No products in the cart.
ఏప్రిల్ 22 – మనుష్యకుమారుడు వచ్చును!
“మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును” (మత్తయి. 24:44).
ప్రభువు యొక్క రాకడ సమీపముగా ఉన్నది. మనము ప్రభువు యొక్క రాకడ ఎప్పుడు ఉండును అని తలంచుచున్నామో, దానికంటే ప్రభువు యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. ఎల్లప్పుడును సిద్ధపడిన స్థితియందు ఆయనను ఎదుర్కొందుము గాక!
మనుష్యుని యొక్క నేటి స్థితిని వివరించుటకు ఒక వేడుకయైన సంభవమును సేవకులు చెప్పుచుంటారు. ఒక మనుష్యుని సింహము ఒకటి తరుముచు రాగా, సింహము బారి నుండి తప్పించుకొనుటకు పాడైన బావిలోనికి అతడు దూకెను. మంచి సమయానికి ఆ బావిలో వేలాడుతున్న ఒక మర్రిచెట్టు యొక్క ఊడను అతడు గట్టిగా పట్టుకొనినందున ప్రాణము తప్పించబడినను గాలిలో వేలాడుచుండెను.
పైన సింహము గర్జించుయుండెను. క్రింద చూచినప్పుడు ఆ పాడైన బావియొక్క అట్టడుగు భాగమునందు రెండు నల్ల తాచు పాములు అతడు ఎప్పుడు క్రింద పడును కాటు వేయుటకు అని పడగను విప్పి బుసలు కొట్టుచుండెను. ఇతడు వేలాడుచున్న ఊడనైతే, పైనుండి ఒక ఎలుక కొద్దికొద్దిగా కొరికి తెగిపోయే పరిస్థితికి తీసుకుని వచ్చెను.
అయితే, అతడు సమీపమునున్న తేని గూటిలో నుండి కారుచున్న తేనెను తన నాలుకను చాపి రుచిస్తూ ఉండెను. తేనె యొక్క రుచి అతని కన్నులకు మత్తును కలుగజేసేను. తాను ఎటువంటి ప్రమాదములో ఉన్నానన్న సంగతిని మరిచిపోయినవాడై తేనేపైనే తన కన్నులను కలిగియుండెను.
నేటి మనిష్యుని యొక్క పరిస్థితియు అదియే. క్షణికమైన సుఖము యొక్క వ్యామోహమునందే అతడు తపనను కలిగియున్నాడు. పాపపు సంతోషమే అతని మనస్సును మత్తిలచేసియున్నది. రక్షణనుగూర్చి గాని, నీతినిగూర్చి గాని అతనికి అక్కరలేదు. నరకాగ్ని గుండమును గూర్చిన తలంపే లేదు. ప్రభువు యొక్క రాకడ సమీపమైయున్నది అనేటువంటి గ్రహింపు లేదు. అన్ని వైపుల ప్రమాదము ఆవరించి ఉండుటను గ్రహించక, క్షణికమైన సుఖము యొక్క మత్తులో మునిగియున్నాడు.
అదే విధముగానే ఆనాడు సంసోను క్షణికమైన సుఖపు మత్తులో మునిగియున్నందున, ఇశ్రాయేలీయుల యొక్క న్యాయాధిపతిగా హెచ్చింపబడి ఉండినప్పటికిని, సమస్తమును కోల్పోవలసినదై ఉండెను.
యేసు చెప్పేను: “నోవహు దినములు ఏలాగుండెనో, మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకును, వారు తినుచు త్రాగుచు, పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచుయుండి, జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును” (మత్తయి. 24:37-39).
రోమా సామ్రాజ్యము పతనమవ్వుటుకు ప్రాముఖ్యమైన కారణము ఏమిటో తెలియునా? తమ చుట్టూతా ఉన్న శత్రువులను మరచి, వారు తినుచు త్రాగుచు మత్తల్లియుండుట చేత, వారిని శత్రువులు బహు సులుగా జెయించిరి.
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధపడుడి. ఎల్లప్పుడును నా ప్రియ రక్షకుడు వచ్చును అని ప్రతి ఒక్క నిమిషమును ఎదురుచూచుచూనే ఉండుడి.
నేటి ధ్యానమునకై: “ఇదిగో పెండ్లికుమారుడు వచ్చుచున్నాడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను” (మత్తయి. 25:6).