Appam, Appam - Telugu

ఆగస్టు 01 – ఉదయకాలమున!

“నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును” (కీర్తనలు. 139:18).

క్రీస్తు మనలో నివాసముండినట్లయితే నిశ్చయముగానే ప్రతి ఒక్క దినమును ప్రభువు యొక్క ప్రసన్నతలో ఉత్సాహముగా మనము కొనసాగించగలము. “నేను మీతో కూడా ఉండెదను” అని ప్రభువు తన యొక్క ప్రసన్నతను మనకు వాగ్దానము చేసియున్నాడు కదా?

లేఖన గ్రంథమునందు పలు వాగ్దానములు మనకు ఉండినప్పటికిని, దేవుని యొక్క ప్రసన్నతను గూర్చి పలు ప్రసంగములను విని ఉండినప్పటికిని, మన యొక్క జీవితములో ఎందుకో పలు సమయములయందు ఆయన మనతో ఉండుటను మనము గ్రహించలేక పోవుచున్నాము. విరక్తిని, ఒంటరితనమును మనలను ఆవరించు కొనియున్నది. మనుష్యుల వలనను, దేవుని వలనను చెయ్యి విడవబడినట్లుగా భావించుచున్నాము.

దైవ ప్రసన్నతను ఎల్లప్పుడును మనతో కాపాడుకొనుటకు ఉదయకాల సమయమునందు లేచున్నప్పుడు ప్రభువు యొక్క ప్రసన్నత యొక్క కాంక్షతో లేవవలెను అనుటియే మొదటి ఆలోచన. ప్రభువును ఘనపరచి మీ యొక్క నూతన దినము యొక్క మొదటి భాగమును ఆయనకు ఇవ్వుడి.

ఉదయకాలమున ఆయన యొక్క ప్రసన్నతను వెతికి, వాంచించి, ఆయన యొక్క మహిమ చేత నింపబడినట్లయితే, ఆ దినము అంతయును ప్రభువు మీతో కూడా ఉండుటను గ్రహించెదరు. ఆ దినము యొక్క సమస్త పోరాటములను, సమస్యలను ఎదుర్కొనుటకు కావలసిన దైవ బలమును పొందుకొందురు.

ఉదయకాలమున లేచున్నప్పుడే, “ఇది ప్రభువు కలుగజేసిన దినము ఇందులో ఉత్సహించి ఆనందించెదము” అని ఉత్సాహముతో చెప్పుడి. ప్రభువును మహిమ పరచుటయును, దైవ ప్రసన్నతతో గొప్ప కార్యములు చేయుటకును, ప్రభువు దయచేసియున్న అవకాశముల కొరకు ఆయనను స్తుతించుడి.

ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను; ఉదయకాలమున నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు” (సామెత. 8:17). “నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి యొక్క నిధులను నేను నింపునట్లుగా, వారిని నీతిమార్గమునందును, న్యాయ మార్గములయందును నేను నడిపించెదను.” (సామెత. 8:21,20).

ఒకసారి నేను ఏకాంతమునందుండి ప్రార్థించుట కొరకు తిరుపత్తూరునకు వెళ్లియున్నాను. అక్కడ తెల్లవారుతున్న సమయమునందు నా గదికి బయట విస్తారమైన పిచ్చుకల యొక్క శబ్దమును విని మెల్లగా తలుపును తెరచి చూసాను. నా గదికి బయట ఒక దీపము వెలుగుచున్నందున రాత్రియందు విస్తారమైన పురుగులు వచ్చి పడియుండెను. దానిని చూచిన పిచ్చుకలు ఆనందముగా శబ్దము చేయుచునే వాటిని తినుచుండెను. అవి వాటిని తిని వెళ్లిపోయిన తర్వాత, కొంత సమయమునకు మరికొన్ని పిచ్చుకలు వచ్చెను. ఆ పిచ్చుకలకైతే మరి ఎట్టి ఆహారమును దొరకలేదు. ఆలస్యముగా వచ్చినందున వాటికి ఆహారము దొరకకపోవుటను అవి చూచి పరితపించెను.

ఇశ్రాయేలు ప్రజల కొరకు మన్నాను కురిపించిన ప్రభువు, వాటిని ఉదయకాలమనే సమకూర్చు కొనవలెను అని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఉదయకాలమున లేచి మన్నాను సమకూర్చు కొనువారు మాత్రమే దేవుని యొక్క ప్రసన్నతను గ్రహించి ఆనందించగలరు.

నేటి ధ్యానమునకై: “యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును; ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి, కాచుకొనియుందును” (కీర్తనలు. 5:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.

Login

Register

terms & conditions