No products in the cart.
మార్చి 14 – ఒకరినొకరు!
“మీరు ఒకరి నొకరు ప్రేమింపలెను” (యోహాను. 13:34).
ఒకరినొకరు ప్రేమింపవలెను అను క్రీస్తు యొక్క ప్రేమతో కూడిన ఆజ్ఞ మరలా మరలా పన్నెండు సార్లు కొత్త నిబంధనయందు చోటుచేసుకుని ఉన్నది. ప్రేమగల ఎట్టి తండ్రియైనను తన యొక్క బిడ్డలు ఒకరికొకరు ప్రేమతోను, ఐక్యమత్యముతోను, సమాధానముతోను ఉండవలెను అని ఎదురుచూచును కదా?
“నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ” (యోహాను. 15:12). “మీరు ఒకనినొకడు ప్రేమింపవలెననియు, యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను” (యోహాను. 15:17). “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల, దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను”. (యోహాను. 13:35) అని యేసుక్రీస్తు ఎంతగానో స్పష్టముగా ప్రేమను గూర్చి సెలవిచ్చియున్నాడు!
ప్రేమ యొక్క మార్గము అని పిలువబడుచున్న క్రైస్తవ మార్గము నేటికీ చీలికలచే నిండియున్నది. సంఘమునకు సంఘము మధ్య చీలిక. సేవకుని సేవకుడి మధ్య చీలిక. పలు సంఘములయందు సంఘ పెద్దలును, సేవకులును న్యాయస్థానములకును, కావలి నిలయములకును చుట్టూతా తిరుగుతూ ఉండుట ఎంతటి దౌర్భాగ్యమైన అంశము! దైవీక ప్రేమను కోల్పోయి స్వార్థపరులుగా జనులు మారిపోవుటయే నేటికి గల కారణము. ప్రభువా, మా యొక్క ప్రేమ లేని తనమును క్షమించుము; దైవీక ప్రేమను మా హృదయమునందు కుమ్మరించుము” అని మనము గోజాడుటకు బద్ధులమైయున్నాము.
ఇంకా, తప్పుడు ఉపదేశముల చేత సంఘములయందు చీలికలు అత్యధికములై ఉన్నాయి. నత్త నడకతో గల పోకడయు, ఆడంబరముయందు ఆశయు పలు బృందములుగా చీలిపోయి ఉన్నాయి. ప్రేమ గల దేవుడు వీటినంతటిని సహనముతో సహించుచు ఉన్నాడు.
మనము ప్రభువు యొక్క శిష్యులము. ఆయన యొక్క విశ్వాసులము, ఆయన ఎలాగున ప్రేమ కలిగియుండెనో, అలాగున మనము కూడాను ఉండునట్లుగా పిలవబడిన వారము. క్రీస్తు యొక్క స్వభావములు గుణాతిశయములు మనలోనికి రావలెను కదా? క్రీస్తు యొక్క ప్రేమయు, జాలియు, కనికరమును మనయందు కనబడవాలెను కదా?
మనము పరిశుద్ధాత్ముని యొక్క పరిపూర్ణమైన ఏలుబడిలోనికి సమర్పించుకుని క్రీస్తు యొక్క ప్రేమను, జాలిని, ఆయన యొక్క మారని గుణాతిశయములను మనలోనికి తీసుకొని వచ్చుదము గాక! క్రీస్తు యొక్క స్వభావములు పరిపూర్ణముగా మనలో రూపించబడుటకు సమర్పించుకుందుముగాక! అప్పుడే ఇతరులను క్రీస్తు యొక్క ప్రేమలోని పరిపూర్ణత లోనికి త్రోవ నడిపించగలము.
బలమైన సంఘము, బలహీనమైన సంఘము, పెద్ద సంఘము, చిన్న సంఘము, అత్యధిక రాబడి గల సంఘము, రాబడి తక్కువ గల సంఘము, పరిపూర్ణ సువార్త సంఘము, అర్థ సువార్త సంఘము, పెండ్లి కుమార్తె సంఘము, ఆధరణ లేని సంఘము అను వ్యత్యాసమును మనము చూపించు కొనక, మనమందరమును క్రీస్తు యొక్క ఒకే రక్తము చేత విమోచింపబడిన వారము, ఓకే ఆత్మ చేత దాహము తీర్చబడిన వారము, ఓకే తండ్రి మనకు కలడు అని గ్రహించి, ప్రభువు యొక్క కుటుంబముగా ఐక్యమత్యముతో ముందుకు కొనసాగి వెళ్లుదుము గాక.
నేటి ధ్యానమునకై: “భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు ఆప్యాయతను అమర్చుకొనుడి” (2. పేతురు. 1:7).
