Appam, Appam - Telugu

ఫిబ్రవరి 18 – నా సంఘము!

“నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును; పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు” (మత్తయి.16:18).

ప్రభువు యొక్క బిడ్డలకు ప్రభువు ఇచ్చుచున్న ఒక గొప్ప ఆశీర్వాదము దేవుని యొక్క ఆలయమునైయున్నది. అదియే ప్రభువు యొక్క ఆలయము. ప్రభువు యొక్క ఆలయమును ఎన్నడను పాతాళలోకము యొక్క ద్వారములు జెయించజాలవు. సంఘముతోను, విశ్వాసులతోను, దైవ సేవకులతోను సహవాసమును కలిగియున్నవారు ఎన్నడును కదల్చబడరు.

సంఘమును గూర్చి ప్రభువు మూడు రకములైన వాగ్దానములను ఇచ్చియున్నాడు. నేను నా సంఘమును కట్టుదును, సంఘమునకు పరిశుద్ధాత్మను పంపించెదను, సంఘము కొరకు మరలా తిరిగి వచ్చెదను అనుటయే అట్టి వాగ్దానము. సంఘమును దేవుని యొక్క పట్టణము అని పిలువ వచ్చును. సంఘము సర్వోన్నతుడు నివాసము చేయు పరిశుద్ధ స్థలము అని చెప్పవచ్చును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణము మధ్యలోనున్నాడు, దానికి చలనము లేదు; అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు” (కీర్తనలు. 46:4,5).

దేవుడు పంపించుచున్న నదియే పరిశుద్ధాత్మ అను నదియైయున్నది. ఆలయ ఆరాధనలో ఆత్మయందు నింపబడి పాడుచున్న పాటలు, ఆత్మీయందు నింపబడి స్తుతించుచున్న ఆరాధన, ఆత్మలో నింపబడి ప్రసంగించుచున్న లేఖన వచనములు అను మొదలగునవి అన్నియును దేవుని యొక్క ప్రతి బిడ్డను ఆత్మలో బలపరచి కాపాడుచున్నది.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మరియు, స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొఱ్ఱెపిల్ల యొక్కయు సింహాసనము నొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను” (ప్రకటన. 22:1,2). పరలోకపు దేవుడు అక్కడి నుండి పరలోకపు నదిని దేవుని యొక్క ఆలయము ద్వారా పంపించి ఇచ్చుచున్నాడు. దేవుని ప్రజల యొక్క దాహమును తీర్చునట్లుగాను, దేవుని ప్రజలు శుధ్దీకరించు బడునట్లుగాను ఆ నది బయలుదేరి వచ్చుచున్నది.

మీరు ఎన్నడును సంఘ ఐక్యతను నిర్లక్ష్యము చేయకుడి.

ప్రభువు యొక్క బిడ్డల సహవాసము మీకు బహు బలముగా ఉండవలెను. “సమాజముగా కూడుటను కొందరు మానుకొను చున్నట్టుగా, మానక, ఒకనినొకడు హెచ్చరించుచు కొనవలెను” (హెబ్రీ. 10:24).

సంఘము లేక ఆలయము అని చెప్పుచున్నప్పుడు, దానిని రెండు గొప్ప విభజనగా విభజించవచ్చును. ఒకటి దృశ్యమైన ఆలయము. మరొకటి అదృశ్యమైన ఆలయము. మనము చూచుచున్న విధముగా రాళ్లతోను మట్టితోను కట్టబడుచున్న భవనము దేవుని యొక్క ఆలయము అని పిలవబడుచున్నది. అదే సమయములో అదృశ్యమైన ఆలయము అదృశ్యుడైన క్రీస్తు యొక్క శరీరము. అది పరలోకమునందు పేరు వ్రాయబడియున్న సార్వత్రిక సంఘమైయున్న సంఘము. లోకమంతట ఉన్న పరిశుద్ధులందరిని ఆత్మ ద్వారా చక్కగా అమర్చబడి కట్టబడుచున్న దేవుని యొక్క భవనము.

దేవుని బిడ్డలారా, భూసంబంధమైన ఆలయములోను మీరు పాలు పొంది దేవుని ఆరాధించవలెను. అదే సమయమునందు అదృశ్యమైన పరలోకపు కుటుంబమైయున్న సంఘములోను మీరు ఆనందించి ఉల్లసించవలెను. ఆలయమము యొక్క ఆశీర్వాదములు మీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాయి.

నేటి ధ్యానమునకై: “నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు; నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము” (కీర్తనలు. 65:4).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.