No products in the cart.
మార్చి 18 – ప్రేమించెను!”
“మనలను ప్రేమించుచు, తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించి, తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను” (ప్రకటన. 1:6).
మిమ్ములను ప్రేమించిన క్రీస్తు యొక్క ప్రేమను ధ్యానించి చూడుడి. జగత్తుత్పత్తికి ముందుగానే ఆయన మిమ్ములను ప్రేమించెను. మీరు ఆయనను ఏర్పరచుకొనుటకు ముందుగానే ఆయన మిమ్ములను ఏర్పరచుకొనెను.
తల్లి యొక్క గర్భమునందే ఆయన మిమ్ములను చూచుటకు ప్రారంభించెను. మిమ్ములను పేరు పెట్టి పిలిచెను. మీరు ఆయనను విడిచి దూరముగా వెళ్లిపోయినను దుఃఖముతోను వేదనతోను మీ వెనుకే నడిచి వచ్చెను. మీరు ఆయనను నిర్లక్ష్యము చేసి తృణీకరించినప్పటికిని కన్నీటితో నిండిన కన్నులతో మిమ్ములను గమనించుచునే ఉన్నాడు.
అంత మాత్రమే కాదు, లోకము అను పాపపు బురద గుంటలో నుండి ఆయన మిమ్ములను లేవనెత్తెను. కల్వరి సిలువ యొద్దకు తీసుకొని వెళ్లి నిష్కలంకమైన, అమూల్యమైన రక్తమును కుమ్మరించి మీ పాపము నంతటిని కడిగివేసెను, దోషములను శుద్ధీకరించెను. అంత మాత్రమే కాదు, తండ్రియగు దేవుని ఎదుట ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఎంతటి కృప! ఎంతటి కనికరము!
ఓడలో నావికుడిగా పనిచేసిన ఒక సహోదరుని ఎరుగుదును. ఆయన లోకము యొక్క సుఖములయందును, పాప పూరిత జీవితమునందును బ్రతుకుచు వచ్చెను. ఆయన ప్రభువును తలంచకపోయినను ప్రభువు ఆయనకు ఎన్నో అద్భుతములను చేసి, ఎన్నో విపత్తుల బారి నుండి కాపాడి త్రోవ నడిపించెను. ఆయన నావికుడిగా తీసుకొని వెళ్ళిన సరుకు గల ఓడ మరొక ఓడను గుద్దుకొని మంటలు అంటుకొని కాలిపోవలసిన ప్రమాదము వచ్చెను. అందులో కూడాను ప్రభువు కృపగా ఆయనను కాపాడెను. అయితే ఆయన, ప్రభువు యొక్క ప్రేమను కనీసము తలంచి కూడా చూడలేదు.
ఒకసారి ఆయనకు పలు లక్షల నష్టము ఏర్పడు ఒక పరిస్థితి వచ్చెను. అప్పుడు ఒక విద్యా జ్ఞానము లేని దైవ సేవకుడు ఆయన వద్దకు వచ్చి: “అయ్యా, నేను నేడు మీ కొరకు ప్రార్ధించినప్పుడు ప్రభువు నా వద్ద ఈసారి కూడాను అతనికి నేను కనికరము చూపెదను. ఈసారి కూడాను అతనిని సమస్యల నుండి విడిపించెదను” అని చెప్పెను అనెను.
ఆ మాటను విన్న వెంటనే ఆ ఓడ నావికుడు విలపించి ఏడ్చెను. ప్రభువు యొక్క ప్రేమ ఆయన యొక్క అంతరంగమును శ్రవింపజేసెను. ఎంతటి ఆశ్చర్యము! ఆయనకు ఏర్పడవలసిన నష్టము ఏర్పడక ప్రభువు ఒక అద్భుతమైన మార్గమును తరిచెను. ప్రభువు మంచివాడు అను సంగతిని ఆనాడే ఆ సహోదరుడు రుచి చూచెను.
ప్రేమ ప్రేమను కోరుచున్నది, దేవుని ప్రేమ యొక్క లోతు మనుష్యుని యొక్క ప్రేమ కొరకు తపించి నిలబడుచున్నది. పేతురు యొక్క జీవితమునందు లెక్కించలేని అద్భుతములను చేసినవాడు: “యోహాను కుమారుడగు సీమోను, వీరందరికంటే అధికముగా నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని దీనుడై అడుగుటను బైబిలు గ్రంధమునందు చూచుచున్నాము.
దేవుని బిడ్డలారా, నేడు అదే ప్రశ్నను ప్రభువు మీ వద్ద అడుగుచున్నాడు. మీరు ప్రభువును ప్రేమించుచున్నారా? పూర్ణ హృదయముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ ప్రాణముతోను ఆయనను ప్రేమించుచున్నారా?
నేటి ధ్యానమునకై: “పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి” (ఎఫెసీ. 5:2).
