No products in the cart.
జూన్ 05 – పాపమును మోసెను
“ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును (భరించుచు) తానే మోయుచు…” (యెషయా. 53:12)
గొల్గొతా కొండ తట్టు క్రీస్తు వెళ్ళుచున్నప్పుడు ఆయన యొక్క భుజమునందు ఆయన దేనిని మోసెను? వట్టి మ్రానైయున్న సిలువనా? లేదు. మ్రాను కంటేను అతి ఘోరమైన ఒక దానిని ఆయన తన భుజమునందు మోసుకొని గొల్గొతా కొండ తట్టు నడవలేక నడిచెను. అది ఏమిటి?
ఆయన మోసుకొన్నది మన యొక్క పాపములు, మన యొక్క అతిక్రమములు! అందుచేతనే బ్యాప్తీస్మమునిచ్చు యోహాను ఆయనను గూర్చి ఎలుగెత్తి చెప్పుచు, “ఇదిగో, లోకము యొక్క పాపమును మోసుకొని తీర్చేటువంటి దేవుని గొఱ్ఱెపిల్ల” అని పరిచయము చేసెను (యోహాను. 1:29).
కొద్దిగా ఆలోచించి చూడుడి! భారములన్నిటిలోను అతి ఘోరమైన భారము పాపపు భారమునైయున్నది. అది ఒక మనిషిని అగ్ని గంధకములలో ముంచి వేయదగిన శక్తిగలది. ఒక మనుష్యుని యొక్క పాపమును మోయుటకు ఎట్టి బంధువులుగాని, స్నేహితులుగాని ముందుకురారు. భార్య యొక్క పాపములను మోయుటకు భర్త ముందుకురాడు. భర్త యొక్క పాపములను మోయుటకు భార్య ముందుకురాదు. తల్లిదండ్రుల యొక్క పాపములను మోయుటకు ఏ బిడ్డయు ముందుకురాదు.
ఒకసారి తన యొక్క భయంకరమైన పాపముల కారణముగా ఒక వ్యక్తి ఎయిడ్స్ వ్యాధిచే పీడించబడెను. అయనను ఆయన యొక్క భార్య కూడా అసహ్యించుకొనెను. బంధువులు, స్నేహితులు ఆయనను అంటరానివాడి వలే భావించి వెలివేసిరి. ఆయన యొక్క సొంత బిడ్డలు కూడా ఆయనను తండ్రి అని పిలుచుటకుగాని, ఆయనతో ఉండుటకుగాని ముందుకు రాలేదు. ఆయనను ద్వేషించి వెలివేసిరి. తన పాపము యొక్క భయంకరమైన స్థితిని మిగుల వేదనతోను, కన్నీటితోను ఆయన మోసుకొనుచు భరించుచుండెను. అయితే, మన ప్రియ ప్రభువు యొక్క భుజమును చూడుడి. అది మన యొక్క పాపములను మోసుకొనెను. పాపములను మాత్రము గాక, అతిక్రమములను కూడా ఆయన మోసెను అని, యెషయా. 53:11 – నందు చదువుచున్నాము.
పాత నిబంధనయందు పాపము చేసిన మనుష్యుడు తన పాపమును మోపుటకై ఒక గొర్రెను ఏర్పరచుకొని బలిపీఠము వద్దకు తీసుకొని వచ్చును. ఆ తరువాత ఆ గొర్రెపై తన చేతిని నుంచి తన పామునంతటిని ఒప్పుకోలు చేసి దానిపై మోపివేయును. ఆ గొర్రె అతని యొక్క పాపములను, అతిక్రమములనంతటిని మోసుకుని అతనిపై రావలసిన దండనను తనపై వహించుకొని, బలిపీఠముపై ఉంచబడును. యాజకుడు దాని మెడను తెగగొట్టి వేసినప్పుడు, అది పాప నివారణ బలిగా రక్తమును చిందించి, అతని యొక్క పాపములను అతిక్రమములను కప్పివేయును.
అయితే క్రొత్త నిబంధనయందు లోకమంతటి పాపమును మోసుకొని తీర్చేటువంటి దేవుని గొర్రె పిల్లయైయున్న యేసుక్రీస్తు తానే ముందుకు వచ్చెను. ఘోరమైన వ్యభిచారము, జారత్వము, హత్యలు, దోపిడీలు, దుర్మార్గపు క్రియలు అను అన్ని నేరములు ఆయనపై మోపబడెను. అన్నిటిని మోసుకొని తీర్చివేసి, “తండ్రి వీరిని క్షమించుము” అని చెప్పి తన యొక్క రక్తమును కార్చి పాపక్షమాపణను అనుగ్రహించెను.
దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క భుజములయందు మీయొక్క పాపపు భారమును మోపుట మాత్రము గాక, పాప నివారణయు, పాప క్షమాపణయు ఉన్నది. అట్టి భుజమును తేరి చూడుడి.
నేటి ధ్యానమునకై: 📖”తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు” (కీర్తన. 32:1)..
