bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

మార్చి 13 – వ్యాధి నుండి విజయము!

“నేను ఐగుప్తీయులకు కలుగజేసిన (రోగాములలో) వ్యాధులలో  ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే”    (నిర్గమా. 15:26) 

యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న దినములయందు సంపూర్ణ ఆరోగ్యముతో ఉండెను. ఒక్క దినము కూడా బలహీనపడి, పరిచర్యను చేయలేక ఉండలేదు. మీరు దేవుని యొక్క బిడ్డలగుటచేత,  దైవీక ఆరోగ్యముతో విజయపు నడకను వేయుడి. ఎట్టి బలహీనమైనను మిమ్ములను సమీపింపకుండునట్లు కాచుటకు ప్రభువు శక్తివంతుడైయున్నాడు.

కొందరు శరీర ఆరోగ్యమునకు సంబంధించిన భద్రతావిధులను నిర్లక్ష్యము చేయుచున్నారు. వర్షములో తడిచి, తలను తుడుచుకొనక విడిచిపెట్టినట్లయితే, జ్వరము వచ్చే తీరును. జ్ఞానముతో నడుచుకొనుటకు ప్రభువు మీకు ఇచ్చిన బుద్ధిని, జ్ఞానమును, వివేకమును మీరు వినియోగించుకొనవలెను.  అత్యధికమైన సమయమునందు బరువును శిరస్సుపై పెట్టుకొనుచు,  ఎల్లప్పుడును, ఒతిడితో ఉండినట్లయితే, రక్తపు పోటు జబ్బు వచ్చే తీరును. కలతచెంది, కలవరపడుచు ఉన్నట్లయితే, పలురకాల జబ్బులు వచ్చును అనుట లోక నీతి.

అనేక వ్యాధులకు దయ్యములును అపవిత్రాత్మలును కారణమగుచున్నది.  బైబిలు గ్రంథము,    “అపవాదికి చోటు ఇవ్వకుడి”   అని హెచ్చరించుచున్నది. అనేకులు మనస్సాక్షి లేకుండా నడిచి, సాతానునకు తమ్మును అమ్మి వేసుకుని వ్యాధులచేత బాధించబడుచున్నారు.  వ్యాధులకు వేలకొలది కారణములు ఉండవచ్చును.  అయితే వాటన్నిటిని  మించిన పరిపూర్ణ స్వస్థతను, ఆరోగ్యమును పొందుకొనుటకు, బైబిలు గ్రంథము చక్కటి పద్ధతి గల మార్గములను చూపించుచున్నది.

మోదటిగా, ప్రభువు యొక్క స్వరమును శ్రద్ధగా విని దానికి లోబడుడి.   “మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన (రోగాము) వ్యాధులలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే”    (నిర్గమ.15:26) అని  ప్రభువు వాగ్దానమును ఇచ్చియున్నాడు. అవును, ప్రభువునకు లోబడుటచేత స్వస్థతను, ఆరోగ్యమును, కలుగును.

రెండోవదిగా, వ్యాధి మీకు రాకుండా ఉండునట్లు, కనికరము గలవారై ఉండుడి. బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది,   “బీదలను కటాక్షించువాడు ధన్యుడు; ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును; భూమి మీదవాడు ధన్యుడగును,  వాని శత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు”   (కీర్తన. 41:1-3).

యేసు వ్యాధిగ్రస్తులందరిని స్వస్థపరిచెను. వ్యాధులను తీసుకుని వచ్చిన అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేను. పరిశుద్ధాత్ముని సహాయము వలన, పైనుండి వచ్చుచున్న శక్తిని పొందుకొని, సంపూర్ణ ఆరోగ్యము గలవాడై ఉండెను. ఆయన యొక్క ఉపవాసమునకును, పరిచర్యకును ఎట్టి వ్యాధియు ఎన్నడును ఆటంకముగా ఉండలేదు అను సంగతిని బైబిలు గ్రంధమునందు చూచుచున్నాము.   క్రీస్తు యొక్క అడుగుజాడలను వెంబడించి మీరును వ్యాధులపై జయముగలవారై ఉండుడి.

నేటి ధ్యానమునకై: 📖”విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును”    (యాకోబు.  5:15).

  

Leave A Comment

Your Comment
All comments are held for moderation.