bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

అక్టోబర్ 09 – పరిపూర్ణమైన జీవము!

“జీవము కలుగుటకును అది (సమృధ్ధిగా) పరిపూర్ణముగా కలుగుటకును నేను వచ్చితిని”     (యోహాను. 10:10

మన దేవుడు అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు  (అపో. 17:25). ఊపిరి లేకుంటే మనము జీవముతో ఉండలేము. ప్రభువు మనిష్యుని సృష్టించినప్పుడు, అతనిని నేలమట్టిచేత రూపించి జీవవాయువును అతని నాసికా రంద్రమునందు ఊదెను. మనుష్యుడు జీవాత్ముడాయెను (ఆది. 2:7).

అలాగున, ఒక దినమునందు పాపము మనిష్యుని యొక్క జీవితమునందు తారసపడెను. పాపము ఎంత ఘోరమైనది! దాని యొక్క ప్రతిఫలము ఎంత భయానకమైనది! పాపము యొక్క జీతము మరణము అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది. పాపమునకు మూలకారకుడైన సాతానుడు హంతకుడైయున్నాడు. అతడు దొంగిలించుటకును, హత్య చేయుటకును,నాశనము చేయుటకును వచ్చును గాని మరిదేనికిని రాడు.

ఒక భర్త, తన భార్య తనకు ద్రోహము చేయుటను చూచిన్నప్పుడు, కోపము చేత తన భార్య యొక్క ముఖముపై భయంకరమైన యాసిడ్ను వేసి కొట్టెను. ఆమెకు ముఖము పూర్తిగా కాలిపోయెను. ఆ క్షణమునందే, ఆమె తన కనుచూపును కోల్పోయినదై విలవిలలాడి పోయెను. ఇరుగు పొరుగువారు ఆమెను వైద్యశాలలో చేర్పించిరి. ఆమె ప్రాణాలతో కాపాడబడినను ఆమె యొక్క ముఖము వికృతరూపమై, వికారమాయెను.

పాపము కూడా మనుష్యుని యొక్క జీవితమునందు దానినే చేయుచున్నది. దేవుని యొక్క స్వారూప్యమును, దేవుని యొక్క మహిమను మనుష్యుడు కోల్పోయెను. దేవునితో గల సహవాసమును కోల్పోయెను. అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అనుబంధ బాంధవ్యములు కోల్పోయెను.  ప్రభువు ఇచ్చియున్న అధికారమును, ఏలుబడిని కోల్పోయెను. దైవీక గుణాతిశయమును, స్వభావమును కోల్పోయెను. పాపియైయున్న మనుష్యుడ్ణి విమోచించుటకై యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను.

మరణముతో పోరాడుచున్న ఒక వ్యాధిగ్రస్తుణ్ణి వైద్యశాలయందు చేర్పించిన్నప్పుడు, వైద్యులు యొక్క మొట్టమొదటి ప్రయత్నము అతనిని ఎలాగైనను మరణము నుండి కాపాడవలెను  అనుటయైయుండును. ఆ తరువాత అతడు మంచి సౌఖ్యమును పొంది, మంచి ఆరోగ్యమును పొందునట్లు చేయుదురు. మొట్టమొదటిగా అతనికి విడుదల కావలెను. ఆ తరువాత, అతడు బలముగలవాడిగా మారవలెను.

యేసు క్రీస్తు తనయొక్క జీవమును  అర్పించి అపరాధముల యందును, పాపముల యందును  మృతులైయున్న మనలను జీవింపజేసేను. దాని తరువాత మనలను కూడా ఆయన వలె మార్చి, పరిపూర్ణతయందు నడిపించుటకు సంకల్పించెను.  అదియే    ‘జీవము కలుగుటకును, పరిపూర్ణముగా కలుగుటకును’  అని దానియొక్క అర్థము.

మీరు నిత్యజీవమును మాత్రము గాక, పరిపూర్ణమైన జీవమును పొందుకొనవలెను. అప్పుడే ఆయన యొక్క రాకడయందు క్రీస్తు యొక్క స్వారూప్యమునకు సమరూపముగా రూపాంతరము చెందుదురు. దానినే మనము విడుదల యొక్క సువార్త అనియు, మహిమగల సువార్త అనియు పిలచుచున్నాము. ఐగుప్తునుండి విడిపించబడుట మొదటి మెట్టు, పాలు తేనె ప్రవహించుచున్న కనానును స్వతంత్రించుకొనుట ఆ తరువాతి మెట్టు.

దేవుని బిడ్డలారా, మీరు బలమునుండి అత్యధిక బలమును పొంది,  మహిమ నుండి అత్యధిక మహిమను పొందుకొనవలెను

నేటి ధ్యానమునకై: “ప్రతి మనుష్యుని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్టవలెనని, సమస్త విధములైన జ్ఞానముతోను మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము”     (కొలస్సీ. 1:28).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.