situs toto musimtogel toto slot musimtogel link musimtogel daftar musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

మే 24 – దినములను లెక్కించు జ్ఞానము

“మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు జ్ఞానమును  మాకు నేర్పుము”   (కీర్తన. 90:12).”

‘జ్ఞానమును ఇచ్చు ప్రభువా, జ్ఞానమును ఇచ్చి మాకు బోధించుము. జ్ఞానము గల హృదయమును కలిగినవారై ఉండునట్లు, మా తలంపులకు జ్ఞానపు వెలుగును దయచేయుము’  అని జ్ఞానయుక్తముగా ఈ ప్రార్ధన చేయబడియున్నది. ఈ దినములు జ్ఞానము పెరిగియున్న దినములై ఉంటున్నాయి. విజ్ఞానము బహుగా అభివృద్ధి చెందియున్నది. ఖగోళశాస్తజ్ఞ్రులు మనలను ఆశ్చర్య పరచుచున్నారు.  మానవుడు చంద్రమండలమును కూడా దాటుకొని రాకెట్నందు వెళుచూనే ఉన్నాడు.

విజ్ఞానపురంగమునందు జ్ఞానము,  వైద్యరంగముందు జ్ఞానము, కంప్యూటరు రంగమునందు జ్ఞానము  అని  పలు రకములైన జ్ఞానములు ఉండినను, ఒక్కడు తన యొక్క దినములను లెక్కించు జ్ఞానమనేది అన్నిటికంటే శ్రేష్టమైనది. తాను జీవించు దినములను గూర్చి ఎవడైతే లక్ష్యముంచుచున్నాడో, అతడు నిత్యత్వమును గూర్చిన తీర్మానములోనికి వచ్చుచున్నాడు.

మీ దినములను గూర్చిన జ్ఞానము మీకు మిగుల అవశ్యమైయున్నది.  అది మీయొక్క  జన్మదినముతో గాని, మీయొక్క వయస్సుతో గాని, ఎన్ని సంవత్సరములు సజీవముగా ఉన్నారు అనుటతో గాని, లెక్కించేటువంటి అంశము కాదు. దినములను లెక్కించు జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానమునైయున్నది. దేవుడు మీకు దయచేసియున్న ప్రతి దినమును, తరుణమును, క్షణ సమయమును  ఆదాయపరచుటయే నిజమైన జ్ఞానము. దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును సద్వినియోగ పరచుకొనుడి అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.

ఏ మనుష్యుడైయితే జ్ఞానముగలవాడై తన దినములను లెక్కించు జ్ఞానమును పొందుకొనుచున్నాడో,  అతడు తన యొక్క గృహమును నిత్యత్వము నందు కట్టుచున్నవాడై ఉండును. ఆత్మీయ జీవితమును చక్కగా కట్టి లేపుకొనును. జ్ఞానము గల మనుష్యుడు బండపై పునాధిని వేయును. తుఫాను వీచినను, అలలు ఎగసి పొంగినను, జ్ఞానము గల ఆ మనిష్యుని యొక్క గృహము కదల్చబడదు.

జ్ఞానము గల మనుష్యుడు తన గృహమును సంపూర్ణముగా కట్టి లేపును.   “జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది….” (సామెతలు.9: 1) ‌ అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది. జ్ఞానము గల మనిష్యుని వలె జ్ఞానము గల కన్యకలను గూర్చి బైబిలు గ్రంధము నందు చదువగలము.  బుద్ధి గల కన్యకలకు ప్రభువు వచ్చుచున్న దినమును గూర్చిన జ్ఞానము ఉండుటచేత, పెళ్ళి కుమారుడ్ని ఎదుర్కొని వెళ్ళుటకు తమ దివిటీలకు కావలసిన సిద్ధపాటుతో వెళ్లిరి.  దివిటీలకు నూనె చాలినంతమట్టుకు కలిగి యుండిరి.

దేవుని బిడ్డలారా, మీ జీవితము నందును పరిశుద్ధ ఆత్మ నిలుపుదల అను నూనె ఉన్నప్పుడు,  జ్ఞానము గల వారిగాను, ప్రభువును సంధించుటకు సిద్ధము గలవారిగాను ఉండెదరు. అంతమాత్రమే కాదు, ఒక గుంపు ఉత్తమమైన జనమును ప్రభువు యొక్క రాకడకు మీరు సిద్ధపరచుదురు. ప్రతిదినమును మీ అభిషేకమును నూతన పరచుకొని,  నిండి పొరిలేటువంటి జీవితముతో ప్రభువు యొక్క రాకడను ఎదురుచూచు సాగుదురుగాక!

 నేటి ధ్యానమునకై: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుడి”    (ఎఫెసీ. 5:15).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.