No products in the cart.
ఆగస్టు 22 – “ప్రభువు వ్యాజ్యమాడును!”
“యెహోవా వారి పక్షమున వ్యాజ్యెమాడును, ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచుకొనును” (సామెతలు. 22:23).
నేడు లోకమే అన్యాయములోనికిని, దుర్మార్గములోనికిని మునిగియున్నది. ధనబలమును కలిగియున్న ధనికులు పేదవారిని అణగదొక్కుచున్నారు. అధికారులు లంచము పుచ్చుకొని నీతిని తిరగవేయుచున్నాడు. రాజకీయ నాయకులు అక్కడ ఇక్కడ తిరిగి అలయుచు విధవరాళ్ల యొక్క ఇంటిని కూడా భక్షించుచున్నారు. ఎటుచూచిన అన్యాయమును, ఎటుచూచిన అరాచకము!
అయితే దేవుని బిడ్డల యొక్క భద్రత ఏమిటి? నేను నీ కొరకు వ్యాజ్యమాడి, నీ కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడను అని ప్రభువు దిట్టముగా వాక్కునిచ్చి చెప్పుచున్నాడు. ఎట్టి ఇక్కటైన పరిస్థితులయందు మీరు ఉండినప్పటికిని, ప్రభువును తేరి చూడుడి, ఆయనకు మొరపెట్టుడి.
ప్రభువు నిశ్చయముగానే మీ యొక్క ప్రార్థనను ఆలకించుచున్నాడు. “యెహోవా భక్తిపరులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి.నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును” (కీర్తనలు. 4:3). అని దావీదు సాక్ష్యమిచ్చుచున్నాడే! అంత మాత్రమే గాక, ప్రార్థనను ఆలకించువాడు మీ కొరకు వ్యాజ్యము కూడాను చేయును.
ఆనాడు అరణ్యమునందు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేయుచున్నప్పుడు, తమలో ఉన్న వ్యాజ్యములను మోషే వద్దకు తీసుకొని వచ్చిరి. ఆ తరువాత ప్రజలు తమ వ్యాజ్యములను న్యాయాధిపతుల వద్దకు తీసుకుని వచ్చిరి. దాని తర్వాత ఇశ్రాయేలీలలో రాజులు ఏర్పడినప్పుడు, రాజులు అట్టి వ్యాజ్యములను విచారించి జ్ఞానముగా తీర్పు తీర్చిరి.
నేడు మనకు రాజాధిరాజుగును ప్రభువుల ప్రభువుగా ఉన్న మన ప్రియ ప్రభువే ఆయనే నీతి గల న్యాయాధిపతి. ఆయన వద్ద మన యొక్క వ్యాజ్యములను తీసుకొని వెళ్లుదుము గాక!
దావీదు రాజును సౌలు అన్యాయముగా తరుముచు వేటాడుటకు వెళ్ళినప్పుడు, దావీదు ఎవరి వద్దకు వెళ్లి న్యాయమును అడగగలడు? ఆయన సౌలును చూచి, “యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతిని విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక అనెను” (1. సమూ. 24:15). అలాగునే ప్రభువు దావీదు కొరకు వ్యాజ్యమాడెను.
“సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?” (ఆది.కా. 18:25). ఆయన సౌలునకును దావీదునకును మధ్య నిలబడి న్యాయము తీర్చును. సౌలు యొక్క రాజ్యభారమును తీసి దావిదు యొక్క వసమునకు అప్పగించెను.
చిన్న సమస్యయైనప్పటికిని, పెద్ద సమస్యయైనప్పటికిని దావీదు ఎల్లప్పుడును తనకు విరోధముగా ఉన్న వ్యాజ్యములన్నిటిని ప్రభువు వద్దనే తీసుకుని వెళ్ళుట అలవాటు. “యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడువారితో పోరాడుము” అని ప్రార్ధించెను (కీర్తనలు. 35:1).
దేవుని బిడ్డలారా, మీక యొక్క వ్యాజ్యము ఏదైనాప్పటికిని, మొదట దానిని ప్రభువు వద్దకు తీసుకుని వెల్లుడి. దేవుని యొక్క ఆలయమునకు వెళ్లి మీ యొక్క వ్యాజ్యమును ఆయన యొక్క పాదములయందు వివరించి మోరపెట్టుడి. ఆయన ఆ సంగతిని విచారించి వ్యాజ్యమాడును, నీతిని జరిగించును.
నేటి ధ్యానమునకై: “నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము” (కీర్తనలు. 119:154).