No products in the cart.
మార్చి 25 – పోయబడిన నామము!
“నీవు పూసుకొను పరిమళతైలము సువాసనగలది; నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము” (ప.గీ. 1:3).
యేసుక్రీస్తు అను నామమును ధ్యానించి చూడుడి. అట్టి నామము తండ్రియైన దేవుడు తన యొక్క ఏకైక కుమారునికి దయచేసిన నామము. యేసుక్రీస్తు అను నామమనునది ఆశ్చర్యకరుడుగు నామము. ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి (యెషయా. 9:6).
దావీదు రాజు సంతోషముతో చెప్పెను: “యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది” (కీర్తనలు. 8:1).
మనము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుచున్నప్పుడు, ఆయన తనయొక్క నామమును మన నొసటియందు వ్రాసి ఇతడు నా వాడు అని ముద్రవేయుచుచున్నాడు. “నా పేరు పెట్టబడిన నా జనులు” (2. దినవృ. 7:14) అని ఎంతటి అధికారముతో చెప్పుచున్నాడో చూడుడి.
అంత మాత్రమే కాదు, “మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును” (యోహాను. 14:13,14) అని వాగ్దానమును చేసియున్నాడు.
యేసు తన యొక్క శిష్యులను చూచి ప్రేమతో చెప్పెను: “ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీరు పొందుకొందురు” (యోహాను. 16:24).
ఒక చిన్నది మిగుల పేదరికముతోను, విద్యాజ్ఞానము లేనిదై ఉండవచ్చును. అయితే ఒక మిగుల గొప్ప ధనవంతుడు ఆమెను వివాహము చేసుకొనుచున్నప్పుడు, ఆ ధనవంతుని యొక్క పేరు ఆమెకు పెట్టబడుచున్నది. అది ఆమెకు ఒక గొప్ప అంతస్థును, ఔన్నత్యమును దయచేయుచున్నది.
అదే విధముగా, యేసుక్రీస్తు అను నామము మీకు గొప్ప అంతస్థును, ఏలుబడిని, ఘనతను దయచేయుచున్నది. ఎందుకనగా ఆయన పరలోకమందును, భూమియందును సకల అధికారమును కలిగియున్న రాజాధిరాజు.
మీరు ప్రభువు యొక్క నామమును గూర్చి గొప్ప ఔన్నత్యమును కనబరచుడి. ప్రార్థనయందు ఆయన యొక్క నామమును ముందు పెట్టి తండ్రి వద్ద అడుగుడి. “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును” (యోహాను. 16:23) అని యేసుక్రీస్తు వాగ్దానమును చేసియున్నాడు కదా?
“యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి (వెళ్లి) సురక్షితముగా నుండును” (సామెతలు. 18:10). మీకు ప్రభువు తన యొక్క అమూల్యమైన నామమును అనుగ్రహించియున్నాడు. అట్టి నామమును తన యొక్క బిడ్డలపై కుమ్మరించుట కొరకే ఆయన భూమికి దిగి వచ్చెను.
అట్టి నామము బలమైన నామము. అట్టి నామమునందు విడుదల కలదు, రక్షణ కలదు, సమాధానము కలదు. దేవుని బిడ్డలారా, అట్టి నామమును స్వతంత్రించుకొనుడి. క్రీస్తు యొక్క నామము మీకు పెట్టబడియున్నది.
నేటి ధ్యానమునకై: “భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను” (ఫిలిప్పీ. 2:10,11).