No products in the cart.
మార్చి 06 – సువాసనను వెదజల్లు రోజా పుష్పము!
“నేను షారోను పొలములో పూయు రోజాపుష్పము వంటిదానను, లోయలలో పుట్టు వల్లిపద్మము వంటిదానను” (ప.గీ. 2:1).
రోజా పుష్పము అనునది తేనెటీగలను గాని మిడతల వంటి కీటకాలను గాని వెతుక్కుంటూ వెళ్ళనవసరము లేదు. దానిలో అందమును, తేనెయు, సువాసనయు ఉండుట చేత, నిశ్చయముగానే మిడతలు కీటకాలు సమీపించి తమకు తాముగా దానిని వెతుక్కుంటూ వచ్చుచున్నాయి. అలాగునే మనము కూడాను దైవీక ప్రేమ చేత ఉండినట్లయితే, మనము ఆత్మలను వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరము లేదు. ఆత్మలే మనలను వెతుక్కుంటూ వచ్చున్నట్లుగా దేవుడు పంపించును.
రోజా పుష్పము కొంత కాలము మట్టుకే ఉండును. అదేవిధముగా యేసు క్రీస్తు ఈ భూమి మీద కొంత కాలమే జీవించెను. పరిశుద్ధాత్ముని అభిషేకము పొందుకొని మూడున్నర సంవత్సర కాలము మాత్రమే పరిచర్యను చేసెను. అయితే అది ఎంతటి ప్రయోజనకరమైన పరిచర్య! ఆయన పరమునకు ఎక్కి వెళ్లి రెండువేల సంవత్సరములు అయినప్పటికి ఆయన యొక్క ఉపదేశము లోకమంతటా వ్యాపించి సువాసనను వెదజల్లు చూనే ఉన్నది.
మనము ఎన్ని సంవత్సరములు జీవించుచున్నాము అనుట ప్రాముఖ్యమైనది కాదు, అయితే మనము ఎలా జీవించుచున్నాము అనుటయే ప్రాముఖ్యమైనది. మనము జీవించుచున్న ఈ ఒకే ఒక్క జీవితము బహు త్వరగా గతించిపోవును. అయితే ఈ జీవిత కాలమునందే ప్రభువును ఆప్యాయతతో, ఆయనను ప్రేమించవలెను ఆయన కొరకు పరిచర్యను చేయవలెను.
అవును, మన యొక్క జీవిత కాలమంతయును క్రీస్తును ప్రతిభంభించుచున్న వారిగా ఆయన కొరకు సువాసనను వెదజల్లు సుగంధముగా మనము ఉండవలెను. కావున మీ యొక్క జీవితమును ప్రభువైన యేసు క్రీస్తునకు సమర్పించుకొనుడి. ఆయనే మీయొక్క అంతరంగమును, గృహమును నింపుచున్నవాడు.
సుగంధ సువాసనగల జీవితమే విజవంతమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము. మనము మన యొక్క జీవితమునందు ఎల్లప్పుడును డాగు ముఢత లేని పవిత్రతను కోరుకొనవలెను. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఆయనయందు ఇట్టి నిరీక్షణను పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును” (1. యోహాను. 3:3).
‘క్రీస్తుద్వారా మాకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము’ అని భేరించుచున్నాడు అపో. పౌలు. “మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడును విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడువారి పట్లను, నశించువారి పట్లను, మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము” (2. కోరింథీ. 2:14,15) అని ఆయన చెప్పుచున్నాడు.
దేవుని బిడ్డలారా, మిమ్ములను గుచ్చుచున్న ముండ్లను గూర్చి రవంత కూడా చింతించక ప్రభువు కొరకు సువాసనను పరిమళించుటకు తీర్మానించుడి. అపో. పౌలును కూడా ఒక ముళ్ళు గుచ్చుచూనే ఉండెను. ఆ ముళ్ళను తొలగించునట్లుగా ఎంతగానో విన్నపము చేసెను. ప్రభువు ఇచ్చిన జవాబు ఏమిటి? “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని” (2. కొరింథీ. 12:9) అనుటయే. ఎంతటి ఆదరణకరమైన మాట!
నేటి ధ్యానమునకై: “బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది” (ప.గీ 2:2).
