No products in the cart.
ఆగస్టు 08 – నేర్చుకొనుట వలన విశ్రాంతి!
“మీమీద నా కాడి ఎత్తికొని, నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును” (మత్తయి. 11.29)
విశ్రాంతి యొక్క నాల్గవ మార్గము, నేర్చుకొనుటయైయున్నది. క్రీస్తు యొక్క కాడిని మీ ప్రాణము మీద మోపుకొనుచున్నప్పుడు, ఆయన దైవీక విశ్రాంతిని మీకు దయచేయును. సరే, కాడి అనగానేమి? పైరు పండించు దినములయందు చేనును దున్నుటకు గాని, లేక బండి లాగుటకు గాని, ఎడ్లను కలిగియున్నవారు, రెండు ఎడ్లను ఒకటిగా జతపరచుటకై, వాటి మెడలపై మోపి వాడేటువంటి గుండ్రని పొడవాటి కల్పకర్ర గాడి అని పిలువబడుచున్నది.
ఒకే రకమైన ఎత్తు, సమానమైన బలమును, ఒకే వయస్సు గల రెండు ఎడ్లను దానికి జతగా కట్టబడవలెను. అప్పుడే ఆ ఎడ్ల బండి సరిగాను, చక్కగాను పరిగెత్తును. అపో. పౌలు, “మీరు (అన్యుల కాడియందు) అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి; నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?” అని చెప్పెను (2. కోరింథీ. 6:14,15).
వివాహ విషయములయందును, వ్యాపార అంశములయందును రక్షింపబడని ఒక వ్యక్తితో జతపరచబడుచున్నప్పుడు, అది నెమ్మదిని శాశ్వతముగా కోల్పోవునట్లు చేయును. మనస్సునందుగల సమాధానము తీసివేయును. ప్రారంభమునందు చక్కగా ఉండినను, ముగింపునందు మహావేదనగా ఉండును. కావున, లోక ప్రకారమైన మేళులను కాంక్షించి, దేవుని బిడ్డలు, ఎన్నడును అన్యుల కాడియందు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు.
ఒకానొక కాలమునందు మనము పాపపు బానిసత్వమునందు ఆలమటించబడ్డాము. సాతాను యొక్క కాడి మన ప్రాణముపై బహు భయంకరముగా మోపబడి ఉండెను. ప్రభువు తట్టు తేరి చూచినప్పుడు, “సెన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీకున్న కాడి నీ మేడమీద నుండకుండ ఆ దినమున నేను దాని విరిచి, నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతి వారిచేత దాస్యము చేయించు కొనరు” (యిర్మియా. 30:8) అని ఆయన వాగ్దానము చేసెను. ప్రభువు తట్టు తేరి చూడనందున, నేడు సాతానుడు అనేక యవనస్థులను చెడు అలవాట్లకు గురిచేసి మోసకరమైన మార్గమునందు నడిపించుచున్నాడు.
యేసు క్రీస్తుని వద్దకు మీరు వచ్చుచున్నప్పుడు, ఆయన యొక్క కాడిని మీపై ఎత్తుకొని ఆయన వద్ద నేర్చుకొనవలెను. “నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నది” అని ప్రభువు చెప్పుచున్నాడు. అట్టి కాడిని ఎత్తు కొనుచున్నప్పుడు, మీ యొక్క ప్రాణమునకు విశ్రాంతి లభించును.
కాడి మ్రానునకు ఒకవైపున యేసును, మరోవైపున మీరును ఆయనతో జతపరచబడియున్నారు. మీరు అలాగున యేసుతో పాటు జతపరచబడినవారై నడుచుకొనుచున్నారా? బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు; ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు” (1. యోహాను. 2:6). దేవుని బిడ్డలారా, మీరు ఆయనతో జత పరచబడుచున్నప్పుడు, భారమైనదేదీయు మీపై ఆయన మోపడు. ఆయన వద్ద నేర్చుకుని, ఆయనతో ఐక్యపరచబడి జీవితమును నడిపించుటయు, ఆయనతో ఏకమై పరిచర్యను చేయుటయు మీకు ధన్యకరమైనదిగా అమర్చబడును.
నేటి ధ్యానమునకై: “నేను వారి కాడికట్లను తెంపి, వారిని దాసులుగా చేసినవారి చేతిలో నుండి వారిని విడిపింపగా, నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు” (యెహేజ్కేలు. 34:27).