Appam, Appam - Telugu

ఏప్రిల్ 27 – పాపము ప్రాయశ్చిత్తమునొందుట

“తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ధన్యుడు”    (కీర్తనలు. 32:1) 

పాపక్షమాపణ కంటూ బైబిలు గ్రంధమునందు ఒక అధ్యాయము ఉందంటే, అది 32 ‘వ కీర్తనయైయున్నది. ఈ కీర్తన, పరిశుద్ధుడైన ఆగస్టీనునకు మిగుల ఇష్టమైన ఒక కీర్తనయైయున్నది. ఆయన రక్షింపబడుటకు పూర్వము, అపవిత్రమైన జీవితమును జీవించుచుండెను. రక్షింపబడ్డ సమయమునందు, ఆయన ఈ 32 “వ కీర్తనను మరలా మరలా చదివి, మనస్సునందు నొచ్చుకుని ఏడ్చేను. తన యొక్క పడక గదియందు గల గోడ పై కూడా ఈ కీర్తనను వ్రాసి ఉంచెను.

ఈ లోకమునందు గల శ్రమలలో మిగుల గొప్ప శ్రమ నేరారోపణ చేయు మనస్సాక్షియందు నేరారోపణ చేయబడుటయే. అదే సమయమునందు ఒక మనుష్యుని యొక్క అతిక్రమము క్షమింపబడుచున్నప్పుడు, అతని యొక్క హృదయమునందు కలుగు గొప్ప విడుదలకును, సంతోషమునకును, సమాధానమునకును సరిసాటి లేనిదైయుండును. కావున మీ యొక్క పాపములను కల్వరి యొద్దకు తీసుకొచ్చి, క్రీస్తుని వద్ద ఒప్పుకోలు చేసుకుని, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తమును పొందుకొనుచున్నారు.

ఒకసారి ఒకడు ఒక బంగారపు దుకాణమును కొల్లగొట్టుటకు పోయినప్పుడు, ఆ దుకాణపు యజమానుడు,    “బంగారమును కావాలంటే తీసుకొనుము. నన్ను చంపి వేయకుము”  అని మిగుల బతిమిలాడెను. అయితే కొల్లగొట్టువాడు,  జాలి కనికరము లేక, ఆయనను చంపివేసి, బంగారమంతటిని కొల్లగొట్టుకొని పారిపోయెను. చివరకు పోలీసులు ఆయనను ఖైదు చేసిరి. న్యాయస్థానమునందు వాదోపవాదాలు పరిశీలింపబడెను. నేరస్తుని యొక్క తరుపునున్న అతని న్యాయవాది బహు సామర్థ్యముగా వాదించి అతనిని కాపాడుటకు ప్రయత్నించెను.

అయితే అకస్మాత్తుగా ఆ నేరస్తుడే న్యాయాధిపతిని చూచి,    “అయ్యా రాత్రి పగళ్ళు నా మనస్సాక్షి నాపై నేరారోపణ చేయుచున్నది.  నేనే హత్యను చేసాను”. ప్రతి దినమును రాత్రి సమయమునందు,   “నన్ను చంపి వేయకము, చంపి వేయకుము”  అని ఆయన విలపించిన శబ్దము నిత్యము నా చెవులకు వినబడుచు, నాకు పిచ్చి పట్టునట్లు చేయుచున్నది.    “దయచేసి నన్ను త్వరగా ఉరితీసి చంపివేయుడి” అని విలపించెను.

దేవుడి బిడ్డలారా,  “తన పాపములను (అతిక్రమములను) దాచిపెట్టువాడు వర్ధిల్లడు”    (సామెతలు. 28:13). ఒక్కడు పశ్చాత్తాపపడి, వాటిని ఒప్పుకోలు చేసి, విడిచి పెట్టుచున్నప్పుడు, ప్రభువు అతని క్షమించి, శుద్ధీకరించి, నీతిమంతునిగా నిలబెట్టును. కొందరు పాపపు ఒప్పుకోలు చేయుచున్నప్పుడు, చిలక పలుకువలే ఎట్టి గ్రహింపు లేక, పూర్ణ మనస్సుతో కాక చెప్పినదే మరల మరల చెప్పుచున్నారు. ఇట్టి పాపపు ఒప్పుకోలు ద్వారా ఎట్టి ప్రయోజనము లేదు.

అహరోను ఇశ్రాయేలీల వద్ద నుండి బంగారపు ఆభరణములను సేకరించి, పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను (నిర్గమ. 32:4). అది యెహోవా యొక్క దృష్టియందు బహు ఘోరమైన పాపపు కృత్యమైయుండెను. విగ్రహమును చేసిన వెంటనే, ఇశ్రాయేలీయులను విగ్రహారాధనలోనికి త్రోవ నడిపించుట ఎంతటి ఘోర పాపము!

అయితే మోషే అహరోనును అడిగినప్పుడు,  అహరోను చెప్పెను,    “నేను ఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెననెను”    (నిర్గమ. 32:24). సామర్థ్యముగా మలచబడి, చెప్పబడిన అబద్ధము ఇది. అబద్ధము చేత ఎన్నడును పాపమునుండి విడిపించబడలేము.

నేటి ధ్యానమునకై: 📖”మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి”    (యాకొబు. 5:16).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.