No products in the cart.
ఆగస్టు 01 – కాచునట్లు
“దేవుడైన యెహోవా నరుని తీసికొని, ఏదెను తోటను సేద్యపరచుటకును, దాని కాచుటకును దానిలో ఉంచెను” (ఆది.2:15)
ఆది మానవుని ప్రభువు తన యొక్క స్వారూప్యమందును పోలికయందును రూపించి, తనకి ఏలుబడియును, అధికారమును ఇచ్చేను. వాటిని అతడు కాపాడుకొనుటకు వీలు కలిగునట్లు అతనిని ఏధేనునందు నివసింపజేసెను.
మీరు కూడాను దేవుడు దయచేసిన అమూల్యమైన రక్షణను కాపాడుకొనవలెను. గొప్ప ఔన్నత్యము గల అభిషేకమును కాపాడుకొనవలెను. ఆయన యొక్క పిలుపునకును, ఏర్పాటునకును పాత్రులైన వారిగా నడుచుకొనవలెను. అవును, ఏలుబడియును, అధికారమును కాచుకొనుట మిగుల అవస్యమైయున్నది.
అయితే, ఆదిమానవుడు దానిని కాచుకొనక, సాతానునకు చోటును ఇచ్చెను. దేవుడు తినకూడదని చెప్పిన వృక్షఫలమును తిని, సర్పమునకు లోబడుటయే ఏర్పరచుకొనెను. అందుచేతనే తన యొక్క ఏలుబడిని ప్రభువునకు శత్రువైయున్న సాతానునకు అమ్మివేసెను.
మానవుడు దేవుని యొక్క కృపలో నుండి తొలగి పాపములోనికిను, బానిసత్వములోనికిను, శాపములోనికిను, మరణములోనికిను పడిపోయెను. రోగములును, వ్యాధులును అతనిని పట్టుకొనెను. పాపములచే మానవుని యొక్క జీవితము మూడు విధములుగా పాడైపోయెను. మొదటిగా మానవుని యొక్క శరీరము చెడిపోయెను. రెండోవదిగా పాపమనేది ప్రాణమును మలినపరిచినది. మూడోవదిగా దేవునితో గల సహవాసమును మనుష్యుని యొక్క ఆత్మ కోల్పోయెను. అన్నిటికంటే పైగా అతడు తన ఏలుబడిని, అధికారమును కోల్పోయెను. శత్రువు యొక్క వలలో తన యొక్క తలను చేతులను ఇచ్చి కొట్టబడియుండెను.
మొదటిగా ఆదాము ఏలుబడి చేయుటకై రూపించబడెను. అతడు ఘనత చేతను, మహిమ చేతను, కిరీటము ధరింపజేయ బడినవాడు. అయితే పాపము చేసినప్పుడు, శాపమునకు లోనైపోయెను. ఆదాము ద్వారా లోకమంతయును బానిసత్వమునకు గురైపోయెను. “లోకమంతయును దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము” (1. మహాను.5: 19) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. అయితే ప్రభువు అట్టి స్థితియందు మానవుని విడిచిపెట్టుటకు కోరుకొనుటలేదు. అతనిని లేవనెత్తుటకు సంకల్పించెను. శత్రువు యొక్క శిరస్సును చితకగొట్టుటకు ఒక విమోచకునిని ఇచ్చుటకు వాగ్దానము చేసెను.
ప్రభువు సెలవిచ్చుచున్నాడు, “నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. ఆయన నిన్ను తలమీద కొట్టును; నీవు ఆయన మడిమె మీద కొట్టుదువని చెప్పెను” (ఆది .3:15). పడిపోయిన మానవునిని ప్రభువు ఇంకను ప్రేమించుచున్నాడు. అట్టి ప్రేమకు సాదృశ్యముగా తన యొక్క ఏకైక కుమారుని ఇచ్చుటకు సంకల్పించెను. ఏదేనునందు ఆదాము దేనిని కోల్పోయెనో దానిని యేసు కల్వరియందు విమోచించి ఇచ్చుటకు సంకల్పించెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు మీకు ఇచ్చియున్న ఏలుబడియు అధికారమును అమూల్యమైనవి. అత్యున్నతమైనవి. వాటిని మీ జీవితమునందు కాచుకొనుటలో జాగ్రత్తకలిగి ఉండుడి.
నేటి ధ్యానమునకై: “మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసిన తండ్రిని స్తోత్రించెదము” (కొలస్సీ.1:13).