bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam - Telugu

మార్చి 12 – పాపమునుండి విజయము!

“(ఆయన) యేసుక్రీస్తు పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు”    (1.పేతురు. 2:22)

పాపము వలన కలుగుచున్నటువంటి నష్టము ఎంతటి ఘోరమైనది అను సంగతి అనేకులకు తెలియటలేదు. ఈ పాపము అనునది అనేకులను బాల్య ప్రాయమునందే అంటుకొనుచున్నది. అనేకులు బాల్యమునందే పాపపు అలవాటులకు బానిసలై పోవుచున్నారు. అందుచేత వీరి యొక్క శేషకాలపు జీవితము  నాశనమగుచున్నది. అయితే క్రైస్తవ జీవితము పాపమునకు విరోధముగా పోరాడి, జెయించేటువంటి ఒక జీవితమైయున్నది.

పాపమును జయించుట ఎలాగు అనేటువంటి ప్రశ్న మీ యొక్క మనస్సునందు  తలెత్తినట్లయితే, క్రీస్తు ఏ విధముగా పాపమును జయించెను అను సంగతిని గమనించి చూడుడి. అట్టి రహస్యములను అనుసరించుడి.  యేసుక్రీస్తు  మాత్రమే, నూటికి నూరు శాతము పరిశుద్ధడై ఉండి, పాపమును జయించెను. ఆయనతో కూడా మూడున్నర సంవత్సరములు భుజించి, నిద్రించి, ఆయన యొక్క శిష్యుడైయుండిన పేతురు,   “ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు”   అని వ్రాయుచున్నాడు.

పాపము దేవునికి, మనుష్యునికిని మధ్య విభజనను కలుగజేయుచున్నది  (యెషయా. 59:2).  పాపము వ్యాధియును  మరణమును తీసుకొని వచ్చుచున్నది.    “పాపము యొక్క జీతము మరణము”    (రోమి. 6:23)  అనియు.  “పాపము చేయుచున్నవాని ప్రాణము మరణము నొందును”   (యెహేజ్కేలు. 18:20)  అనియు.   “తన పాపములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు”   (సామెతలు. 28:13) అనియు బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది.

యేసుక్రీస్తును గమనించి చూడుడి!  ఆయన తాను పుట్టినది మొదలుకొని కల్వరి సిలువయందు వేలాడుచున్నంతవరకు ఒక పాపమును చేయకుండునట్లు తన్ను కాపాడుకొనెను.  ఈ భూమి మీద పరిశుద్ధ జీవితము సాధ్యమే అను సంగతిని నిరూపించి చూపించెను. ఆయన తన యొక్క తలంపునందు కూడా పాపమును ఎరుగలేదు. మీరును క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించుడి. ఆయన చూపించిన అడుగు జాడలయందు నడచి, విజయమును స్వతంత్రించుకొనుడి.

ఒక మనిష్యుడు పాపమును చేయకుండా జీవించుట ఎలాగు?  మొట్టమొదటిగా, ముందుగా చేసిన పాపముల కొరకు సిలువ చెంతకు వచ్చి నిలవబడి,  క్రీస్తుని వద్ద పాపక్షమాపణను పొందుకొనవలెను. ఆయన మీయొక్క పాపములన్నిటిని క్షమించి, దోషములన్నిటిని తీసివేయుటకు దయా సంపన్నుడైయున్నాడు.

మీ యొక్క పాపములు కెంపువలె ఎర్రగా ఉండినను, దానిని పత్తివలె తెల్లగా చేయును. నిజమైన పశ్చాతాపంతో మీయొక్క పాపములను ఒప్పుకుని తరువాత,    “దేవా నీ యొక్క బలముచేత,  పరిశుద్ధ జీవితమును జీవించుటకు నాకు సహాయము చేయుము”  అని గోజాడుడి.  నిశ్చయముగా క్రీస్తు మీకు సహాయము చేయును.

మీరు పరిశుద్ధాత్ముని చేత నింపబడుచున్నప్పుడు, పాపమును జయించి, జయించేటువంటి బలమును పరిశుద్ధాత్ముడు మీకు దయచేయును.  మీరు క్రీస్తును,    “పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ,పరిశుద్ధుడు” అని కొనసాగించి ఒప్పుకోలు చేయుచున్నప్పుడు, ఆయన తానే పాపముల నుండి విజయమును పొందుటకు మీకు  సహాయము చేయును. దేవుని బిడ్డలారా,  పాపమును జయించి బ్రతుకునందు వీరులై నడవుడి.

నేటి ధ్యానమునకై: “మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు”    (రోమీ. 6:14).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.