బలను చూడుడి. ఆయన పొందిన దెబ్బలచేత మీరు స్వస్థతపొందుదురు.
నేటి ధ్యానమునకై: 📖”మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను; అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” (యెషయా. 53:5).