No products in the cart.
జనవరి 17 – విరిగిన హృదయము
“నీవు బలిని కోరువాడవుకావు; కోరినయెడల నేను అర్పించుదును; దహనబలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు; దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు” (కీర్తనలు. 51:16,17).
నలిగిన హృదయముతో ప్రభువు వద్దకు వచ్చుచున్నప్పుడు, ప్రభువు యొక్క అంతరంగము కరుగుచున్నది. ఆయన ప్రేమతో మిమ్ములను హక్కున చేర్చుకొనుటకు తన యొక్క హస్తమును చాచుచున్నాడు. ఒక్కడు ఎంత పెద్ద పాపి అయినప్పటికిని, విరిగినలిగిన హృదయముతో దేవుని సముఖమునందు తన యొక్క పాపముల కొరకు రోధించి ఏడ్చుచున్నప్పుడు, ప్రభువు యొక్క పాప క్షమాపణను ఇచ్చు హస్తము అతనిని ముట్టి, కడిగి పవిత్రపరుచుచున్నది.
ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “నేను … వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును వినయము గలవారి యొద్దను దీనమనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను”. (యెషయా. 57:15).
ఆలోచించి చూడుడి, ఒక బంగారపు రాయిని భూగర్భము నుండి త్రొవ్వి తీయుచున్నారు. మొదటిగా దానిని కొట్టి విరుచుచున్నారు. దాని తరువాత కుంపటిలో వేసి కరిగించుచున్నారు. విరవ పడిన ఆ గడ్డను మేలిమి బంగారముగా చేసి, ఆ తరువాత అందమైన ఆభరణముగా మార్చుచున్నారు.
శోధన మీ యొక్క హృదయమును విరుచుచున్నప్పుడు మీరు సువర్ణముగా మారుదురు అను సంగతిని మర్చిపోకుడి. యోబు భక్తుని జీవితమునందు ఆయన ఎన్ని శ్రమల గుండా దాటి వెళ్లి, విరగగొట్టబడిన అనుభవమునందు ఉండేను! అవి అన్నియును ఆయనకు ఆశీర్వాదముగా మారినది కదా?
రోజా పుష్పమును చూడుడి. సువాసన తైలమును తీయుట కొరకు దానిని నలిపి పిండుచున్నారు. మీరు ప్రభువు కొరకు సుగంధ సువాసనను వీచునట్లుగా, ప్రభువు నడిపించుచున్న త్రోవలయందు సంతోషముతో నడుచుదురా? జఠామాంసి తైలము బుడ్డిలో ఉన్నంతవరకు అది సువాసనను వేదజల్లదు.
అయితే అది పగలకొట్టబడి క్రీస్తు యొక్క పాదములయందు పోయబడుచున్నప్పుడు ఆ ఇల్లంతయును పరిమళ తైలము యొక్క వాసనచేత పరిమలించును. అదేవిధముగా మీ యొక్క అంతరంగము విరగగొట్టబడి, కన్నీళ్లు అనునది క్రీస్తు యొక్క పాదములయందు పోయబడుచున్నప్పుడు, పరలోకము ఆ సంగతిని గ్రహించును. విరిగిన అంతరంగము నుండి చేయబడుచున్న ఆసక్తిగల ప్రార్ధన అనునది పరలోకమునకు తిన్నగా వెళ్లి చేరును.
తన చేతులతో రొట్టెను ఎత్తి పట్టుకుని దానిని విరిచెను. విరువబడి చీల్చబడిన ఆ రొట్టె అనునది క్రీస్తు సిలువలో విరవబడుటకు సాదృశ్యముగా ఉండెను. సిలువలో ఆయన యొక్క శరీరము పీచు పీచుగా చీల్చి వేయబడెను. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను” (యెషయా. 53:5).
దేవుని బిడ్డలారా, మీ కొరకు నలగగొట్టబడిన దేవుని కుమారుని తేరి చూడుడి. ఆయన మీ విరిగిన అంతరంగము యొక్క వేదనను ఎరుగును. మీ యొక్క కన్నీళ్లను తుణీకరించి ఆయన ఎన్నడను దాటి వెళ్ళడు. మీ యొక్క విరిగిన అంతరంగము అనునది ఆయన యొక్క హృదయమును కరిగించుచున్నది. ఆయన తన యొక్క బంగారపు హస్తము చేత మీయొక్క కన్నీటినంతటిని తుడిచివేయును.
నేటి ధ్యానమునకై: “విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన (మనస్సు) ఆత్మను గలవారిని ఆయన రక్షించును” (కీర్తనలు. 34:18).
