Appam, Appam - Telugu

జూన్ 05 – కలతలయందు ఆదరణ

“మీ హృదయమును కలవరపడ  నియ్యకుడి; దేవుని యందు  విశ్వాసముంచుచున్నారు,  నాయందును విశ్వాసముంచుడి”   (యోహాను. 14:1).”

ఈ లోకమునందు కలత చెందిన హృదయముతోను, కన్నీటితోను, వేదనతోను జీవించుటకు ఎవరును కోరుకొనరు. కలత అనేది సాతాను తీసుకొని వచ్చుచున్న ఒక అతిపెద్ద శోధన. కొందరు, కలత సమయము నందు వారు ఏమి చేయుచున్నారో అని తెలియక, పొరపాట్లపై పొరపాట్లను చేయుచూ ఉంటారు.   కొందరి  యొక్క మనస్సు ఎప్పుడు చూసినా కంగారుతోను కలత చెందినదిగాను ఉండును.

అనేకులకు విచారకరమైన వార్తను విన్న వెంటనే హృదయము కలత చెందుచున్నది. కొందరికి కఠినమైన మాటలు విన్నప్పుడు, కలత వచ్చుచున్నది. కోపము కనులను మూసివేసి మరుగుపరచి, మనస్సునందు కలతను, కంగారును తీసుకొని వచ్చుచున్నది.

మీరు ఎట్టి పరిస్థితులలోనూ కలత చెందకుడి. మీ కలతల మధ్యన, శ్రమల మధ్యన, ప్రభువు వద్దకు పరిగెత్తుకొని వచ్చేయండి. మనుష్యులను ఆశ్రయించి వెళ్ళక ప్రభువు యొక్క పాదములనే ఏర్పరచుకొనుడి. ప్రభువును ఆశ్రయించి వచ్చిన వారందరను తమ కలతల నుండి విడుదలను పొందుకొనిట్లు మనము బైబిలు గ్రంధమునందు చదువుచున్నాము.

ఒకసారి  యేసును, శిష్యులను ధోనెలో ప్రయాణము చేయుచున్నప్పుడు. బలమైన సుడిగాలి లేచి, ధోనె మునిగిపోవు నంతగా దానిపై వీచెను. అప్పుడు శిష్యులు మిగుల భయపడి, ఏమి చేయుదమని కలత చెందిరి. అప్పుడు యేసు ధోనె యొక్క అమరమునందు తలగడ పెట్టుకొని నిద్రించు చుండెను. శిష్యులు ఆయనను లేపి,   “బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా?” అనిరి   (మార్కు. 4:38).

ఆయన లేచి, గాలిని గద్దించి, సముద్రమును చూచి నిశ్శబ్దమై, ఊరకుండుము అని చెప్పెను. అప్పుడు గాలి అణగి, మిక్కిలి      నిమ్మళ మాయెను. యేసు వారిని చూచి:     “మీ రెందుకని ఇలా భయపడుచున్నారు?  మీరింకను నమ్మికలేక యున్నారా? అని  వారితో చెప్పెను”   (మార్కు. 4:40).

హన్నా ప్రభువును ఆశ్రయించి దేవాలయమునకు వచ్చి తన హృదయమును కుమ్మరించలేదా? మరియ తన యొద్ద నుండి తీసివేయబడని ఉత్తమమైన క్రీస్తుని పాదాలనే ఏర్పరచుకొన లేదా? మీ కలత మానుటకు ప్రభువు వద్దకు తరలిరండి. ప్రభువు ఎల్లప్పుడును మీతో కూడా ఉండువాడు, అనుటచే నిశ్చయముగానే మీకు ఒక అద్భుతమును చేయును.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “విశ్వసించువాడు కలవరపడడు”    (యెషయా. 28:16).  మీరు ఎట్టి సందర్భమునందైనను కలవరపడి నట్లయితే,  మిమ్ములను ప్రేమించుచున్న ప్రభువుపై మీకు చాలినంత విశ్వాసము లేదనుటయే దానియొక్క అర్థము. దేవుని బిడ్డలారా, ప్రభువుపై విశ్వాసమును కలిగియుండుడి. ప్రభువు మీయొక్క ప్రతి విధములైన కలతలన్నిటిని మార్చి మీకు సమాధానమును అనుగ్రహించును.

 నేటి ధ్యానమునకై: “సమస్త జ్ఞానమునకు మించిన  దేవుని సమాధానము యేసుక్రీస్తు నందున మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును”   (ఫిలిప్పీ. 4:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.