No products in the cart.
జూన్ 02 – లేఖన వాక్యముచే ఆదరణ
“నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది, నా బాధలో ఇదే నాకు (నెమ్మది కలిగించుచున్నది) ఆదరణ” (కీర్తన. 119:50).”
దేవుడు మనకు అనుగ్రహించిన సమస్త యీవులలో ఒక్కటి, మిక్కిలి ఆదరణను ఇచ్చు లేఖన గ్రంధ వాక్యములైయున్నది. దావీదు రాజు తనను లేఖన వాక్యములు బ్రతికించినట్లుగా చెప్పుటను చూడగలము.
ఇజ్రాయేలు ప్రజలు నాలుగువందల సంవత్సరములకు పైగా ఐగుప్తు దేశమునందు శ్రమ పడుటను ప్రభువు తేరి చూచెను. “నేను ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదను” (నిర్గమ. 3:17) అని వాగ్దానము చేసెను.
ఆయన వాగ్దానము చేసినట్లుగానే, ఇశ్రాయేలీయులను కనాను లోనికి తీసుకుని వెళ్ళినప్పుడు, వారి యొక్క బాధలు తొలగిపోయెను. సమృద్ధిచే సంతోషము కలిగెను. బాధ పడుచున్న వారికి ప్రభువు సహాయము చేసినట్లు మీరును సహాయము చేయుడి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “బాదపడుచున్న వారిని కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును” (కీర్తన. 41:1).
చింత అనేది ఒక మనిషిని యొక్క జీవితమునందు ఏ విధముగా అనగద్రొక్కుచున్నది, అను సంగతిని వివరించి చెప్తే గాని మీరు అర్థము చేసుకోవలసిన అవసరము లేదు. మీ అంతట మీరే వేలకొలది సంఘటనలను చూచి ఉంటారు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును. దయగల మాట దాని సంతోషపెట్టును” (సామె. 12:25).
మీరు బైబిలు గ్రంధము మరల మరల చదువుతున్నప్పుడు, అందులోని వాక్యములు అన్నియు మీ యొక్క హృదయమునకు ఆదరణ కలిగించును. మీయొక్క చింతలను మరచునట్లు చేయుచున్నది. ప్రతిసారి చదువుచున్నప్పుడల్లా, అది మీ యొక్క విచారములను తొలగించి మిమ్ములను పరవశింప చేయును. దావీదు సెలవిచ్చుచున్నాడు, “నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది, నా బాధలో ఇదే నాకు ఆదరణ” (కీర్తన. 119:50).
ప్రభువు యొక్క లేఖన గ్రంథమునకు మీరు అత్యధిక సమయమును కేటాయించినట్లయితే అది నిశ్ఛయముగానే మీయొక్క అంతరంగమునకు ఆదరణ కలిగించును, ఉత్సాహపరచును, ఆత్మీయ జీవితమును తట్టి లేవనెత్తును.
అపోస్తులుడైన పౌలు వ్రాయుచున్నాడు: “లేఖనములవలని కలుగు ఓర్పువలనను, ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి” (రోమీ. 15:4). దేవుని బిడ్డలారా, బైబిలు గ్రంథమును చదువుటకై అత్యధికమైన సమయమును కేటాయించి బైబిలు గ్రంధము అంతటిని చదువుడి. అది మీకు అతి గొప్ప ఆదరణను కలిగించును.
నేటి ధ్యానమునకై: “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది” (కీర్తన. 119:105).