No products in the cart.
ఆగస్టు 27 – పరిశుద్ధాత్ముని వలన విశ్రాంతి!
“పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను; దేవా! నీకు ఘనమైన కీర్తిగలపేరు కలుగునట్లు, నీవు నీ జనులను నడిపించితివి” (యెషయా. 63:14)
తండ్రియైన దేవుడు మనకు విశ్రాంతిని దయచేయుచున్నాడు (నిర్గమ. 33:14). కుమారుడైయున్న క్రీస్తు కూడా మనకు విశ్రాంతిని దయచేయుచున్నాడు (మత్తయి.11: 28). అదే విధముగా పరిశుద్ధాత్ముడు కూడా మనకు విశ్రాంతిని దయచేయుచున్నాడు (యెషయా. 28:12). అందుచేత సమాధానముతో విశ్రాంతి పొందుట మన జన్మహక్కు అను సంగతిని ఎరిగినవారై విశ్రాంతిలోనికి ఉత్సాహముగా ప్రవేశించుడి.
విశ్రాంతి పొందుటయందు రెండు రకములు కలదు. మొదటిది, మీరు పరిశుద్ధాత్మునియందు విశ్రాంతి పొందుట. రెండోవది, పరిశుద్ధాత్ముడు మీయందు విశ్రాంతి పొందుట. మీరు పరిశుద్ధాత్ముని యందు విశ్రాంతి పొందవలెను అంటే ఆయన యొక్క పాదములయందు కూర్చుండి, ఆయన దయచేయుచున్న పరలోక భాషను మాట్లాడుడి. అప్పుడు, మీయందు విశ్రాంతి వచ్చును. “నత్తివారి పెదవుల చేతను, అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు” అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.
మీరు ఎంతకెంతకు ఆత్మతోను, సత్యముతోను ప్రభువును స్తుతించుచున్నారో, ఎంతకెంతకు అన్యభాషలతో మాట్లాడుతున్నారో, అంతకంతకు మీయొక్క భారములను ప్రభువుపై మోపుచున్నవారై ఉండెదరు.
ప్రభువు కూడా వాక్కును ఇచ్చి, “అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు” (రోమీ. 8:26). అని సెలవిచ్చుచున్నాడు.
అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా మీయందు విశ్రాంతి పొందవలెను. యేసుక్రీస్తునిపై, పావురపు ఆకారమునందు వచ్చి దిగి విశ్రమించెను. “జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మయు, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మయు, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మయైయున్న యెహోవా ఆత్మ అతని మీద నిలిచియుండును” (యెషయా. 11:2). పరిశుద్ధాత్ముడు నిలిచియుండును అని ఇక్కడ మనము చదువుటను, ఆంగ్ల బైబిలు గ్రంధమునందు, “పరిశుద్ధాత్ముడు విశ్రమించును” అని భాషాంతరము చేయబడియున్నది.
నోవాహు యొక్క దినములయందు ఓడలో నుండి నోవాహు పావురమును బయటకు విడిచిపెట్టినప్పుడు, “నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున, తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక, ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను” (ఆది. 8:9).
అదే విధముగా పాత నిబంధన పరిశుద్ధుల వద్ద విశ్రాంతిని వెదకియు దొరకన్నందున, పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తు దినమునందు దైవ జనులపై దిగి, ఆ దినము మొదలుకొని ఈనాటి వరకు మనతో నివాసము చేయుచున్నాడు. ఆయన మీయందుండి విశ్రమించవలెను. అశుద్ధతలను మీ నుండి తొలగించి, పరిశుద్ధతకై మిమ్ములను సమర్పించుకున్నట్లయితే, పరిశుద్ధాత్ముడు మీ యందు విశ్రమించును.
నేటి ధ్యానమునకై: 📖”లోకము సత్యస్వరూపియగు ఆత్మను (ఆయనను) చూడదు, ఆయనను ఎరుగదు గనుక, ఆయనను పొందనేరదు; ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండుటచేత, మీరు ఆయనను ఎరుగుదురు” (యోహాను. 14:16,17).