No products in the cart.
మే 13 – క్షేమమును, నెమ్మదియును
“నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక” (కీర్తన. 122:7)
సమాధానమును, క్షేమమును ఎంతటి గొప్ప ఆశీర్వాదములు! ఏ కుటుంబమునందు అయితే దైవీక సమాధానమును, దైవీక ఆరోగ్యమును ఉండునో అట్టి గృహము భాగ్యముగలది. ప్రభువు నేడును మిమ్ములను ఆశీర్వదించి, ‘ నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక’ అని చెప్పి దీవించుచున్నాడు.
నేను పలు ధనవంతులను ఎరిగియున్నాను. గొప్ప ఉద్యోగస్తులను చూచియున్నాను. వారు రాజ భవనమువలె గొప్ప గృహములయందు నివశించుటయును, ఆస్థులును పాస్థులును మరియు విస్తారమైన పనివాళ్లతోను వసతులతో జీవితమును జీవించుటయును చూచియున్నాను.
అయితే వారి యొక్క హృదయమునందును కుటుంబమునందును సమాధానము ఉండుట లేదు. శరీరమునందు గల వ్యాధులును, మరియు సమస్యలును జీవితమును చేదుమయముగా చేయుచున్నది. “ఎన్ని కోట్ల ధనము ఉండినను ప్రయోజనము ఏమిటి? జీవితమునందు నెమ్మది లేదే” అని కన్నీటితో చెప్పుచున్నారు.
మీ యొక్క గృహము ఎలా ఉన్నది? మీ యొక్క హృదయమునందు దైవీక సంతోషమును, సమాధానమును ఉన్నదా? లేక కడలి యొక్క అలలు మరలా మరలా వచ్చి ఒడ్డును కొట్టుచున్నట్లు బాధలును, వేదనలును, వ్యాధులును, రోగములును మీ యొక్క జీవితమునందు కొట్టుచునే ఉన్నదా?
నేడు మీరు ఎట్టి పరిస్థితులయందు ఉండినను, సమాధాన కర్తయైన యేసుక్రీస్తును దృఢముగా పట్టుకొనుడి. ‘నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు (యోహాను. 14:27) అని సెలవిచ్చిన సమాధాన కర్తను మీ యొక్క గృహములోనికి తెచ్చుకొనుడి. ఆయన యొక్క పాదములను పట్టుకుని, ‘దేవా నా యొక్క కుటుంబమునందు సమాధానము కలుగునుగాక’ అని గోజాడుడి.
ఒకసారి శిష్యులంతా కలత చెంది, ‘యేసుక్రీస్తును శిలువేసియున్నారే, మాకు ఏమి సంభవించునో? అని తపించినప్పుడు, తలుపులు మూసుకొని గదిలోనున్న శిష్యుల మధ్యలో యేసు అద్భుతముగా ప్రత్యక్షమై చెప్పిన మొదటి మాట “మీకు సమాధానము కలుగును గాక” అనుటైయున్నది (యోహాను. 20:19).
అలా సెలవిచ్చిన ప్రభువు ఎన్నడును మారనివాడైయున్నాడు. ఎక్కడైతే గలిబిలి గందరగోళమును, బాధయు ఉంటున్నదో, అక్కడ సమాధానమును తీసుకొని వచ్చుటకు జాలియు, కృపయు గెలవాడైయున్నాడు.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “ఆయనే నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు” (కీర్తన. 147:14). ఈ వాగ్దానమును ప్రభువు మీకు తిన్నగా ఇచ్చిన వాగ్ధానముగా తీర్మానించుకొనుడి. ‘మా కుటుంబమునందును, మా హృదయమునందును దైవీక సమాధానమును దయచేయుము. ఇప్పుడే మా యొక్క కుటుంబమునందు గల ఉప్పెనలను, తుఫానులను అణచి, నిమ్మలపరచి సమాధానమును తీసుకొని రమ్ము’ అని చెప్పి ప్రార్థించుడి.
దేవుని బిడ్డలారా, ప్రభువు నిశ్చయముగానే మీ జీవితమునందు అద్భుతములను చేయును. నా బిడ్డలు ఎన్నడును సిగ్గునొందరు అను వాక్కును జ్ఞాపకము చేసుకొనుడి.
నేటి ధ్యానమునకై: 📖”నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయును” (1. దినవృ. 12:18).