bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

ఏప్రిల్ 10 – సమాధానము

“శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా, యేసు వచ్చి మధ్యను నిలిచి; మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పెను”    (యోహాను. 20:19)

“మీకు సమాధానము”   అను మాట ఆనాడు శిష్యుల యొక్క హృదయమును తెప్పరిల్ల చేసెను. ఆ మాట నేడును మనలను ఆనందింప చేయుచున్నది. మన హృదయమునందును, కుటుంబమునందును సమాధానము కలిగి ఉండుట గొప్ప భాగ్యము కదా? యేసుక్రీస్తు ఈ లోకములోనికి తీసుకొని వచ్చిన పలు ఆశీర్వాదములయందు తలమాణికమైన ఆశీర్వాదము “సమాధానము” నైయున్నది.

లోకము పాపమునందు బ్రష్టత్వము చెందియున్నది. సాతాను నెమ్మదిని చెరిపివేసి, జనుల హృదయమునందు కోపమును, ద్వేషమును విత్తెను. అన్నిటియందును గందరగోళములను, పోరాటములను నిండియుండెను.  అయితే యేసు జన్మించుచున్న సమయము వచ్చినప్పుడు దేవదూతలు ప్రత్యక్షమై,   “భూమిమీద సమాధానము” అని చెప్పిరి. యేసు పుట్టుక ద్వారా లోకమంతటికి మహా గొప్ప సంతోషమును కలుగజేయు  సువార్త   “సమాధానము” నైయున్నది.

మన ప్రియ ప్రభువు యొక్క బోధనలను చూడుడి. అవి ఎంత ఆదరణకరమైనవి! ఎంత సమాధానకరమైనవి! కలత చెందియున్న శిష్యులను చూచి యేసు చెప్పెను:   “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి”    (యోహాను. 14:27).

యేసు శిలువయందు వేయబడినప్పుడు శిష్యుల యొక్క  హృదయమును కలత మరల ఆవరించెను. యేసు మరణించిన వేదన ఒకవైపున, యూదులకు భయపడుచున్న భయము మరోవైపున. యెరూషలేము నందుగల ఒక ఇంట తలుపులకు తాళము వేసుకొని, భయముతో ఉన్నప్పుడు, తలుపులు వేయబడియున్న గదిలో యేసు వచ్చి వారి మధ్యలో నిలచి,    “మీకు సమాధానము”  అని చెప్పెను. ఓ! అట్టి మాట ఎంతగా వారిని ఓదార్చియుండును!

మీరు కూడా తాళము వేయబడి తలుపులు వేసుకుని నివాసముండే పరుస్థుతులలో ఉన్నారా?  ప్రతి స్థలమునందును మీకై తలుపులు ముయబడిన పరిస్థితిలో ఉన్నదా? ప్రతి స్థలమునందును దుర్మార్గులైన మనుష్యులు మిమ్ములను ఎదిరించుచు వచ్చుచున్నారా? కలతచెందకుడి!

ఆనాడు తలుపులు వేయబడ్డ గదిలోనికి వచ్చి నిలబడి,   “సమాధానము” అని చెప్పినవాడు. నేడు ముయబడియున్న ఎట్టి పరిస్థితులనైనను, సమస్యలనైనను వాటి మధ్యలో మీ సమీపమునందు నిలబడి, “మీకు సమాధానము” అని చెప్పుచున్నాడు. సమాధాన కర్తయగు ప్రభువు నేడే దైవీక సమాధానముతో మిమ్ములను నింపునుగాక. క్రీస్తు ఇచ్చుచున్న ఇట్టి సమాధానము నది వలెయున్న సమాధానమై  ఉండును. ఇట్టి సమాధానము మన ఊహకు అందని సమాధానమై ఉండును.

దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క సమాధానము మీయొక్క హృదయమునంతటిని నింపవలెనని కోరుచున్నారా? అయితే ప్రభువును దృఢముగా పట్టుకొనుడి.  బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది:    “ఎవనిమనస్సు నీమీద దృఢముగా ఆనుకొనియుండునో అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు గనుక, వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు”   (యెషయా. 26:3)

నేటి ధ్యానమునకై: 📖”ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు ఈ యింటికి సమాధానమగు గాక   అని మొదట చెప్పుడి”    (లూకా. 10:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.