No products in the cart.
ఆగస్టు 25 – న్యాయ తీర్పు యొక్క అద్భుతములు!
“సంఘమంతటికిని, ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను” (అపో.కా. 5:11
ఆశీర్వాదకరమైన అద్భుతములు కలవు. అభివృద్ధి చెందేటువంటి అద్భుతములు కలవు. అదే సమయమునందు న్యాయ తీర్పు యొక్క అద్భుతములును కలవు. జనులను హెచ్చరించుటకును, దేవునికి భయపడుచున్న భయమును కలుగజేయుటకును ప్రభువు న్యాయ తీర్పు యొక్క అద్భుతములను చేయుచున్నాడు.
ఉదాహరణకు, అననీయ మరియు సప్పీరాల యొక్క జీవితమునందు జరిగిన సంఘటన మీకు తెలిసినదే. అననీయ తన భార్యకు తెలిసినట్టుగాను తన పొలమును అమ్మి వేళలో కొంత భాగమును తన కొరకు దాచి పెట్టుకుని, మిగితా సొమ్మును అపోస్తుల యొక్క పాదములయందు తీసుకొని వచ్చి పెట్టెను.
అందునుబట్టి అతడు, అతని యొక్క భార్యయు మరణించవలసినదై ఉండెను. పరిశుద్ధ ఆత్మకు విరోధముగా పాపము చేయుట ఎంత భయంకరమైన దంఢనను, న్యాయ తీర్పుగా తీసుకొని వచ్చును అను సంగతిని ఆనాడు యెరూషలేమునందుగల విశ్వాసులు అందరును తెలుసుకొనిరి.
పాత నిబంధనయందు ఫరో ఎదుట మోసే జరిగించిన పది అద్భుతములను న్యాయ తీర్పు యొక్క అద్భుతములే. అయినను ఫరో దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొనక, హృదయమును కఠిన పరుచుకొనినందున, గొప్ప సంహారము ఏర్పడెను. మోషే ద్వారా మేలుకరమైన అద్భుతములు కూడాను జరిగెను. న్యాయ తీర్పు యొక్క అద్భుతములు కూడాను జరిగెను.
మోషేకు విరోధముగా అతని యొక్క సహోదరియైన మిరియాము మాట్లాడినప్పుడు, వెనువెంటనే ఆమెకు కుష్టి రోగము కలిగెను. ఎంతటి భయంకరమైన న్యాయ తీర్పు! తన సహోదరునికి విరోధముగా మాట్లాడుటకు వారికి భయములేక పోయినందున, వారిని దేవుడు గద్దించెను (సంఖ్యా. 12:8-10).
అదేవిధముగా మోషేకు విరోధముగా ఎదిరించి నిలబడిన కోరాహు అను వానిని, అతనికి చెందిన వారందరిని కూడాను భూమి తన నోటిని తెరిచి మింగివేసెను. (సంఖ్యా. 16:28-32). నిన్ను ముట్టుచున్నవాడు నా కనుగుడ్డును ముట్టుచున్నాడు అని చెప్పిన ప్రభువు, మనకు విరోధముగా జనులు లేచుచున్నప్పుడు, న్యాయ తీర్పును తీసుకొని వచ్చుచున్నాడు. మీరు ప్రభువు యొక్క సేవకులుగా జీవించినట్లయితే, ప్రభువు మీ కొరకు వ్యాజ్యమాడి యుద్ధమును చేయును.
క్రొత్త నిబంధనయందు యేసుక్రీస్తు ఒక అంజూరపు చెట్టు వద్దకు ఫలమును వెతుకుచు వచ్చెను. ఆ అంజురపు చెట్టు అయితే ఆకులను మెండుగా చూపించనే గాని, ఫలములను ఫలించలేదు. దేవుని యొక్క న్యాయ తీర్పు ఆ అంజరపు చెట్టు పైకి వచ్చెను, అది వేరుతో సహా ఎండిపోయెను (మార్కు. 11:20,21).
తన యొక్క బిడ్డలను, కాపాడుటకును, తన బిడ్డలను ఘనపరచుట కొరకును, తన యొక్క పరిచర్యను నెరవేర్చు కొనుటకు మాత్రము గాక, అన్యజనుల మధ్యలో దేవునికి భయపడు భయము కలుగునట్లుగాను ప్రభువు ఈ రీతిగా న్యాయ తీర్పు యొక్క అద్భుతములను చేయుచున్నాడు.
నేటి ధ్యానమునకై: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు; న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వాని నాలికను నీవు నేరస్థాపన చేసెదవు; ఇది వారి స్వాస్థ్యము, ఇది యెహోవా యొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇదే యెహోవా వాక్కు” (యెషయా. 54:17).