No products in the cart.
జూన్ 12 – విశ్వసించు చేతులు
“తరువాత తోమాను చూచి; నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి, నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివికాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను. అందుకు యేసు తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను” (యోహాను. 20:27-29)
ప్రభువు యొక్క చేతులను చూచువారు ఇక ఎన్నడును అవిశ్వాసులుగా ఉండరు. ఆయన యొక్క హస్తము వారిని స్థిరపరచుటతోపాటు, విశ్వాసులుగాను మార్చుచున్నది. అట్టి విశ్వాసము స్థిరమైనది; నిత్యమును దృఢముగా ఉండదిగినది.
మొట్టమొదటిసారిగా యేసు తన హస్తములను శిష్యులకు చూపించి, దర్శనము ఇచ్చినప్పుడు అక్కడ తోమ లేకుండెను. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “తక్కిన శిష్యులు: మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా; అందుకు అతడు: నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి, నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను” (యోహాను. 20:25).
నమ్మిక లేని తోమా కొరకు ప్రభువు రెండవ సారి కూడా తన యొక్క చేయిని చాచి చూపించవలసినదై ఉండెను. విశ్వాసములేని వారికొరకై ప్రభువు రెండవ సారి కూడాను తమ యొక్క చేతిని చాపుచున్నాడు. మీరు అవిశ్వాసులై ఉండుట ఆయన కోరుకొనుటలేదు. ఆయన గాయములను చూచుచున్నవారు నిశ్చయముగానే విశ్వసించువారై మారుదురు.
‘నీ వేళ్ళను చాచి నా చేతులను తాకి చూడుము’ అని యేసు చెప్పినప్పుడు, జంక్చున్న తోమా మరల ఆయన హస్తములను చూచెను. అందులో ఉన్న గాయమును తిక్షనంగా చూచెను. ఆ గాయము అనేది, వ్రేలు ఒక వైపున లోపలికి వెళ్లి మరో వైపున బయటకు వచ్చునంత పెద్ద గాయమైయుడెను.
తోమా తన వ్రేళ్ళను ప్రభువు యొక్క గాయములయందు పెట్టి చూచెనో, ఏమో తెలియలేదు. అయితే, అపోస్తులుడైన యోహాను తన పత్రికయందు వ్రాయుచున్నప్పుడు, “ఆదినుండి ఏదియుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, ఆ జీవవాక్యమును గూర్చినది మీకు తెలియజేయుచున్నాము (1. యోహాను. 1:1).
తోమా, యోహాను, పేతురు మాత్రము గాక, శిష్యులైన ప్రతి ఒక్కరు ప్రభువు యొక్క హస్తమును తాకి చూచి ఉండవలెను.
ప్రభువు తన యొక్క హస్తమును ఈ రీతిగా మనకు చూపించుటకు గల కారణము ఒక్కటే. మీరు అవిశ్వాసులుగా ఉండక చివరి వరకు ఉత్తమమైన విశ్వాసులుగా నిలచి ఉండవలెను అనుటయే దాని భావము. అప్పుడు విశ్వసించుచున్నవారికి వచ్చుచున్న సమస్త ఆశీర్వాదములను, స్వాస్థ్యములను, ఔన్నత్యములను మీరు కూడా స్వతంత్రించుకొందరు!
“విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను” (హెబ్రీ. 11:6).
నేటి ధ్యానమునకై: 📖”ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు” (ఆపో.కా . 16:31).