No products in the cart.
ఏప్రిల్ 27 – సంఘమునందు!
“అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి” (అపో.కా. 5:25).
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి (అపో.కా. 20:28). “ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము సంఘమునందు వారితో చేర్చుచుండెను” (అపో.కా. 2:47).
సంఘము అనునది విశ్వాసుల యొక్క సహవాసమైయున్నది. దేవుని యొక్క బిడ్డలైయున్న సహోదర సహోదరీలు ఏకముగా కూడి, ఏక మనస్సుతో ప్రభువును ఆత్మతోను, సత్యముతోను ఆరాధించుచున్న పరిశుద్ధ స్థలముగా అది ఉన్నది.
ఒకసారి ఒక పాత పత్రికియందు ఒక భక్తుడు హృదయమును శ్రవింపజేయునట్లు వ్రాసిన ఒక ప్రార్ధనను చదివితిని. “ప్రేమగల పరలోకపు తండ్రి! దేవా నీవు ప్రేమతో ఉండునట్లుగా మేమును ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండవలెనని దేవా మాకు స్పష్టముగా బోధించియున్నావే. అయితే మీ యొక్క ప్రజలు అని పిలువబడుచున్న మాయందు ప్రేమకు బదులుగా పగయు, విభజనలును, పట్టింపులును, అసూయయు, అతిశయమును, ఓర్వలేనితనమును, కుల భేదములును, పేద ధనికుడు అను హెచ్చు తగ్గింపులును ఎంతగానో తలవిరబోసుకుని నాట్యమాడుచున్నది. వీటిని అన్నిటిని చూచుచున్నప్పుడు మీ యొక్క కన్నులయందు రక్తపు కన్నీరు వచ్చునని ఎరిగియున్నాము. కావున దేవుని ప్రేమచేత మాయొక్క అంతరంగమును నింపివేయుము. ఆమేన్” అని సూచించియుండెను.
సంఘమునందు ప్రేమించేటువంటి దేవుని యొక్క బిడ్డలు సంఘము కొరకు ప్రార్థించవలసినది అవశ్యమైయున్నది. సంఘమునందు గల బోధకుల కొరకును, ప్రభువు లేవనెత్తియున్న సేవకుల కొరకును, కన్నీటితో గోజాడవలసినది అవశ్యమైయున్నది. దేశము నందు సమస్యలు వచ్చుచున్నప్పుడు, సంఘముగా కూడి ఉపవాసముండి ప్రార్థించుడి. సంఘము ద్వారా సువార్త పరిచర్యను చేయుడి. ఆత్మలను సంధించి ప్రభువు లోనికి నడిపించుడి.
క్రీస్తైయున్న మూలరాయిపై, అపోస్తులులు ప్రవక్తలు అనువారి పునాదిపై సంఘము కట్టబడి కట్టడముగా లేవనెత్తబడవలెను. సంఘమునకు గొప్ప కాపరిగా ప్రభువు తానే ఉండి సంఘమును త్రోవ నడిపించుచున్నాడు. క్రీస్తు శిరస్సు అయితే, సంఘము శరీరమైయున్నది. క్రీస్తు కాపరి అయితే, సంఘము మేపబడుచున్న గొర్రెలైయున్నది. క్రీస్తు ద్రాక్షావల్లి అయితే, సంఘము ఆయనయందు నిలిచియుండు తీగయైయున్నది. విశ్వాసులయందు ప్రేమ గల సహవాసము కలిగియుంటేనే సంఘము ఏక మనస్సుతో ముందుకు కొనసాగి వెళ్లగలదు.
ఒకసారి దైవ సేవకులైన పాల్ యాంగిఛో చెప్పెను: “మా యొక్క సంఘమునందు ఇరవైమంది సభ్యులుయున్న కాలములు ఉండెను. లక్షల కొలదిగా పెరిగియున్న కాలమును కలదు. అయితే ఒక్కసారి కూడా సంఘము చీలిపోయినది లేదు. కారణము మేము ప్రతి ఒక్క ఆరాధనయందును సంఘము యొక్క ఐక్యత కొరకును, ఏక తాత్పర్యము కొరకును కన్నీటితో ప్రార్థించుచున్నాము. కావున పాతాళము యొక్క ద్వారములు మమ్ములను జయించలేకపోయెను. మేము ఐక్యతగా ఉండుట చేతనే, బలవంతలమై ఉన్నాము. సాతాను ఎంతగానో చీలికను తీసుకొని వచ్చుటకు ప్రయత్నించును, మా యొక్క ప్రార్ధన యోధులు మోక్కాలయందు నిలబడి అతని యొక్క క్రియలను నిర్మూలము చేయుచున్నారు” అని చెప్పెను.
దేవుని బిడ్డలారా, సంఘము యొక్క బలమే, విశ్వాసుల యొక్క బలము.
నేటి ధ్యానమునకై: “విశ్వసించిన వారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారైయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను” (అపో.కా. 4:32).