Appam, Appam - Telugu

సెప్టెంబర్ 30 – ఉపయోగకరమైన పాత్ర!.

“ఎవడైనను …. తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల, వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయైయుండును”    (2. తిమోతికి. 2:21).

మీరు ఉపయోగకరమైన ఒక పాత్ర. చిన్న గరటియైయినను అది యజమానునికి ఉపయోగకరమైనదిగా ఉండవలెను. పెద్ద కుండయైయినను అది యజమానునికి ఉపయోగకరమైనదిగా ఉండవలెను. ప్రభువు మిమ్ములను ఎటువంటి పాత్రగానైనను, ఎట్టి స్థితియందు ఉంచినను, ఒకటి మాత్రమే మర్చిపోకుడి. మీరు ఏదో ఒక విధములో మిమ్ములను సృష్టించిన యజమానునికి ఉపయోగకరమైన పాత్రగా ఉండవలెను.

వంటకై ఉంచబడిన పాత్రలలో చిన్న బెజము పడియుండినట్లయితే, దానిని ఉపయోగించలేము. పోయిని తడిపి నిప్పును ఆర్పివేయును. అటువంటి పాత్రను ఉపయోగించక ఒక పక్కనపెట్టి ఉంచేదరు. ఇలాగున గొప్ప ఔన్నత్యమును కోల్పోయినవారై ప్రక్కన పెట్టబడియున్న పరిశుద్ధులు అనేకులు కలరు.

ఒక క్రైస్తవ అధికారి, ఒక దినమున రైలు నిలయము మార్గముగుండా నడిచి వచ్చినప్పుడు, ప్రక్కకు పెట్టబడియున్న పనికిరాని పాత రైలుపెట్టెలను చూచెను. అవి విరిగిపోయినవి గాను, నలిగిపోయినవి గాను, దేనికి పనికిరానిదిగాను నిలబడియుండెను. ప్రభువు దానిని చూపించి ఆయన యొక్క అంతరంగమునందు మాట్లాడెను. ఒక కాలమునందు ఆ పెట్టెలు అన్నియు పట్టాలపై బహు చక్కగా పరిగెత్తుకొనుచు ఉండెను.

అయితే అవి శుద్ధీకరించబడక పాత గిల్లిపోయినందున, నేడు ఒక ప్రక్కకు వేయబడియున్నది.  ‘కుమారుడా, నీవు నా కొరకు చివరి వరకును పరిగెత్తుచూనే ఉండవలెను. విరామము లేకుండా పనిచేయుచూనే ఉండవలెను. నాకు సాక్షిగా నిలిచియుండవలెను’ అని గ్రహింపజేసెను. అవును, తుప్పు పట్టుట కంటే అరిగిపోవుట మంచిది.

మీరు పెద్దవారై ఉండినప్పటికిని, చిన్నవారై ఉండినప్పటికిని, యజమానునికి ఉపయోగపడు పాత్రగా ఉండవలెను. సిరియా దేశము యొక్క సైన్యాధిపతియైన నయమానును ప్రభువులోనికి నడిపించినది ఒక బాలీకయైన చిన్నదియే.  ఆమె ఒక బానిసయైన చిన్నది. అయినను నయమాను యొక్క కుష్ఠరోగము తొలగిపోవుటకును, దేవుని యొక్క నామము మహిమపరచ బడుటకును కారణముగా ఉండెను. ఆమె ఒక ఉపయోగకరమైన పాత్రయే కదా?

ఫిలుపునకు ప్రవచనము చెప్పేటువంటి నలుగురు కుమార్తెలు ఉండెను. అందువలన అనేకమంది ఆదరణను, ఓదార్పును పొందియుండవచ్చును. ప్రభువు వారిని వాడుకొనెను.  అదే విధముగా దోర్కా కూడా ఒక వృద్ధురాలైన స్త్రీయే. అయినప్పటికీ అంగీలను కుట్టి, ధనమును సమకూర్చి, పరిశుద్ధులకు పరిచర్యను చేసెను. ఆమె దేవునికి ఉపయోగకరమైన ఒక పాత్ర.

మీరు ఎట్టి వయస్సు గలవారైనప్పటికీని, ఎట్టి పరిస్థితులయందు జీవించుచున్న వారైనప్పటికిని, ప్రభువునకు ఉపయోగకరమైన పాత్రగా ఉండగలరు. యేసు అరణ్యమునందు ప్రసంగించుచున్నప్పుడు ఒక చిన్నవాడు తన వద్దనున్న అయిదు రొట్టెలను, రెండు చేపలను ఆయనకు ఇచ్చి దానిద్వారా ఐదు వేలమంది పోషింపబడుటకు  ఉపయోగకరమైన వాడిగా ఉండెను.

దేవుని బిడ్డలారా, నేడు మిమ్ములను దేవుని యొక్క గృహములో ఆయనకు ఘనతయును, మహిమయును తీసుకొని వచ్చుచున్న ఉపయోగకరమైన పాత్రగా మిమ్ములను కోరుచున్నాడు. అయిన యొక్క హస్తమునందు ప్రయోజనకరమైన పాత్రగా మీరు ఉపయోగపడుదురా

నేటి ధ్యానమునకై: “నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు”     (యెషయా. 62:3).*ఉపయోగకరమైన పాత్ర!.

*నేటి ధ్యానమునకై: “నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు”     (యెషయా. 62:3).*​

Leave A Comment

Your Comment
All comments are held for moderation.