bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

అక్టోబరు 27 – దానియేలు!

“దానియేలు యొక్క కార్యము వర్థిల్లెను” (దానియేలు. 6:28).

నేడు మనము అత్యధికముగా దైవ జ్ఞానమును కలిగినవాడను, సమర్ధతగలవాడును, మొక్కుబడి చేసుకొనినవాడును, శక్తిగల ప్రవక్తయైన ఒకరిని సంధించబోవుచున్నాము; ఆయనే దానియేలు. దానియేలునకు ప్రభువు శ్రేష్టమైన జ్ఞానమును కృపను అనుగ్రహించి యుండెను. బాబులోను దేశము నందుగల సమస్త జ్ఞానులకంటెను, దానియేలు పది రెట్లు సమర్ధుడై ఉండెను అని బైబిలు గ్రంథమునందు చదువుచున్నాము.

దానియేలు ఇంతగా గొప్ప ఔన్నత్యమును పొందుకొనుటకు గల కారణము? ప్రభువు కొరకు పరిశుద్ధముగా జీవించునట్లు ఆయన కలిగియున్న తీర్మానమే. బబులోను దేశములోనికి వెళ్ళుచున్నప్పుడే, అపవిత్ర పరచుకొనక, పరిశుద్ధముగా కాపాడుకొనుటకు దానియేలు దృఢ మనస్సుతో ఉండెను. రాజు భుజించు భోజనమును, ఆయన పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదు అని, తన హృదయమునందు తీర్మానించుకొనెను. తనను అపవిత్రపరచు కొనకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడుకొనెను (దానియేలు.1: 8).

ఒక్క దినమున రాజైన నెబుకద్నెజరు, ఒక కలను చూచి కలవరపడెను. ఆయన శకునగాండ్రులను, గారడీవిద్యగలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువ నంపించి, తాను చూచిన కలను, దాని భావమును వారు చెప్పవలెనని ఆజ్ఞాపించెను. “మీరు తెలియజేయని యెడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు; మీ యిండ్లు పెంటకుప్పగా చేయబడును” అను ఆజ్ఞను జారీచేసెను.

దానియేలు రాజు వద్దకు వెళ్లి, తనకు గడువు ఇచ్చిన యెడల, కలను దాని భావమును తెలియజేయుదును అని చెప్పెను. అలాగునే దానియేలు ప్రార్ధించినప్పుడు, ప్రభువు ఆయనకు మరుగైన సంగతులను బయలు పరిచియిచ్చెను.

ప్రభువు మరుగైన సంగతులను బయలుపరచి ఇచ్చువాడు. ఆత్మీయ వరములలో ఒక వరము బుద్ధి వాక్యమును గ్రహింపచేయు వరము. ఒక వ్యక్తిని గూర్చి గాని, ఒక పరిస్థితిని గూర్చి గాని, ఒక స్థలమును గూర్చి గాని, ఒక సమస్యను గూర్చి గాని ప్రభువు మీకు మరుగైన సంగతిని బయలుపరచి ఇచ్చుట చేత, దేవుని యొక్క బుద్ధిలోని ఒక భాగమును పొందుకొందురు. ఇలాగునే ప్రభువు అపో. యోహానునకు పద్మాసు ద్వీపమునందు, ఇక రానున్న సంగతులను గూర్చి బయలుపరచి ఇచ్చుటకు తీర్మానించెను.

దానియేలు యొక్క తీర్మానము మన యొక్క అంతరంగమును ఆకర్షించుచున్నది. రాజగు దర్యావేషు, తనయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను, మానవుని యొద్దనైనను ఎవడైనను మనవి చేసినయెడల, వాడు సింహముల గుహలో పడద్రోయ బడవలెను. అను శాసనము ఒకటి పుట్టించినప్పటికిని, అయితే దానియేలు, ప్రభువును ప్రేమించినందున తాను యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని దేవునికి ప్రార్థనచేయుచు, ఆయనను స్తుతించుచువచ్చెను (దానియేలు. 6:10).

ఏమి సంభవించినను సరే, ప్రభువును సేవించుట నిలిపివేయను. మనుష్యుణ్ణి సేవింపను అని దానియేలు తీర్మానించినందున, ఆయనను బంధించి సింహాల గృహలో పడవేసిరి. అయితే దేవుడు తన యొక్క దూతను పంపించి సింహముల యొక్క నోటిని మూసివేసి దానియేలును కాపాడెను, బబులోనునందు హెచ్చించెను. (దానియేలు. 6:22).

దేవుని బిడ్డలారా, మీరు ప్రభువు కొరకు వైరాగ్యముగా నిలబడుచున్నప్పుడు, నిశ్చయముగానే ఆయన మీ పక్షమునందు నిలబడును.

నేటి ధ్యానమునకై: “బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు” (దానియేలు. 12:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.