Appam, Appam - Telugu

ఫిబ్రవరి 15 – ధన్యుడు!

“యెహోవాను నమ్ముకొనువాడును, యెహోవాను తనకు ఆశ్రయముగా కలిగియుండువాడును ధన్యుడు” (యిర్మీయా. 17:7).

ప్రభువు మీద మనము నమ్మికను ఉంచుచునచనప్పుడు, ప్రభువు మనయందు సంతోషించి, మనలను ఆశీర్వదించుచున్నాడు. మనము ఆయనను నమ్మక పోయినట్లయితే ఆయన దుఃఖపడుట సహజమే కదా! దేవుని రుచిచూచినవారును, దేవుని యొద్ద మేళ్లను పొందుకున్నవారును తమ యొక్క నమ్మికను ప్రభువును విడిచి మనుష్యుల వైపునకు త్రిర్పుచున్నప్పుడు, ఆయన యొక్క హృదయము వ్యాక్కులత చెందును కదా?

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నరులను ఆశ్రయించి, శరీరులను తన కాధారముగా చేసికొనుచు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు” (యిర్మీయా. 17:5).

ఆనాడు ఫిలిస్తీయులు అందరును తమ యొక్క నమ్మికను గొప్పవాడైన గొల్యాతుపై ఉంచిరి. అతడు ఒక రాక్షస జాతివాడు. గాదు అను ఊరిలో ఉన్న గొప్ప యోధుడు. అతని యొక్క గొప్ప ఆకారము, రూపము, యుద్ధ ఆయుధములను అతడు ఒక భయంకరమైన వాడు అని చూపించుచున్నది. అతనికి సాటి అయిన వాడును అతనిని ఎదిరించి నిలబడువాడును ఒక్కడును ఇశ్రాయేలీయులయందు లేరు అని చెప్పి ఇశ్రాయేలీయులు అందరును అతనిని చూచి వనిగిపోయిరి.

అయితే, అక్కడ ఒక యూదుడైన యవ్వనస్థుడు వచ్చెను. ఎట్టి యుద్దమునందును అలవాటు లేనివాడు అతడు. ప్రత్యేకమైన ఆయుధములు ఏదియు అతని వద్ద లేదు. ఎందుకంటే, అతడు ప్రభువు పైనే పూర్తి నమ్మికను ఉంచి ప్రభువునే తన నమ్మికగా కలిగియున్నవాడు. అతడే దావీదు.

అతి చిన్న దావీదు, రాక్షసుడును ఫిలిస్తీయులలో గొప్ప వీరుడైయున్న గొలియాతును చూచి: “అయితే నేను, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల కధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను” (1. సమూ. 17:45) అని చెప్పుటతో పాటు ప్రభువు యొక్క నామములో విజయమును పొందెను.

మీ యొక్క నమ్మిక ఎల్లప్పుడును ప్రభువుపైన ఉంచడి. మనుషులపైన ఉంచకుడి, తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును? అదేవిధముగా, ఐశ్వర్యముందును, ధనమునందును మీయొక్క తలంపులను ఉంచకుడి.

తన ఐశ్వర్యమునందు నమ్మికను ఉంచి ఒక మనుష్యుడు తన ప్రాణముతో మాట్లాడుచు: “నీవు సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము” అనెను. “అయితే దేవుడు అతనిని చూచి: “వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ యొద్ద నుండి నీ ప్రాణము తీసివేయబడును, అప్పుడు నీవు సిద్ధపరచినవి ఎవని వగునను” (లూకా. 12:19,20) అని ఆతనితో చెప్పెను.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “గర్విష్ఠులనైనను త్రోవవిడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు” (కీర్తనలు. 40:4). ఎందుకనగా దేవుడు నమ్మకస్థుడు, మాట తప్పనివాడు, అబద్ధము ఆడనివాడు. దేవుని బిడ్డలారా, ప్రభువుపై నమ్మికను కలిగియున్న మీరు నిజముగానే ధన్యులు.

నేటి ధ్యానమునకై: “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము; ఆయనే నీ కార్యము నెరవేర్చును” (కీర్తనలు. 37:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.