bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

జూన్ 06 – కొదువయందు ఆదరణ

” నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున  మీ ప్రతి (అవసరమును) కొదువలను క్రీస్తుయేసునందు మహిమలో  తీర్చును”   (ఫిలిప్పీ. 4:19).”

కొదువ కలిగిన వారై జీవించుట అను సంగతి ఒక వేదన కరమైన అంశము. శారీరిక అవయవముల యందు లోపము, ధనసమృద్ధి యందు లోపము, సమాధాన మందు లోపము, జ్ఞానము నందు లోపము అను సమస్త లోపములును వేధన కరమైనదైయున్నది. అయితే,   ‘మీ యొక్క కొదువలన్నిటిని నేను సమృద్ధి పరచెదను’ అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

గలిలయలోని కానా అను ఊరిలో జరిగిన ఒక వివాహమును గూర్చి బైబిలు గ్రంథమందు వ్రాయబడియున్నది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడియుండిరి. ఆ వివాహపు ఇంట బంతి యందు ద్రాక్షరసము కొదువైయుండెను. యేసు యొక్క తల్లి  యేసు వద్దకు వెళ్లి, ఆ కొదువను గూర్చియు, వేదనుగూర్చియు వివరించిరి.

అప్పుడు యేసు పనివారితో రాతి బానలయందు నీళ్లతో నింపునట్లు చెప్పెను. వారును అలాగుననే చేసిరి. ప్రభువు ఆ నీళ్లను ద్రాక్షరసముగా మార్చెను. మునుపటి ద్రాక్షరసము కంటే వెనుకటి ద్రాక్షరసము మధురముగాను, మాధుర్యముగాను ఉండునట్లు ప్రభువు ఆశీర్వదించెను.

అదే విధముగా ప్రభువు మీ జ్ఞానము నందుగల లోపమును సవరించుటకు శక్తి గలవాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,    “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు”   (యాకోబు. 1:5).  దేవుని బిడ్డలారా, మీరు ప్రభువు వద్ద జ్ఞానమును అడుగుచున్నప్పుడు, ప్రభువు మిమ్ములను శ్రేష్టమైన జ్ఞానముతోను, తెలివితోను, బుద్ధితోను  నింపి ఆశీర్వదించును.

ప్రభువు మీ విశ్వాసమునందు గల లోపమును కూడా నివృత్తి చేయును.  బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “.  మేము మీ  ముఖముచూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా”    (1.థెస్స. 3:9). మీ విశ్వాసము తగ్గుచున్నప్పుడు, ప్రభువు వద్ద దాని గురించి ప్రార్థనయందు మొర్రపెట్టుడి. అప్పుడు ప్రభువు మీ యొక్క విశ్వాసమును బలపరచును.

అదే విధముగా ప్రభువు మీ ఆత్మీయ జీవితము నందు కనబడుతున్న కొదువులను సమృద్ధి చేయును.   “మీరు  ఏ కృపావరమునందును లోపము లేక,  మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు”    (1.కోరింథీ. 1:7)  అని అపోస్తులుడైన పౌలు వ్రాయుచున్నాడు.

దేవుని బిడ్డలారా,  కొదువులను సమృద్ధి చేయు ప్రభువుని వద్ద మీ యొక్క సమస్త కొదువులన్నిటిని ఒప్పుకొనుచూ ప్రార్ధించుడి. అప్పుడు ప్రభువు మీ యొక్క సమస్త కొదువులన్నీటిని క్రీస్తుయేసునందు మహిమలో సమృద్ధి పరచును, మిమ్ములను ఆదరించి, మరీ నిశ్చయముగా బలపరచి ఆశీర్వదించును.

 నేటి ధ్యానమునకై: ” మీరు సంపూర్ణులును, అనూ నాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి”   (యాకోబు. 1:4).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.