No products in the cart.
మే 15 – ప్రేమించుటయు, ప్రేమింపబడుటయు
“మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు,….ప్రార్థించుచున్నాను” (ఫిలిప్పీ. 1:9,10)
ఒక అనాధ బాలుర ఆశ్రమము నందు గల వాకిటిలో “ప్రేమించు, ప్రేమించబడు” అను మాటలు పెద్ద అక్షరములతో వ్రాయబడియున్నది. దాని యొక్క అర్థము ఏమని అడిగినప్పుడు ఆ అనాధ బాలుర ఆశ్రమము యొక్క నిర్వాహకుడు చెప్పెను, “మా యెక్క ఆశ్రమమునందు పలు అనాధ పిల్లలు చేర్చబడి పరామర్శించుచున్నాము. మంచి ఆహారము, వస్త్రములు మరియు విద్య మొదలగునవి ఇచ్చుచున్నాము.
అయితే, పిల్లల యొక్క ముఖమునందు ఎట్టి ప్రకాశము లేకుండెను. సంతోషము లేకుండను. అనేక పిల్లలు వ్యాధిబారిన పడి మరణించుచు ఉండెను. కారణము ఏమైయుండునని చూచినప్పుడు, పిల్లలకు పలు అంశములు మెండుగా ఉండినను, చాలినంత ప్రేమ దొరకలేదు అనుట తెలియబడెను. ప్రేమ లోపించుట చేతనే ముఖము నందు ప్రకాశము లేదు అను సంగతిని గ్రహించాము.
కావున క్రైస్తవ తల్లులకు పిలుపునిచ్చి, మీరు వచ్చి, పిల్లలను హక్కునచేర్చుకొని వారి మీద ప్రేమను చూపించుడి అని కోరితిమి. అలాగునె బహు మంచి బుద్ధిగల తల్లులు అనేకులు వచ్చిరి. తమ యొక్క సొంత పిల్లలవలె పిల్లలను ఎత్తుకొని, హక్కున చేర్చుకొని ముద్దు పెట్టికొని ఆనందించిరి. చక్కటి పాటలను చెప్పి నేర్పించి ప్రార్థించిరి. పిల్లల యొక్క ముఖమునందు వెలుగు విరజుమ్ముట ప్రారంభించెను” అని చెప్పిరి.
లోకమే ఏకముగా ప్రేమకై పరితపించుచున్నది. పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమ కొరకును, తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రేమ కొరకును పరితపించుచున్నారు. భర్త భార్య యొక్క ప్రేమ కొరకును, భార్య భర్త యొక్క ప్రేమ కొరకును పరితపించుటను చూచుచున్నాము. లోకమును ఆనందముతో ఉండేటట్లు చేయుచున్నది మహా గొప్ప శక్తి ప్రేమయైయున్నది.
మీ పట్ల ఇతరులు ప్రేమతో ఉండవలెనని కోరుచున్నారా? అలాగైయితే మొదట మీరు ఇతరుల పట్ల ప్రేమ కలిగియుండుడి. అపోస్తులుడైన పేతురు కూడా అట్టి ఆలోచననే మనలోని ప్రతి ఒక్కరికిని ఇచ్చుచున్నాడు. “అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి” (1. పేతురు. 4:8) అని ఆయన చెప్పుచున్నాడు.
ప్రభువు యొక్క ఆజ్ఞలయందు రెండు ఆజ్ఞలు మాత్రమే ప్రధానమైన ఆజ్ఞలు. మొట్టమొదటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ, “నీ దేవుడైన ప్రభువును పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను” (మత్తయి. 22:37) అనుటయైయున్నది.
రెండవ ఆజ్ఞ, “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను. ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవని” (మత్తయి. 22:39,40).
క్రీస్తునకు పండ్రెండు మంది శిష్యులు ఉండినప్పటికిని, యోహాను మాత్రమే ప్రియమైన శిష్యుడని పిలవబడెను. ఆయన యొక్క పత్రికలయందు అంతటా అత్యధికముగా నొక్కి ఒక్కానించబడినది ప్రేమయే.
దేవుని బిడ్డలారా, మీ యొక్క హృదయమునుండి ప్రేమ యొక్క గొప్ప వరద బయలుదేరి రావలెను. అది ప్రభువు యొక్క హృదయము ఆనందింపచేయును. మీ చుట్టూతనున్న కుటుంబసభ్యుల యెుక్కయు, స్నేహితుల యొక్క హృదయమును ఆనందింపచేయును.
నేటి ధ్యానమునకై: 📖”మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల, దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసుకొందురనెను” (యోహాను. 13:35).