No products in the cart.
జూన్ 07 – ఇరుకులయందు ఆదరణ
“వారి యావద్బాధలో ఆయన బాధనొందెను; ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను” (యెషయా.63:9).”
మిమ్ములను నలగ్గొట్టి, నలిపెటువంటి అనేక శక్తులు లోకమునందు కలవు. మీయొక్క ప్రతి ఇరుకుల యందును మీయొక్క ప్రతి భాధల యందును ప్రభువు మీతో కూడా ఉండి, వాటన్నిటిని మీనుండి తొలగించి వేయును.
ఒకసారి మార్టిన్ లూథర్పై దాడి చేయుటకై ఆ దేశమందు గల ప్రజలును, మత గురువులును సైనిక యోద్దులను పంపిచిరు. మార్టిన్ లూధర్కు ఉన్న ఒకే ఒక్క ఆదరణ దేవుని ప్రసన్నత మాత్రమే.
మార్టిన్ లూథర్, వారిబారి నుండి దాగియుండి అడవి మార్గమున వెళ్ళుచుండెను. ఆయనను కొంతమంది సైనిక యోధులు ఆయనను కనుగొనిరి. ఆయన ఒంటరిగా మౌనముగా వెళ్ళక, మరొకరితో మాట్లాడుతూ వెళ్ళుటను చూచిరి. వారు ఆయనను సమీపించినప్పుడు, ఆయన ఒకరిని మాత్రమే చూసిరి. వేరెవరూ ఆయనతో కూడా లేదు అనుటను చూచిరి. సైనిక యోధులు ఆశ్చర్యమును తట్టుకొలేకపోయిరి.
మార్టిన్ లూథర్ వారి వద్ద,. “నేను ఒంటరిగా వెళ్ళుట లేదు, నేను ఎల్లప్పుడును యేసుతోనే నడుచుచు వెళ్లుచున్నాను” అని చెప్పెను. అయనను ఖైదు చేయుటకు వచ్చిన సైనికులు ఆయన యొక్క దైవీకత్వముచే ఆకర్షింపబడి, ఆయనను ఖైదు చేయుటకు మనసులేక తిరిగి వెళ్ళిపోయిరి.
అనేకమంది దేవుని యొక్క బిడ్డలు, ఇరుకైన సమయముయందు సమస్యలను, పోరాటములను చూచుచున్నారు. వీచుచున్న తుఫానును, ఉప్పొంగుతున్న సముద్రమును చూచుచున్నారు. అయితే సమస్యలకు పైగా నిలబడి, “నిశ్శబ్దమై ఊరకుండుము” అని గాలిని, సముద్రమును గద్దించిన ప్రభువును తేరి చూచుటకు మరచి పోవుచున్నారు. ప్రభువు తట్టు తేరి చూచువారు, అన్ని వైపులా ఇరిక్కించబడినను అనగ దొక్కబడరు.
ఇరికింప బడుచున్నప్పుడు మీరు ఆయన తట్టు తేరి చూచి మొర్ర పెట్టరా అనియే ప్రభువు ఆసక్తితో కాంక్షించుచున్నాడు. మీ యొక్క బాదలను అంతరంగమునందు అనచి ఉంచు కొనక, ఆయనయొక్క పాదముల వద్ద కుమ్మరించుడి. దావీదు సెలవిచ్చుచున్నాడు, “నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు; నా గిన్నె నిండి పొర్లుచున్నది” (కీర్తన. 23:5).
మీయొక్క ఇక్కట్ల మధ్యను ప్రభువు మీతో కూడా వచ్చుటను మీయొక్క ఆత్మీయ కనులచే చూడగలరు. ఆయన మిమ్ములను ఎడబాయడు,మిమ్ములను చేయి విడిచిపెట్టడు.
కీర్తనాకారుడు సంతోషించి నీవు నాకు తోడుగా ఉండుటచే నీ రెక్కల నీడలో ఆనందించెను అని చెప్పి పరవశించెను. ” యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును” (కీర్తన. 94:17) అని వ్రాయుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువు ప్రతి విధమొన ఇరుకుల బారినుండి మిమ్ములను విడిపించి ఆశీర్వదించును.
నేటి ధ్యానమునకై: “ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు; గనుక నేను సిగ్గుపడలేదు; నేను సిగ్గుపడనని యెరిగియున్నాను” (యెషయా. 50:7).