No products in the cart.
మార్చి 18 – పాతాళము భారి నుండి విజయము!
“ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు” (కీర్తన. 16:10)
ఆదాము యొక్క పాపము నిమిత్తము, పాత నిబంధన పరిశుద్ధులు, పాతాళమునందు సాతానుచే చెరలో ఉంచబడిరి. యాకోబు దుఃఖముతో, “నెరసిన వెండ్రుకలు గల నన్ను (మృతులలోకము) పాతాళములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురు” (ఆది. 42:38) అని చెప్పెను. “పాతాళపు పాశములు నన్ను అరికట్టగను” అని దావీదు చెప్పెను (కీర్తన. 18:5). “పాతాళము నాకు ఇల్లు అను ఆశయే” అని యోబు భక్తుడు చెప్పెను (యోబు. 17:13).
అయితే యేసుక్రీస్తు కల్వరి మరణముచేత, సాతానును జయించుటతోపాటు మరణమును, పాతాళము కూడా జయించెను. పాతాళము యొక్క తాళపుచెవిని సాతాను యొక్క హస్తము నుండి లాక్కొని, పాతాళములోనికి వెళ్లి, సాతానుచే చెరలో ఉంచబడిన పాత నిబంధన యొక్క పరిశుద్ధలందరినీ చెర నుండి విమోచించెను. “ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చు చున్నదిగదా?” (ఎఫెసీ. 4:9). “క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి,
పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను” (1.పేతురు. 3:18:20).
పాతాళమునకు వెళ్లి కూడా యేసునివలన ప్రసంగించగలడు. పాతాళపు శక్తులు ఆయనను జయించలేకపోయెను. పాతాళము నందుగల పాత నిబంధన పరిశుద్ధులను విమోచించుటకై, తన యొక్క రక్తమును చెల్లించెను. మొదటి నిబంధన యొక్క కాలమునందు జరిగిన అపరాధముల నుండి నివర్తి చేయుటకై, ఆయన మరణించెను అని హెబ్రీ 9:15 ‘వ వచనము నందు చదువుచున్నాము. పాత నిబంధన పరిశుద్ధల యొక్క పాపములు కప్పబడియుండెను గాని, పూర్తిగా కడిగి శుద్ధికిరింపబడలేదు (కీర్తన. 32:1). వారు సంపూర్ణముగా శుద్ధికరింపబడుటకు, యేసుక్రీస్తు యొక్క కల్వరి మరణము వరకును వారు కనిపెట్టుకొని ఉండవలసినదై ఉండెను.
అబ్రహాము యొక్క రొమ్మున లాజరు విశ్రాంతి నొందుటను ధనవంతుడు పాతాళము నుండి చూచెను. ఎందుకనగా సిలువ మరణము తర్వాత అంతమందిని యేసు చెరనుండి విమోచించి ఉన్నతమునకు ఎక్కి వెళ్లెను” (ఎఫేసి. 4:8). అప్పుడే “పరదేశు” అనేటువంటి తోటను ఏర్పాటు చేసెను. ఆనాడు ఆయనతో కూడా మరణించిన దొంగయు, పాత నిబంధన పరిశుద్ధులతో పరదేశునందు విశ్రమించెను.
పాతాళమును జయించుటకు ఆయనకు సహాయకరముగా ఉన్నది ఆయన యొక్క పునరుద్దానపు శక్తియే. అట్టి శక్తిని అపోస్తులుడైన పౌలు ఆశతో అన్వేషించెను. “….ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ….” అని ఆయన వ్రాయుచున్నాడు. అందునిమిత్తము, సమస్తమును, నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాడు” (ఫిలిప్పీ. 3:10).
నేడును పాతాళము యొక్క శక్తిని జయించేటువంటి అధికారమును ప్రభువు మీకు దయచేసియున్నాడు. పాతాళము యొక్క ద్వారాములు ఎన్నడును మిమ్ములను జయించజాలదు అని వాక్కును ఇచ్చియున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క సువార్త శక్తిచేత, పాతాళమునకు వెళ్ళుచున్న వారిని విమోచించి పరలోక మార్గమునకు తీసుకొని రండి.
నేటి ధ్యానమునకై: 📖”మృతుడనైతిని, గాని ఇదిగో, యుగయుగములు సజీవుడనై యున్నాను. ఆమెన్; నేను మరణముయొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనమందు కలిగియున్నాను” (ప్రకటన. 1:18).