Appam, Appam - Telugu

మే 29 – జ్ఞానమైయున్న తాళపుచెవి

” అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొని పోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురు”   (లూకా. 11:52).”

ప్రభువు యొక్క వాగ్దానములు మన యొక్క పిల్లల కొరకును, మన యొక్క పరిచర్యల కొరకును ఇవ్వబడియున్నది. బలమైన ఆత్మీయ వరములు మీ భక్తి క్షేమాభివృద్ధి కొరకును, ఆత్మలను క్రీస్తు యొక్క మందలోనికి  చేర్చుటకును కుమ్మరింప బడియున్నది.

నేనొక సేవకుడిని ఎరుగుదును, ఆయన బహు బలముగా పరిచర్యను చేయువాడు. ఆయన యొక్క పరిచర్యద్వారా, బహు గొప్ప ధనికులును, విద్యావంతులును సులువుగా రక్షణ పొందుకొనుచుండుటను చూచియున్నాను. ఆయన చేతులు యందు ఎట్లాంటి ప్రత్యేకమైన తాళపు చెవులను కలిగియున్నాడు  అని తలంచి నేను నివ్వెరపోతుంటాను.

ఆయన చెప్పిన ఒక సంఘటన నా తలంపునకు వచ్చుచున్నది. ఒకసారి ఆయన ఒక ప్రత్యేకమైన ప్రవచనపు వరమును కలిగియున్న సహోదరిని సంధించునట్లు వెళ్లియుండెనట. అప్పుడు అక్కడ ప్రార్థన సమయము నందు, ఆ సహోదరీ ప్రవచనాత్మకముగా,  “కుమారుడా, రాజులును విద్యావంతులు యొక్క హృదయపు తాళపు చెవిని ఇదిగో నేను ఇప్పుడు నీకు ఇచ్చుచున్నాను, విశ్వాసముతో  దానిని తీసుకొనుము”  అని చెప్పి తన చెయ్యిని చాపినారట.

ఈ సేవకుడు కూడా దానిని పొందుకొనుచున్న భావముతో తన యొక్క చెయ్యిని చాపగా, ఆ దినము మొదలుకొని ఆయన యందు ఆత్మీయ వరములు క్రియ చేయుటకు ప్రారంభించాయట. ప్రభువు  మీకు ఇచ్చియున్న వరములను, తలాంతులను దేవుని నామ మహిమ కొరకు వాడుకొనుడి. నేడు అనేకులు తమ సొంత ప్రచారము కొరకును, సొంత అతిశయము కొరకును, సొంత మహిమ కొరకును వాటిని వాడుకొనుచు, అంతమునందు తోట్టిల్లి పడిపోవుచున్నారు.

యేసుక్రీస్తు యొక్క దినములయందు కూడా అదే విధముగా కృపలను దుష్ ప్రయోగము చేయుచున్న ప్రజలు ఉండెను. యేసు వారిని బహుగా ఖండించెను.  “అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొని పోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని  చెప్పెను”   (లూకా. 11:52).

దేవుని బిడ్డలారా, మీరు ప్రభువు వద్దనుండి పొందుకొనుచున్న ఆత్మీయ వరములను, శక్తులను, కృప వరములైయున్న సమస్త తాళపు చెవులను, వ్యర్థముగా దుష్ ప్రయోగము చేయక, ఆ యా తాళపు చెవులను దేవుని నామము యొక్క మహిమ కొరకు వాడుకొనుడి. అప్పుడు మీరు అత్యధికముగా ఆశీర్వదింపబడుదురు.

ప్రభువు మిమ్ములను శ్రేష్టముగా హెచ్చించి బహు శక్తితో ఎత్తి పట్టుకొని  వాడుకొనును. ఆత్మ సంబంధమైన సమస్త వరములతోను, పరలోక సంబంధమైన సమస్త ఆశీర్వాదములతోను నింపి, మిమ్ములను ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించును.

నేటి ధ్యానమునకై: “మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి”   (1.కోరింథీ. 14:12) .

Leave A Comment

Your Comment
All comments are held for moderation.