Appam, Appam - Telugu

అక్టోబరు 09 – తెలియజేయబడని గుణవతియైన స్త్రీ!

“గుణవతియైన (భార్య దొరుకుట) స్త్రీని కనుగొనుట అరుదు; అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది”    (సామెతలు. 31:10).

అత్యధికముగా అన్ని వివాహపు వైభవములయందును గుణవతియైన స్త్రీని గూర్చి మాట్లాడుదురు. భార్య గుణవతియైన స్త్రీగా ఉండవలెను. అను సంగతిని గూర్చి సామెతలు. 31 ‘వ అధ్యాయములో నుండి ఆలోచనలను ఎదుట పెట్టుదురు.

అయినప్పటికీ, గుణవతియైన స్త్రీని కనుగొనుట మిగుల అరుదైయున్నది. ఏడువందల భార్యలను, మూడువందల ఉపపత్నులను కలిగియున్న సొలోమోను,   “వెయ్యిమంది పురుషులలో నేనొకని చూచితిని; గాని అంతమంది స్త్రీలలో ఒక్కెతెను చూడలేదు”     (ప్రసంగి. 7:28)  అని చెప్పెను.

గుణవతియైన స్త్రీ ఇంటిని కట్టుచున్నదిగాను, ఇంటిని పరామర్శించు చున్నదిగాను ఉండును. చీకటితోనే లేచి, తన ఇంటి వారి కొరకు ఆహారమును సిద్ధము చేయుచున్నది.   “పనివారు చూచుకొందురులే” అని ఆమె ఉండిపోవుటలేదు. ఇంటనున్నవారి అందరిని గూర్చి అక్కరతో, భద్రతను కల్పించుచున్నది. శీతాకాలపు అవసరతకై, ఉన్ని వస్త్రములను కలిగియున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తపు కోటలో కుటుంబమునందు గల వారందరినీ తీసుకొని రావలసినది ఆమె యొక్క బాధ్యతయైయున్నది.

ఇంటి పనులన్నిటిని ఇష్టము వచ్చినట్లు చూచి చూడనట్లు కాక, ప్రతి ఒక్క అంశమును అక్కరతోను, శ్రద్దతోను కనిపెట్టుచున్నది. అనేక కుటుంబములయందు భార్య వద్ద మీ యొక్క భర్త ఎక్కడ అని అడిగినట్లయితే, తెలియదు అని చెప్పుదురు. పిల్లలను గూర్చి విచారించినట్లైతే ఎక్కడకైనా తమ స్నేహితుల యొక్క ఇంటికి పోయియుందురు అని బాధ్యతా రహితముగా ఉండక జవాబును చెప్పుదురు. భార్య అనునది అలాగున ఉండినట్లయితే ఆమె యొక్క కుటుంబము ఎలాగుండును? గుణవతియైన స్త్రీ కుటుంబమును మంచి మార్గమునందు నడిపించును.

గుణవతియైన స్త్రీ తన నోరును జ్ఞానమును తెలియజేయుటకు తెరచును. శిరస్సునందు గల బోధలన్నియు ఆమె నాలుకపైయున్నది. గొప్పలు చెప్పు నోరును, కొండములు చెప్పు నాలుకను ఆమెకు ఉండుట లేదు. ఆమె తాను పొందుకొనిన ఆశీర్వాదములను తన వద్ద మాత్రము ఉంచుకొనక, దీనులైన వారికి తన గుప్పిళ్లను విప్పి తన ప్రేమ గల హస్తములను చాపుచున్నది. తన యొక్క భర్త ఒక బాధ్యతగల మనుష్యునిగా ఉండునట్లు పూర్తి సహకారమును అందించుచున్నది.

‘వెయ్యి మందిలో ఒక పురుషుని చూచితిని’ అని చెప్పెను సొలోమోను జ్ఞాని. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన వెయ్యిమందిలోను పదివేలమందిలోను అతి శ్రేష్ఠుడు. గుణవతియైన స్త్రీయే, క్రీస్తు యొక్క సంఘమైయున్న వధువు.    “మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము, (ఆయన యొక్క మాంసమునకును, ఆయన యొక్క ఎముకలకును సంబంధించిన వారమైయున్నాము). ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు, సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను”    (ఎఫెసీ. 5:30,32).

ఒకవేళ గుణవతియైన స్త్రీ యొక్క అన్ని గుణములును  ఉన్నట్టుగా మీయందు కనబడకపోయినను, మరికొన్ని గుణాతిశయములైనను పొందుకొనుటకు కచ్చితముగా ప్రయత్నము చేయవలెను.

దేవుని బిడ్డలారా, సీతాకోకచిలుక తన ప్రారంభ జీవితమునందు పలు మార్పులను సంధించి, చివరకు అందముగా రెక్కలాడించుచు ఎగురుచున్నట్లు, మనము కూడా కావలసిన మార్పులను పొందుకున్నవారై ప్రాణ ప్రియుడైయున్న యేసును తేరి చూచి రెక్కలు చాపి ఎగిరుచు, మధ్యాకాశములోని ఆయనను సంధించెదము

నేటి ధ్యానమునకై: “అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును”     (సామెతలు. 31:30).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.