Appam, Appam - Telugu

ఆగస్టు 13 – ఆశ్రయించినప్పుడు విశ్రాంతి!

“మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితివిు, ఆశ్రయించినందున, ఆయన మన చుట్టును నెమ్మది(విశ్రాంతిని) కలుగజేసియున్నాడు”     (2. దిన. 14:7) 

రాజుల యొక్క కాలమునందు, ముఖ్యముగా సోలోమోను యొక్క కాలమునందును, యెహోషాపాతు యొక్క కాలమునందును, ఆశ యొక్క కాలమునందును  దేశము మంచి విశ్రాంతిని పొందుకొనెను. ఇశ్రాయేలు ప్రజలు ఆనందముతో జీవించిరి. నేడు ఆశారాజు యొక్క కాలమునందు ఏర్పడిన విశ్రాంతిని గూర్చి మనము ధ్యానించెదమా?

‘ఆశ’ అను మాటకు ‘వైద్యుడు’  అని అర్థము. ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఔషధము ‘యెహోవాను ఆశ్రయించుడి’ అనుటయైయున్నది. ఆ మాట చొప్పున వారు ప్రభువును ఆశ్రయించినప్పుడు ప్రభువు వారికి విశ్రాంతిని దయచేసెను. ఆ విశ్రాంతియందు వారు సొమ్మస్లిపోయి నిద్రించుచు ఉండలేదు.  అట్టి దినములను సద్వినియోగము పరచుకొని వాడుకొనిరి.

రాజైన ఆశ ప్రజలను చూచి:   “మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితివిు, ఆశ్ర యించినందున, ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసియున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగ వచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగావారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి”     (2. దిన. 14:7).

సోలోమోను రాజు తన కాలమునందు, ప్రభువును బహు అత్యధికముగా ఆశ్రయించెను. దేశము విశ్రాంతి చెంది నెమ్మదిగా ఉన్న కాలమునందు ఆయన, ప్రభువు కొరకు మహిమగల ఆలయమును కట్టించెను.    “నేను ఆరాధించుచున్న నా దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయనకు నేను కట్టుచున్న ఆలయము గొప్పగా ఉండును” అని చెప్పెను.

మీరు ప్రభువును ఆశ్రయించుచున్నప్పుడు ఆయన మీకు విశ్రాంతిని దయచేయును. అట్టి విశ్రాంతి దినములను సద్వినియోగము పరచుకొనుచు ప్రభువు యొక్క పాదములయందు కూర్చుండి, మీ యొక్క ఆత్మీయ జీవితమును ఆలయముగా నిర్మించుకొనుడి. ఉపవాసముండి, ప్రార్ధించి, ఆత్మ వరములను పొందుకొనుడి. ప్రభువునకు పూర్ణ బలముతో పరిచర్యను చేయుడి. యేసు చెప్పెను:    “పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు”     (యోహాను. 9:4).

నేడు దేశమునందు సువార్త యొక్క గుమ్మములు తెరవబడియున్నది. కృప యొక్క గుమ్మములు మిమ్ములను ఆహ్వానించుచున్నది. ప్రభువు, దేవుని ప్రజలకు విశ్రాంతిని ఇచ్చియున్నాడు. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది:   ‌ ” దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసుకొనుడి”     (ఎఫెసీ. 5:15). ప్రభువును పూర్ణ హృదయముతో ఆశ్రయించుడి మరోవైపున ప్రభువును పూర్ణ బలముతో ప్రేమించి, పరిచర్యను చేయుడి.

అనేకమంది క్రైస్తవులు సమస్యలను ఎదుర్కొను చున్నప్పుడు మాత్రమే ప్రభువును ఆశ్రయించుచున్నారు. శాంతిని కోల్పోయి కొట్టుమిట్టు లాడుచున్నప్పుడు,    ‘ప్రభువు ఎక్కడికి వెళ్ళెను?  ఎందుకని నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు? ఎందుకని నన్ను మర్చిపోయాడు?  అని అంతా చెప్పుకొనుచు కలత చెందుచున్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఆయన యొక్క బిడ్డలైనట్లయితే, ఎల్లప్పుడును ఆయన యొక్క ముఖమును వెదుకుచు, ఆయన యొక్క  సముఖమునందు ఆనందింపవలెను.

నేటి ధ్యానమునకై: 📖”యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి; ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి”     (కీర్తనలు 105:4).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.