No products in the cart.
ఆగస్టు 28 – ప్రసన్నత యొక్క స్వరము!
“పగటివేల చల్లపూట సమయమునందు ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, అప్పుడు దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ, తోటచెట్ల మధ్యను దాగుకొనగా” (ఆది.కా. 3:8).
దైవప్రసన్నతను కొలత లేకుండా మన యొక్క జీవితమునందు తీసుకొని వచ్చుట ఎలాగు అనుటను గూర్చి తరచుగా మనము ధ్యానించుచు వచ్చుచున్నాము. దైవప్రసన్నతను మీయొక్క జీవితమునందు స్థిరపరచబడునట్లు, కొన్ని సంభవములను, చర్యలను ప్రభువు యొక్క ప్రసన్నతతో కలిపి మీయొక్క జీవితములో అభ్యాసము చేయుడి.
ఆనాడు ఆదామును అవ్వయును ఏధేను తోటలో దేవుడు సంచరించుచున్న స్వరమును విన్నప్పుడు, దేవుని యొక్క మధురమైన ప్రసన్నతను గ్రహించిరి. తండ్రి యొక్క సన్నిధిలో పిల్లలు ఆనందించి ఉల్లసించునట్లుగా ప్రభువు యొక్క సన్నిధిలో వారు ఆనందించి ఉల్లసించి ఉండవలెను.
“నేను ఆయన యొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని, ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని.” (సామెతలు. 8:30,31). అనుట మన జీవితము యొక్క అనుభవముగా ఉండవలెను. మీరు ఆయన యొక్క ముద్దుబిడ్డలు. ఆయన ఆనందించేటువంటి పాత్రలు. మీయందు ఆనందించవలెను అని ఆయన కోరుచున్నాడు.
మీరు ఎక్కడైనా నడిచి వెళ్ళుచున్నప్పుడు కూడాను యేసు మీతో కూడా నడిచి వచ్చుచున్నాడు అనెటువంటి గ్రహింపును కలిగియుండుడి. ఆయన హస్తమును పట్టుకొని నడుచుచున్నట్లుగా ఊహించుకొనుడి. తర్వాత ఆయనతో ఠీవీగా మాట్లాడుచూనే రండి.
కారును నడుపుచున్నప్పుడు, కార్యాలయమునందు పనిచేయుచున్నప్పుడు, నడక వంటి వ్యాయామములను చేయుచున్నప్పుడు కూడాను, మిగితా సమయములయందు కూడాను ఆయన సమీపమున ఉన్నట్టుగానే గ్రహించి పనిచేయుడి.
క్రీస్తు యొక్క సముఖము మీతో కూడా ఉన్నది అను సంగతిని దృఢపరుచుకున్నట్లు ఏదైనా క్రొత్త అలవాటులను ఏర్పరచుకొనుడి. అప్పుడే మీరు ఎడతెరిపి లేకుండా ఆయనతో సంచరించగలరు. ఆయన యొక్క ప్రసన్నతయందు ఎదుగగలరు.
ఒక భక్తుడు చెప్పెను, “నేను ఉదయకాలమున లేచి దైవ సముఖమునందు కూర్చుండి దీర్ఘ శ్వాసను పీల్చుకొందును. అప్పుడు ప్రభువు యొక్క మధురమైన ప్రసన్నత నాలోనికి వచ్చినట్లుగా గ్రహించెదను. పరలోకపు బలమును, శక్తియు నాలో నిలచియుండునట్లుగా అంగీకరించెదను” అని చెప్పెను.
దేవుని బిడ్డలారా, మనుష్యుని శరీరమునందు ఊపిరితిత్తులు అనునది ప్రాణవాయువును కలిగి హృదయమును శుద్ధీకరించునట్లుగా పరిశుద్ధాత్ముడు మన అంతరంగ జీవితమును శుద్ధీకరించుచున్నాడు. దైవ ప్రసన్నత పరిశుద్ధతలో నుండి అత్యధిక పరిశుద్ధతను పొందునట్లుగా చేయుచున్నది.
నేటి ధ్యానమునకై: “ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను” (కీర్తనలు. 33:5,6).