Appam, Appam - Telugu

జూన్ 12 – విజయపు సువాసన!

“రక్షింపబడువారి పట్లను, నశించువారి పట్లను, మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము” (2. కోరింథీ.2:15).

మనము ప్రభువు కొరకు సువాసగాను, ఆయన కొరకు సువాసన వెదజల్లునట్లుగా పిలువబడిన వారమైయున్నాము. పైన చెప్పబడిన వచనము కథోలిక బైబిలు గ్రంధమునందు, “క్రీస్తులో జీవించుచున్న మమ్ములను ఎల్లప్పుడును క్రీస్తు యొక్క విజయోత్సాహమునందు పాలు పొందినట్లు చేసి, తనను గూర్చిన జ్ఞానము ద్వారా మా జీవితము సువాసనను వీచునట్లు చేయుచున్న దేవునికి స్తోత్రము” అని వ్రాయబడియున్నది.

దేవుని బిడ్డలారా, విమోచింపబడినవారి పట్లను, నశించుచున్నవారి పట్లను దేవుని యొక్క దృష్టియందు క్రీస్తుని సువాసనయైయున్నాము.

అపో. పౌలు యొక్క దినములుయందు, రోమా పూరినందు గల చక్రవర్తికి విస్తారమైన సైన్యాధిపతులు ఉండెను. యుద్ధానికి వెళ్ళు కాలము వచ్చినప్పుడు వారిలోని ప్రతి ఒక్కరిని ఒక్కొక్క దిక్కునకు పంపించబడుదురు. వారు వెళ్లి శత్రువులతో యుద్ధము చేసి, పలు వేల నేల వైశాల్యమును రోమా సామ్రాజ్యమునకు ఆదాయము చేసిపెట్టి, కనీసము ఇదువేల మందినైనను చెర పట్టుకుని తీసుకుని రావలెను అనుట చక్రవర్తి యొక్క ఆజ్ఞయైయుండెను.

ఆ విధముగా జయించిన ఒక సేనాధిపతి తన వీరులతోపాటు విజోత్సాహముతో వచ్చుచున్నప్పుడు ఆయనకు హారతి పట్టుటకై రోమాపురి పట్టణముపు పుర ద్వారములయందు బూరను ఊది హారతి పట్టుదరు. అతడు రాజనగరి యొక్క రాజు కోటకు ముందుగా గల గొప్ప మైదానమునకు వచ్చుచున్నప్పుడు, కూడియున్న ప్రజలు విస్తారమైన సుగంధ వర్గములను అగ్నిలో వేసి వాసన వీచునట్లు చేసి ఆనందముతో ఆర్బాటపు ఘోష చేయుదురు.

ఆ పట్టణమంతయును సువాసన చేత నిండును. జయమును సాధించిన దళపతికి అది ఒక గొప్ప ఆహ్వానమునైయుండును. అదే సమయములో ఓడిపోయి చరపట్టబడిన శత్రువుల యొక్క సైన్యమునకు అది మరణపు వాసనగా ఉండును. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి, కల్వరి సిలువలో లోకమును, మాంసమును మరియు సాతానును జయించెను. నేను లోకమును జయించితిని అని విజయభేరిని చేసెను. సిలువలో ‘సమాప్తమాయెను” అని చెప్పుటకు గల అర్థము జయమును పొందియున్నాను అనుటే అర్థము.

ఆయన శత్రువు యొక్క తలను చితకగొట్టినది ఆయన యొక్క విజయములోని ఒక భాగమే. అవును, మనకు ఆ విజయమునందు ఒక వంతు పాలు గలదు. మనకు అది విజయపు సువాసనగాను, సాతానునకును, ఆకాశమండలమునందు గల దురాత్మ సమూహపు సేనలకు అది మరణపు వాసనగాను ఉండును.

అపో. పౌలు వ్రాయుచున్నాడు, “క్రీస్తయందు మమ్మును ఎల్లప్పుడును విజయోత్సవముతో ఊరేగించుచు, ప్రతి స్థలమందును మా ద్వారా ఆయనను గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచున్న దేవునికి స్తోత్రము” (2. కోరింథీ. 2:14).

దేవుని బిడ్డలారా, మీరు జయము కొరకు పిలువబడినవారు, క్రీస్తునందు మీరు జయసాలులుగా ముందుకు సాగవలెను. మీరు కదిలినను, నడచినను క్రీస్తు యొక్క విజయపు సువాసనను వీచుచున్నవారై ఉండవలెను. మీరు ముందుకు సాగి వెళ్ళుచున్నప్పుడు, ప్రతి దినమును క్రీస్తు యొక్క విజయపు సువాసనతోను విజయవంతముగా ముందుకు సాగిపోవుదురుగాక!

నేటి ధ్యానమునకై: “మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక” (1. కొరింథీ. 15:57).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.