situs toto musimtogel toto slot musimtogel link musimtogel daftar musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

జనవరి 25 – నీతియను ఫలము!

“నీతిఫలము అనేది సమాధానమును చేయువారి  ద్వారా సమాధానమునందు విత్తబడును”       (యాకోబు. 3:18).

మన యొక్క పెదవులను అతి చక్కని రీతిలో వాడుటకై కోరినట్లయితే, మన ప్రభువును స్తుతించి దాని ద్వారా జిహ్వా ఫలములైన కృతజ్ఞతా స్తుతులను కొనసాగించి దేవునికి చెల్లించుటకు నేర్చుకొనవలెను. పెదవులు అంతరంగము యొక్క వాంఛలను బయలుపరచుచున్నది.

అంతరంగమునందు చీకటియు, అంధకారమును నిండియున్నట్లయితే, పెదవులు అబద్ధమును, కొండెములను బయలుపరచును. అంతరంగము యొక్క లోతులలో పరిశుద్ధాత్ముని వేరు తన్నుకుని ఉన్నట్లయితే, మన పెదవులు స్తోత్రములను మధురమైన ఫలములను ఎల్లప్పుడును ఫలించుచుండును.   “స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు”  అని  కీర్తనలు. 50:23 నందు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

మనము ప్రభువును స్తుతించి, స్తోత్రించి, ఆరాధన చేయుచున్నప్పుడు, అది దేవుని సముఖమునందు సుగంధ సువాసనగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, అది ప్రభువు యొక్క హృదయమును ఆనందింపజేయుచున్నది.  పాత నిబంధనయందు బలులను ఎలాగు ఆయన సుగంధ సువాసనగా అంగీకరించెనో అదే విధముగా కొత్త నిబంధనయందు స్తోత్ర బలులను చూచి ప్రభువు మనస్సునందు ఆనందించుచున్నాడు, ఉల్లసించుచున్నాడు!

పాత నిబంధన బలులకు ప్రాముఖ్యతనుయిచ్చి, అబ్రహాము ఎప్పుడంతా ప్రభువునకు బలిని అర్పించెనో, అప్పుడంతా ఆ బలిపీఠము యొక్క అగ్నిజ్వాలయందు ప్రభువు దిగివచ్చెను.

అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రమునందు దహనబలి, పాపపరిహారార్థబలి, నైవేద్యబలి, అని విస్తారమైన బలులను గూర్చి ఆజ్ఞాపించెను. అట్టి బలులను గూర్చి దావీదు సెలవిచ్చుచున్నాడు:     “నీవు బలిని కోరువాడవుకావు, కోరినయెడల నేను అర్పించుదును, దహనబలి నీకిష్టమైనది కాదు”     (కీర్తనలు. 51:16).

దేవునికి ఇష్టమైన మొట్టమొదటి బలి విరిగిన మనస్సైయున్నది.    “విరిగిన మనస్సే దేవుని కిష్టమైన బలులు;  దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు”      (కీర్తనలు. 51:17). రెండవ బలి, జిహ్వా ఫలమునైన కృతజ్ఞతా స్తోత్రములైయున్నవి. పాత నిబంధన భక్తుడైన యోబు యొక్క  మృగ జీవరాసులన్నీయును నశింపబడినప్పటికిని, పిల్లలు మరణించినప్పటికిని, యోబు భక్తుడు అట్టి కఠినమైన పరిస్థితుల యందును ప్రభువును తేరి చూచి స్తోత్ర బలులను అర్పించెను.      “యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను. ప్రభువు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము”  అని స్తోత్రించెను. అది ఆనందకరమైన స్తోత్రము కాదు, త్యాగబలియైన స్తోత్రము.

కొందరు, ఆనందకరమైన సమయమునందు, అన్ని వసతులు ఉన్నప్పుడు ప్రభువును స్తోత్రించెదరు. నెల జీతమును పుచ్చుకొనుచున్నప్పుడు స్తోత్రించెదరు. విపత్తులయందు ప్రాణము తప్పించబడినప్పుడు స్తోత్రించెదరు. మేళ్లును ఆశీర్వాదములను పొందుకొనుచున్నప్పుడు స్తోత్రించెదరు. ఇది సహజమైన స్తోత్రము.

అయితే, శోధనలయందును, పోరాటములయందు, సమస్యలును వచ్చుచున్నప్పుడు వాటి మధ్యలో కూడా ప్రభువును స్తోత్రించువారే త్యాగమైన బలియైయున్న స్తోత్ర బలులను అర్పించువారు. దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితులయందును ప్రభువును స్తోతిరించుటకు ముందుకు రండి.

నేటి ధ్యానమునకై: “నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి”     (ప.గీ. 7:13).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.