bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam - Telugu

అక్టోబరు 28 – జెరుబ్బాబెలు!

“జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను” (జెకర్యా. 4:6).

నేడు మనము సంధించబోవుచున్న దైవజనుని యొక్క పేరు జెరుబ్బాబెలు యైయున్నది. జెరుబ్బాబెలు అను మాటకు బబులోను యొక్క చిగురు అని అర్థమునైయున్నది. చెరయందు బబులోనకు వెళ్లిన తల్లిదండ్రులకు కుమారుడుగా, అక్కడ పుట్టినందున ఈ పేరును అతనికి పెట్టి ఉండవచ్చును.

అయితే, ఆయన ప్రభువు కొరకును, యెరూషలేము కొరకును భక్తివైరాగ్యమును కలిగియున్నవాడు. జెరుబ్బాబెలును, యాజకుడైన యెహోషువాయు, బబులోను నుండి యెరూషలేమునకు జనులను నడిపించుకొని వచ్చినవారు. యెరూషలేమునందు ఒక బలిపీఠమును కట్టి బలిని అర్పించారు.

తరువాత, జెరుబ్బాబెలు యొక్క చేతులు కూలిపోయి పడిపోయియున్న ఆలయమును మరల కట్టునట్లు పునాధి వేసేను. మొదటి ఆలయమును కట్టినది సొలోమోను. ఈ ఆలయము అదే స్థలమునందు రెండవసారి కట్టబడునట్లు పునాధి వేయబడెను. సొలోమోను గొప్ప రాజయైనందున, ఆలయమును సులువుగా కట్టుటకు ఆయనకు సాధ్యమాయెను.

ఆలయమునకు కావలసిన సమస్త పనుముట్లను, దావీదు సమకూర్చి పెట్టియుండెను. జనులు ఉత్సాహముగా ఇచ్చిరి. చుట్టుపక్కల రాజ్యాల రాజులును సహాయ హస్తములను చాపిరి. అయితే, ఇట్టి అనుకూలతలు ఒకటియు జెరుబ్బాబెలునకు లేకుండెను.

జెరుబ్బాబెలు యొక్క దినములయందు అత్యధిక శాతమైన యూదులు బబులోనునందుగల చెరలో చిక్కబడి ఉండెను. చెర నుండి వచ్చిన వారిలోను సరియైన ఉద్యోగము లేకుండెను. దేవుని పని కొరకు భయంకరమైన వ్యతిరేకతలు అన్ని వైపుల నుండియు లేచెను. ఆటంకములును, పోరాటములును జెరుబ్బాబెలు యొక్క మనస్సును సోమ్మసిల్లునట్లు చేసేను. పరిశుద్ధాత్మునియందు ఆనుకొని ఉండుటయే ప్రభువు ఇచ్చిన ఆలోచనయైయున్నది.

నేడు ఆలయము అని చెప్పబడుట, చేతులతో కట్టబడుట కాదు. ఒక విశ్వాసి యొక్క హృదయమే ప్రభువు నివసించు ఆలయముగా ఉన్నది. “మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?” (1. కోరింథీ. 3:16).

మీయొక్క ఆత్మీయ జీవితము భవనముగాను, మందిరముగాను, ప్రభువు యొక్క నివాస స్థలముగాను కట్టి లేవనెత్త బడుతున్నప్పుడు, నిశ్చయముగానే పలు వ్యతిరేకతలలును, ఆటంకములును, పోరాటములును సంధించ వలసినదై యుండును. పరిశుద్ధముగా జీవింపకుండునట్లు లోకమును, శరీరమును, సాతానును మీతో పోరాడుచూనే ఉండును. సాతాను కూడాను శోధనలపై శోధనలను తీసుకొని వచ్చును. అటువంటి సమయములయందు, పరిశుద్ధాత్మునిపై ఆనుకొనుడి. ఆత్మవలన సమస్తమును సాధ్యమే.

దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు బలమైన పరాక్రమముగల శాలిగా, మీకు తోడుగా నిలబడి జయమును అనుగ్రహించును.

నేటి ధ్యానమునకై: “అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు” (రోమీ. 8:26).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.